20-8-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్”
(లేదా...)
“రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో”
ఉ.రామకథామృత ప్రబల రావణ వైభవ వర్ణనంబులన్ రోమచయంబునం బులకలుట్టి పడెం జదువంగ కొంటెగా వే మది లంక తాఁ గనగ వెర్రితనంబున లంకిణీ పురా రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో !
భాగవత కావ్యారంభములో పోతన(రాముని సేవించిన కవి) ఉపపాండవ వధ తదనంతరం ఘట్టములో భీముని లో నావేశించిన రాక్షసుని చూశాడను భావముతో...కందంనీమములేవియు నెంచకధామమ్మునఁ గృష్ణ సుతుల ద్రౌణియె చంపన్భీమునినావేశింపగరాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్!ఉత్పలమాలనీమము లన్నియున్ విడచి నీచము నెంచక కృష్ణ సూనులన్ధామము నందు దూరి యతి దారుణ రీతిని ద్రౌణి చంపగన్భీముని మానసంబునను భీకర రీతిని నావహింపగన్రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీమముతోడ భక్తిమెయి నిర్మితిచేసియు రామమందిరంబీమహి రామదాసు నతి పేర్మినిపూజలు చేయువానిన్ప్రామిడి పాదుషా యతని బంధిగజేసియు హింసపెట్టె శ్రీరాముని గొల్చినంత కవి రాజుకుకన్పడె రాక్షసుండహోరిప్లయితొలగించండి
కాముకుడగు రావణుడనుభీమరమున ద్రుంచనెంచి భీకర రూపంబామహనీయుడు దాల్చగ రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్.రాముని దివ్యగాథనట వ్రాయుచు నుండెడి వేళయందునన్ గాముకు డైన రావణుని కావర మాచగ భీకరాకృతిన్ భీమరమందు దాల్చె రఘు వీరుడటంచును తెల్పు నత్తరిన్ రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో.
భామ కుజను విడిపించినరాముని సేవించిన కవి , రాక్షసునిఁ గనెన్బామము తోడ నాతనినొకకామము నిండిన యతనిగ గణుతించెనుగా
రాముడు పంపగ పయనంబై మారుతి కనినమోము పౌలస్త్యునిదేభూమిజ జాడ దొరుకునారాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్!రాముడు సీత జాడఁగని రమ్మని పంపెను గాలిచూలినేభూమిజ జాడకై వెదుక ముందుగ కన్పడె దీవిరాయడేశేముషి వజ్రకంఠునికి శీఘ్రమె జానకి జాడ చిక్కునా?రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో!
ఉ.
రిప్లయితొలగించండిరామకథామృత ప్రబల రావణ వైభవ వర్ణనంబులన్
రోమచయంబునం బులకలుట్టి పడెం జదువంగ కొంటెగా
వే మది లంక తాఁ గనగ వెర్రితనంబున లంకిణీ పురా
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో !
భాగవత కావ్యారంభములో పోతన(రాముని సేవించిన కవి) ఉపపాండవ వధ తదనంతరం ఘట్టములో భీముని లో నావేశించిన రాక్షసుని చూశాడను భావముతో...
రిప్లయితొలగించండికందం
నీమములేవియు నెంచక
ధామమ్మునఁ గృష్ణ సుతుల ద్రౌణియె చంపన్
భీమునినావేశింపగ
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్!
ఉత్పలమాల
నీమము లన్నియున్ విడచి నీచము నెంచక కృష్ణ సూనులన్
ధామము నందు దూరి యతి దారుణ రీతిని ద్రౌణి చంపగన్
భీముని మానసంబునను భీకర రీతిని నావహింపగన్
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినీమముతోడ భక్తిమెయి నిర్మితి
చేసియు రామమందిరం
బీమహి రామదాసు నతి పేర్మిని
పూజలు చేయువానిన్
ప్రామిడి పాదుషా యతని బంధిగ
జేసియు హింసపెట్టె శ్రీ
రాముని గొల్చినంత కవి రాజుకు
కన్పడె రాక్షసుండహో
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికాముకుడగు రావణుడను
భీమరమున ద్రుంచనెంచి భీకర రూపం
బామహనీయుడు దాల్చగ
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్.
రాముని దివ్యగాథనట వ్రాయుచు నుండెడి వేళయందునన్
గాముకు డైన రావణుని కావర మాచగ భీకరాకృతిన్
భీమరమందు దాల్చె రఘు వీరుడటంచును తెల్పు నత్తరిన్
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో.
భామ కుజను విడిపించిన
రిప్లయితొలగించండిరాముని సేవించిన కవి , రాక్షసునిఁ గనెన్
బామము తోడ నాతనినొక
కామము నిండిన యతనిగ గణుతించెనుగా
రాముడు పంపగ పయనం
రిప్లయితొలగించండిబై మారుతి కనినమోము పౌలస్త్యునిదే
భూమిజ జాడ దొరుకునా
రాముని సేవించిన కవి రాక్షసునిఁ గనెన్!
రాముడు సీత జాడఁగని రమ్మని పంపెను గాలిచూలినే
భూమిజ జాడకై వెదుక ముందుగ కన్పడె దీవిరాయడే
శేముషి వజ్రకంఠునికి శీఘ్రమె జానకి జాడ చిక్కునా?
రామునిఁ గొల్చినట్టి కవిరాజుకుఁ గన్పడె రాక్షసుండయో!