15, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్య - 5214

16-8-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన”

(లేదా...)

“మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా”


12 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      వానలేదంచు తపియించె వసుధమిగుల
      రాకరాక మచ్చితివీవు ప్రజలుమెచ్చ
      కుండపోతగ వర్షింప గోరినంత
      మొయిలు పైపైనఁ! బులకలు భూమిపైన!

      చంపకమాల
      దయగనవేలనో వరుణ! దైన్యము గాంచవె తల్లడిల్లగన్
      నియమిత కాలమీ ఋతువు నేరకయుంటిమి నీదురాకకై
      చయముగ వచ్చితీవు చలచల్లని గాలుల స్వాగతమ్మనన్
      మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా!

      ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

      తొలగించండి
  2. చ.
    భయమిక లేదు కర్షక తపమ్ములు పండెను చూడు శీర్షమె
    త్తి యిపుడు కారుగాలమున తీవ్ర రవి ప్రభలాగి వచ్చెన
    య్య యెదల దోచు రీతులను హాయిని పంచి చిర్జల్లు చిల్కగన్
    మొయిలు గమించె బైపయిన బుల్కలు గల్గెను భూమిపై భళా !

    రిప్లయితొలగించండి
  3. వాన కురిసెను దండిగ వసుధపైన
    సదనమున కొకరుగ వ్యాధి జవిగొనంగ ,
    మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన 
    వగచ నింగికి నేలకు వావి కలదె ?

    రిప్లయితొలగించండి

  4. వర్షములు లేక రైతులు బాధపడెడి
    తరుణమందున నురుములు మెరుపు లవియె
    మొదలగుచును భారముగను కదులు చుండ
    మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన.


    భయపడి రయ్యొ కర్షకులు వర్షము లన్నవి లేక నచ్చటన్
    మెయియది వ్రయ్యలయ్యెనని మిక్కిలి బాధను చెందు వేళలో
    బయలును మేఘడంబరము ప్రాయణమౌచు మృదుత్వమందునన్
    మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా.

    రిప్లయితొలగించండి
  5. వేడి గాడ్పులు భువిపైన విచ్చలుగను
    జనుల నుక్కిరిబిక్కిరి సలిపి వెడలె
    స్వాస్థ్యమును గూర్చ నరుదెంచె జలమునుఁగొని
    మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన

    రిప్లయితొలగించండి
  6. దయితునితో సమాగమము దక్కని ప్రేయసి యూరుపో యనన్
    దయ విడనాడి వేసవిని తద్దయు నూష్మము సందడించగన్
    రయముగ నంతరిక్షమున రంజన గూర్చుచు మానవాళికిన్
    మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా

    రిప్లయితొలగించండి
  7. భయమునఁ గృషీవలురచట వర్షములకుఁ
    స్వయముగ పరికింపఁ దొడగె శబ్దగుణము
    హొయలుగ తరలు మబ్బులు ద్యోతకమయె
    మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన

    భయపడు కర్షకాళి తమ పంటలకున్ దగు నీటి కోసమై
    స్వయముగ వీక్షసేసిరట సత్పధమందున వాన జాడకై
    హొయలుగ సాగుచున్నవట వ్యోమమునందున మేఘమాలికల్
    మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా

    రిప్లయితొలగించండి
  8. వరుణ దేవుడు క రు ణించి వర్ష మొ సగ
    నిర్ణయించి న వేళ లో నిర్మ లంపు
    గగన మందున దట్ట మై కాను పించె
    మొ యిలు పైపై న పులకలు భూమి పైన

    రిప్లయితొలగించండి
  9. తే॥ వర్షమరుదుగన్ గురియుచు హర్షమునిడు
    గనఁగ రాయల సీమను కలత తొలగ
    రయమగ కురియు చుండఁగ
    రైతు మురియు
    మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన

    చం॥ నియతిగ వాన కుర్వగను నెమ్మిని గాంచుచు మోద మందరే!
    దయఁగనె దైమమీ పగిది ధన్యతఁ గాంతుమటంచుఁ దెల్పరే
    మొయిలు గమించెఁ బైపయిన బుల్కలు గల్గెను భూమిపై భళా
    రయమున వాన తాకిడికి రాయలసీమను హర్ష మొందగన్



    రిప్లయితొలగించండి