11, అక్టోబర్ 2025, శనివారం

సమస్య - 5271

12-10-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాతివ్రత్యమును రమణి పాటింపకుమా”
(లేదా...)
“పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్”
(ఆముదాల మురళి గారి పాలమూరు శతావధాన సమస్య)

4 కామెంట్‌లు:

  1. (రావణుడు సీతమ్మతో పలికే మాటలు)

    శా.
    సీతా నాదు మహత్త్వ కాంతి తతి దిగ్శ్రేణిం బరివ్యాప్తమై
    వాతూలాహి ధర ప్రకామ వర సంపద్ధారచే మీఱె బె
    న్హేతుల్ వోలె జ్వలించుచుండె విరహంబీనాడు గేల్పట్టు నీ
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నడున్ !

    రిప్లయితొలగించండి

  2. నీతిని వీడిన పతిపై
    ప్రీతి యదేలనె చెలిమరి విడువుము వానిన్
    తాతల కాలము కాదిది
    పాతివ్రత్యమును రమణి పాటింపకుమా.


    చేతన్ గాసులె యున్న చాలునిక నీచిత్తేశుడే మూర్ఖుడై
    ప్రీతిన్ గ్రోలి పరిశ్రుతిన్ జనను గా వేశ్యాంగనా వాసమున్
    నీతిన్వీడిన భర్త యున్న సతికిన్ నేచెప్పుమాటియ్య దే
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్.

    రిప్లయితొలగించండి
  3. రాతిన్ బోలిన గుండె యుండవలె మేల్దాపర్ల కెల్లప్పుడున్
    నీతుల్ గీతులవన్నియున్ విడుచుచున్ నిత్యంబు విత్తంబుకై
    ఏతీరైనను నాటలాడవలెయున్ యిష్టంబు లేకుండినన్
    పాతివ్రత్యము పాటిగాదు రమణీ పాటింపరాదెన్నడున్
    మేల్దాపరి= వేశ్య

    రిప్లయితొలగించండి
  4. [రావణుడు సీతతో....]

    సీతా! నీ సోయగమే
    చేతమునలరించుచుండె చింతింపకుమా
    నాతోజతకూడుము చెలి
    పాతివ్రత్యమును రమణి పాటింపకుమా

    నాతోపొందన నర్తనమ్ము సలిపే నాంచారులన్ గాంచితిన్
    సీతా! నీదు విలాసమే విజినమై చిత్తయ్యె నాస్వాంతమే
    నాతోడన్ జతకూడి నీవు మహదానందమ్మునే పొందవే
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్

    రిప్లయితొలగించండి