18, అక్టోబర్ 2025, శనివారం

సమస్య - 5278

19-10-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఎలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను”
(లేదా...)
“ఎలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్”

4 కామెంట్‌లు:

  1. పార్టీ అంతరంగిక సమావేశములో నేతతో సఖులు:

    ఆటవెలది
    హెచ్చరించినంత నెలుకలు వారంచు
    లెక్కజేయకుండ వెక్కిరింప
    లీలలెన్నొ పన్ని యేలికలై రేగి
    యెలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను!

    చంపకమాల
    తలపుల నేరినిన్ మదిని తక్కువగాఁ దలపోయకూడదన్
    మెలకువ లేదొకో? వినక మించెడు వారిని నెల్కలంటివే!
    కలుగుల వీడుచున్ జెలఁగి గద్దెను కైవసమొంద గెల్చి య
    య్యెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్!

    రిప్లయితొలగించండి
  2. తొలి దినముల్ గనంగనిక దూరము, కాలము మారెఁ జూడగా
    పలు దెసలన్ నవీనముగు పద్ధతులన్నియు వచ్చె, పోరుకై
    నిలుప విమానముల్, రిపులు నేర్పుగఁ బంపిరి యాంత్రికంబుగా
    నెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్!!

    రిప్లయితొలగించండి

  3. సఖుని లోహము తెగనమ్మి స్వార్థ చిత్తు
    డా ధనమ్మును కాజేయ యత్న మందు
    పలికె నిట్లు చెలిమరి తో తెలివి లేక
    యెలుకలెల్లఁ జేరి యినుముఁ దినెను.


    పలికెడి కల్ల మాటలను వాస్తవ మంచును నమ్మునట్లుగా
    పలుకగ లేని వాడు పొరపాటును చేసితి నంచు భీతితో
    చెలిమరి సొమ్ము నమ్మియు వచించెను తత్తర పాటు నిట్లుగా
    నెలుకలు పెక్కులై యినుము నెల్లఁ దినెన్ సఖ యేమి సెప్పుదున్.

    రిప్లయితొలగించండి
  4. చ.
    విలవిలలాడుచున్ దనుజు వింతల లోకము వీడి యాశ్రయిం
    ప లలి సమాదరించితిని బద్ధతి జిల్లులు సూపి యింటిలో
    వెలలుచు రేయి నాకలుల వేగము సంధిలి దాగి దాగి యీ
    యెలుకలు పెక్కులై యినుము నెల్ల దినెన్ సఖ యేమి చెప్పుదున్ !

    రిప్లయితొలగించండి