17, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5216

18-8-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ముసురు పట్టిన దినము సుఖకరము”

(లేదా...)

“ముసురింతైననుఁ దగ్గకుండఁ గిరియన్ మోదంబు గల్గున్ గదా”

7 కామెంట్‌లు:

  1. ఇక్క పట్టునుండ చిక్కును విశ్రాంతి
    కసరు తేనెలట్టి కథలనెల్ల
    చదివి సంతసించు సమయమాసన్నమై
    ముసురు పట్టిన దినము సుఖకరము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కసితోడన్ బనిచేయకుండ ముసురే కల్గించు నిశ్చింతతన్
      విసుగంతంబగు నింటిపట్టు స్థిరమై విశ్రాంతి చేకూరగా
      రసవంతంబగు కావ్యమెంచి చదువన్ లభ్యంబగున్ వైళమే
      ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా

      తొలగించండి
  2. వేసవి దివసముల వేడిమి కతమున 
    పుడమి క్లేశమొందె భువనము నకు ,
    ఎదురు చూచుచుండ నిపుడిన్నినాళ్ళకు
    ముసురు పట్టిన దినము సుఖకరము

    రిప్లయితొలగించండి

  3. బయటి పనుల కేగ పనియింక లేదయ్యె
    బంధువెవడు రాడు పర్పమునకు
    ప్రశ్నగుర్తువోలె పవళింప గావచ్చు
    ముసురు పట్టిన దినము, సుఖకరము.


    అసహాయుండ్రగుచున్ గృషాణులట తామాకాశమున్ గాంచి ప
    న్నసమున్ దున్నిపరాయణమ్మున నటన్ నాటేసినన్ గాంచ ప
    ర్ణసియేలేదని దైత్యదేవుని నటన్ బ్రార్థించు నవ్వేళలో
    ముసురింతైననుఁ దగ్గకుండఁ గిరియన్ మోదంబు గల్గున్ గదా.

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    ఉల్లితురిమి పెట్టి యిల్లాలు ముచ్చటన్
    మిర్చి బజ్జి ప్రేమ మీరఁ గాల్చి
    నిమ్మ రసము చల్లి కమ్మగ వడ్డించ
    ముసురు పట్టిన దినము సుఖకరము!

    మత్తేభవిక్రీడితము
    దిసలెల్లన్ కరిమబ్బు గ్రమ్ము ఋతువై తీరంగ నాకాశమే
    వసతిన్ జేరగ తెల్లయుల్లి తురుమున్ పల్లెంబునన్ జేర్చియున్
    బసగల్గన్ సతి నిమ్మపిండి రుచిగన్ బజ్జీల వడ్డింపగన్
    ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా!

    రిప్లయితొలగించండి
  5. మ.
    దెసయో యేమొకొ కన్నుదోయికిని యుత్సేకించుచున్ గాంచినన్
    కసి చల్వల్ గొని క్రమ్మె నిప్డు తగు సంకల్పంబుచే మంచుల్
    లసదాక్రాంత విశాల శీతనగ హీర ద్యోతవద్రూఢితో,
    ముసురింతైనను దగ్గకుండ గిరియన్ మోదంబు గల్గున్ గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పాదం సవరణ:-
      "దెసయో యేమొకొ కన్నుదోయికిని యుత్సేకించినన్ దోచునే"

      తొలగించండి