3, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5202

4-8-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్”

(లేదా...)

“కుందేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్”

(రావిపాటి లక్ష్మినారాయణ గారి 'సమస్యాపూరణ' గ్రంథం నుండి)


5 కామెంట్‌లు:


  1. ముందున్న వనమ్మున నా
    నందముతో నడచు వేళ నారియె చూపెన్
    మందారము పై గల యా
    కుం దేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్.


    ముందున్నట్టి వనమ్ములో సఖునితో బోనంబునే సేసి యా
    నందంబందున సంచరించు తరినిన్ నా కంటితో గాంచిృతిన్
    బృందా! పైన నభమ్ము నంటెడి విధిన్ వృక్షమ్ము క్రిందున్న యా
    కుం దేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్.

    రిప్లయితొలగించండి
  2. శా.
    సందోహంబుగ రైతు బిడ్డ పొలమున్ సమ్మానమౌ రీతిలో
    కందుల్ నాటుచునుండ దూరమున నా కన్వింపుగా గింజలన్
    విందుల్ వోలిక చూచి చక్కగ దినం వీతెంచి యా నీటిఁ దా
    కుం, దేలున్, వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్ !

    రిప్లయితొలగించండి
  3. కందం
    అందాలొలుకుచు ముంగిట
    చిందులు వేయు పసిపాపఁ జేరంగ వడిన్
    ముందుకు ప్రాకి కదుప నా
    కుం, దేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    శార్దూలవిక్రీడితము
    అందాలొల్కుచు పాపయే పెరట దోగాడంగ కన్విందుగన్
    జిందుల్ వేసెడు పిల్లలున్ మసలగన్ జేరంగ తేలచ్చటన్
    సందేహింపక దైవలీలఁ గన నాశ్చర్యమ్ము! ప్రాకంగ నా
    కుం, దేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్

    రిప్లయితొలగించండి
  4. పొందికగ పిండి తోడనె 
    చందముగ తయా రు జేసె జంతువుల బొమల్ 
    తొందరగ నెండ బెట్టగ
    కుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  5. సుందర రూపమ్ము కలిగి
    సందడి చేయుచు తిరిగిన చరణాయుధమే
    తొందర పాటువిడిచి కడ
    కుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    [కడకున్ + దేలును]

    పందెంబంచు వరించితెచ్చెనతడే ప్రఖ్యాతమౌ రీతి పెం
    పొందింపంగ లభించినట్టిరకమే పోట్లాటలో గెల్వగా
    సందోహంబుగ కూడియుండ జనులే సంపూర్ణమౌ పూతరే
    కుందేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్

    [పూతరేకున్ + దేలున్]

    రిప్లయితొలగించండి