19, అక్టోబర్ 2025, ఆదివారం

సమస్య - 5279

20-10-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చుట్టమ రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్”
(లేదా...)
“చుట్టమ రమ్ము రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో”
(అనంతచ్ఛందం సమూహానికి ధన్యవాదాలతో...)

6 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      గుట్టుగ నిద్రించు సుతుల
      పొట్టనబెట్టుకొనఁగ గురు పుత్రున్, నరుడున్,
      గొట్టఁగన వలదను హరికి
      చుట్టమ? రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్!

      ఉత్పలమాల
      పట్టుచు కోపమూని యుపపాండవులందరి పైన దాడితో
      బొట్టనబెట్టుకొన్న గురు పుత్రుని చంపగనెంచఁ గ్రీడియే
      గొట్టగ నొప్పకే శిరపు గుప్తమణిన్గొనఁ జెప్ప శౌరికిన్
      జుట్టమ? రమ్ము రమ్మనుచు జుట్టును బీకె! నదేమి చోద్యమో?

      తొలగించండి
  2. దట్టముగ బెరిగి నందున
    చిట్టడివగ గానవచ్చె , సిగను గనంగా !
    బట్టతల తెలివి సూచిక ,
    చుట్టమ ! రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్”

    రిప్లయితొలగించండి

  3. తిట్టితి తమాష కోసము
    వట్టి జులాయివని వాని పనులను గనుచున్
    గట్టిగ, నా ముని మనుమని
    చుట్టమ, రమ్మనుచుఁ బిలిచి జుట్టును బీకెన్.


    ఎట్టుల నైన నేమి తన నింతియె కోరిక తీర్చ నెంచుచున్
    బెట్టును వీడి పిల్చెనని పేర్మిని నర్తన శాల లోనికై
    గుట్టుగ యంచు కీచకుడు కోరికతో నట కేగ నచ్చటన్
    చుట్టమ, రమ్ము రమ్మనుచు జుట్టును బీకె నదేమి చోద్యమో.

    రిప్లయితొలగించండి
  4. బిట్టగు కోపము మనమున
    దట్ట ముగా నలము కొన్న దరుణము నందు న్
    గుట్టుగ వానిని ప్రీతిగ
    చుట్టమ రమ్మనుచు బిలిచి జుట్టును బీ కె న్

    రిప్లయితొలగించండి
  5. బొట్టెడు పెంచ కేశములు మూర్ధము నందున షోకుమీరగన్
    బిట్టుగ క్రోధమూనుచును ప్రేమగ చూసెడు పెద్ద బావయే
    పెట్టియ లోని కత్తెరను వేగమె బైటకు తీసి పిల్చుచున్
    చుట్టమ రమ్ము రమ్మనచు జుట్టును బీకె నదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి