13, ఆగస్టు 2025, బుధవారం

సమస్య - 5212

14-8-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వంచకుల కెల్లఁ బాపము పండదేల”

(లేదా...)

“వంచకులైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో”


29 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

ముద్దు మాటలతోడన మోసగించు
వంచకుల కెల్లఁ బాపము పండదేల ?
ఇటుల సందేహపడవలదెన్నడైన
అనువగు సమయమున నది యమర గలదు

విరించి చెప్పారు...


లంచముగ పైకము విరివి బంచి నట్టి
ఖలురె పాలకులగుచును కల్పమందు
సుఖము లెన్నొ బడసెదరె చోద్యమదియె
వంచకుల కెల్లఁ బాపము పండదేల?



మంచిని విస్మరించుచు నమాత్యులుగా వెలుగంగ విత్తమున్
బంచి జనాళి మద్దతును వాసిగ బొందెడి నేతలెల్లరున్
ముంచుచు పేదలెల్లరిని పొందెదరోయి సుఖమ్ము లెన్నియో
వంచకులైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో.



పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
అంచిత ధర్మ మార్గ నియమాన్విత వర్తక పుంగవుండనై
వంచన బుద్ధి వీడితిని పచ్చగ నుండితి మంచి సొమ్ముతో
మించు దురాశచే జనుల మేలిమి విత్తము దోచుచున్న ప
ల్వంచకులైన వారలకు పాపము పండదదేమి చోద్యమో ?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
తప్పు సరిదిద్దుకొని మెల్గ దైవమెంచు!
కత్తినూరెడు సమయమ్ము కావలెనన
నర్థమైన వారీ ప్రశ్ననడుగరెపుడు
"వంచకుల కెల్లఁ బాపము పండదేల?"

ఉత్పలమాల
ఎంచును తప్పుదిద్దుకొన నింగితమేర్పడ దైవమెప్పుడున్
ద్రెంచెడు కత్తికిన్ బదును దేలుటకున్ సమయమ్ము గావలెన్
గించితు ధర్రసూక్ష్మమది నిబ్బరమిచ్చిన రాని ప్రశ్నయే,
"వంచకులైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో? "

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

లంచము జీవితంబునను లాంఛ
నమై వెలుగొందుచుండెనే
ఇంచుక జర్ప రేపయిలు నెవ్వరు
చేతులు తడ్పకున్నచో
సంచయమైన డబ్బులను జావగ
వెంటను దీసుకెల్దురో!
వంచకు లైన వారలకు పాపము
పండ దదేమిచోద్యమో

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ప్రజల మభ్య పెట్టియు పరి పాలకు లయ్యు
కోట్లు కొట్టి వేసి యు పైకి కోవిదు ల వలె
నటన జేసెడి మూర్ఖులు ఘటి కు లట్టి
వంచకుల కెల్ల పాపము పండదే ల?

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మొదటి పాదంలో పాలకులయి అని సవరణ చేయడమైనది

M.B.G.TILAK చెప్పారు...

మంచి కార్యాలనెన్నడో మరచిపోయి
వంచన సలిపి నేతలై వరలు చుంద్రు
ముంచు నెల్లరన్ స్వార్థమే ముఖ్యమనుచు
వంచకుల కెల్లఁ బాపము పండదేల

మంచినిఁ బెంచుచుంటిమని మాటలు చెప్పుచు మోసపుచ్చుచున్
బంచుచు నోట్లకట్టలను పాపపు కార్యములందు పౌరులన్
ముంచిన ముఖ్యనేతలకుఁ మూర్ఖత నిండిన మానసంబుతో
వంచకులైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

రెండవ పాదంలో చివర కోవిదు లన అని సవరణ చేయడమైనది

Dr Murthy Prayaga చెప్పారు...

లంచము గొన్నవారలు పలాయనమైనను గాంచరెవ్వరున్
వంచకులైనవారలకు బాపము పండదదేమి చోద్యమో
మంచిగానున్నవారలకు మాత్రము కష్టములన్ని పైబడున్
సంచిత పుణ్యకార్యములు సాధుజనావళి కేలచేటగున్?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మోసముల జేసి త్రిప్పుచు మీసములను
గద్దెలధిరోహణము జేయు ఖలులునేడు
సౌఖ్యముల దేలియాడుట సామయికమె?
వంచకుల కెల్లఁ బాపము పండదేల?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మంచితనంపు ప్రావణము మాన్యముగా ధరియించి దుర్జనుల్
వంచనజేసి యాశ్రితుల వావిరిగా గడియింత్రు సంపదల్
సంచిత పాపకర్మములు సంచులుగా గరిగొన్నగాని యా
వంచకులైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:ఎవడొ పని లేక జగతి సృష్టించు నంట
పాపులకు శిక్ష లిడుచు కాపాడు నంట
సజ్జనుల నట్టి మాటలు సత్య మైన
వంచకుల కెల్లఁ బాపము పండదేల”?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉత్పలమాల
ఎంచును తప్పుదిద్దుకొన నింగితమేర్పడ దైవమెప్పుడున్
ద్రెంచెడు కత్తికిన్ బదును దేలుటకున్ సమయమ్ము గావలెన్
గించితు ధర్మసూక్ష్మమది నిబ్బరమిచ్చిన రాని ప్రశ్నయే,
"వంచకులైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో? "

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:కాంచన రాశి వోలె కడు కమ్మని పంటలు పండు భూమినే
యెంచుక కొన్న రైతులకు నించుక పండదె! బీజవర్తకుల్
వంచకులైన, వారలకుఁ బాపము! పండ, దదేమి చోద్యమో
యించుక తెల్వి లేని యటు లెవ్విధి రైతులు మోసబోయిరో!
(బంగారు పంటలు పండే భూమిని రైతులు కొన్నారు కానీ విత్తనాల వర్తకులు మోసం చేసారు.పాపం! వాళ్లకి పంటలు పండవు.అనుభవం ఉన్న రైతులు అంత తెలివి లేక ఎలా మోస పోయారో కదా!)

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
వంచకులైన వారలకుఁ బాపము పండదదేమి చోద్యమో !

ఉ.మా :

మించిన కోర్కెలన్ జనుల మెండుగ మోసము చేయు ధూర్తులే
పెంచిన జన్మదాతలను ప్రేముడిఁ జూడక వీడ గీమునే
కాంచగ పుత్రుడున్ నరక కష్టము దీర్చను సూక్తి మీరుచున్
వంచకులైన వారలకుఁ బాపము పండదదేమి చోద్యమో !

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పాప పుణ్య ఫలమ్ముల నాపఁ గలమె
వంచితులఁ బరి కింపఁగ వంచకాలి
యగుట వలదీ పగిది సందియమ్ము నీకు
వంచకుల కెల్లఁ బాపము పండ దేల


సంచిత పాప కార్య ఫల షండము లూరక పోవ వట్టులే
యెంచిన నిక్కమింపుగను నెవ్విధి నూరక పోవ నేర్చు నా
వంచక కోటి పూర్వ భవ వర్షిత పుణ్య తరైక కార్యముల్
వంచకు లైన వారలకుఁ బాపము పండ దదేమి చోద్యమో

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తోడను.."

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'మంచిగనున్న' టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
వంచకులైన వారలకుఁ బాపము పండదదేమి చోద్యమో !

ఉ.మా :

వంచనఁ జేసి జూదమని వావి, నసమ్మతి నేకవస్త్రనున్
కించితు లజ్జలేక సభ కీడ్చిన కిమ్మన రేల పెద్దలే
మంచినిఁ జెప్పరే సతిని మన్ననఁ జేయ, వివస్త్రసేయకన్
వంచకులైన వారలకుఁ బాపము పండదదేమి చోద్యమో !

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

ఓట్లకై వ్యయ పరచితి కోట్ల ధనమ
టంచు గెలిచిన తరువాత వంచన యొన
రించి ప్రజల ధనము తోడ నెదుగుచుండు
వంచకుల కెల్లఁ బాపము పండదేల?