17-10-2025 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?”(లేదా...)“వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్”
ఆటవెలదిగోపకాంతలుండ గోపాల కృష్ణుండుపగలురేయివెంటపడెడు వాడు!నగ్రపూజకెటుల నాతఁడు యోగ్యుండు?వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?
ఉత్పలమాలదూడల పాలనే పొదుగు దొంగగ గ్రోలెడు నల్లకృష్ణుఁడే!వీడడు గోపకాంతలను! వింతగ దోచును పాలువెన్నలన్ !కూడదు ధర్మజా! హరికిఁ గూర్చఁగనెంచెడు నగ్రపూజలున్వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్?
☝☝ శిశుపాలుడు ధర్మరాజు తో...
(శిశుపాలుని మాటలు)ఉ.కూడిన రాజ సంఘముల కొండొక సేపు తలంపు ధర్మజా నేడిట నగ్ర పూజకు వినీల ఘనాఘన రూపుడైన యీ కీడొనరించి మాయలిడు కృష్ణు డనర్హడు దోచ వెన్నకై వాడల వాడలం దిరుగువాడగు చోరుడు దేవు డెట్లగున్!
ఆది భిక్షువయిన యగ్గి కనులవాడు వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?విత్తమర్జునముల విలసిల్లు వానినిగొలిచినంత దీరు గొసరులన్ని
స్నాన మాడు సఖుల శాటులెత్తిన వాడుపరుల యిండ్ల లోన పాలు వెన్న దొంగిలించ బూని తోటి వారల తోడ వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?వాడొక మూర్ఖుడై చెలగి పాలును వెన్నయు మ్రుచ్ఛ లింపగా వాడల లోని గొల్లల నివాసము లన్ నిశి వేళ జేరెడిన్వాడత డంచెఱుంగరె, వివాదము లేల యనర్హు డాతడావాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు, దేవుఁ డెట్లగున్.
చీర లెత్తు కెళ్ళి చీకాకు పరచు చు గొల్ల యిండ్ల పాలు గోరుచు వెన్న దొంగ యగుచు మెలగు దురి తుండు కృష్ణుండు వాడ లందు దిరుగు వాడు వేల్ప?శిశుపాలుని ఆరోపణ-----
రెండవ పాదంలో గోరి అని సవరణ చెయడమైనది
శిశుపాలుడు ధర్మరాజుతోవాడొక దుష్టవర్తనుడు వత్సము లాను రసోత్తమంబులన్వీడక త్రాగుచున్ సతము వ్రేతల కోసము తోటివారితో కూడుచు నుద్భటంబుగను గోలలు చేయుచు తాపతాపకున్వాడల వాడలం దిరుగువాడగు చోరుడు దేవుడెట్లగున్
కొంటెచేష్టల సడిఁ గోరు విధంబునగోపికల వలువలు కొల్లగొట్టెవీడకుండనెపుడు వెన్నను దొంగిలఁవాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?వీడక కొల్లగొట్టుగద వెన్ననుఁ బాలను యిండ్ల లోపలన్వాడెగ వల్లవాంగనల వస్త్రములన్ గొని పోయెఁ జోరుడైవేడుకనూది వేణువును వేగమె దొంగిలె రాధ గుండెనేవాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్
ఆటవెలది
రిప్లయితొలగించండిగోపకాంతలుండ గోపాల కృష్ణుండు
పగలురేయివెంటపడెడు వాడు!
నగ్రపూజకెటుల నాతఁడు యోగ్యుండు?
వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?
ఉత్పలమాల
తొలగించండిదూడల పాలనే పొదుగు దొంగగ గ్రోలెడు నల్లకృష్ణుఁడే!
వీడడు గోపకాంతలను! వింతగ దోచును పాలువెన్నలన్ !
కూడదు ధర్మజా! హరికిఁ గూర్చఁగనెంచెడు నగ్రపూజలున్
వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్?
☝☝ శిశుపాలుడు ధర్మరాజు తో...
తొలగించండి(శిశుపాలుని మాటలు)
రిప్లయితొలగించండిఉ.
కూడిన రాజ సంఘముల కొండొక సేపు తలంపు ధర్మజా
నేడిట నగ్ర పూజకు వినీల ఘనాఘన రూపుడైన యీ
కీడొనరించి మాయలిడు కృష్ణు డనర్హడు దోచ వెన్నకై
వాడల వాడలం దిరుగువాడగు చోరుడు దేవు డెట్లగున్!
ఆది భిక్షువయిన యగ్గి కనులవాడు
రిప్లయితొలగించండివాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?
విత్తమర్జునముల విలసిల్లు వానిని
గొలిచినంత దీరు గొసరులన్ని
రిప్లయితొలగించండిస్నాన మాడు సఖుల శాటులెత్తిన వాడు
పరుల యిండ్ల లోన పాలు వెన్న
దొంగిలించ బూని తోటి వారల తోడ
వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?
వాడొక మూర్ఖుడై చెలగి పాలును వెన్నయు మ్రుచ్ఛ లింపగా
వాడల లోని గొల్లల నివాసము లన్ నిశి వేళ జేరెడిన్
వాడత డంచెఱుంగరె, వివాదము లేల యనర్హు డాతడా
వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు, దేవుఁ డెట్లగున్.
చీర లెత్తు కెళ్ళి చీకాకు పరచు చు
రిప్లయితొలగించండిగొల్ల యిండ్ల పాలు గోరుచు వెన్న
దొంగ యగుచు మెలగు దురి తుండు కృష్ణుండు
వాడ లందు దిరుగు వాడు వేల్ప?
శిశుపాలుని ఆరోపణ-----
రెండవ పాదంలో గోరి అని సవరణ చెయడమైనది
తొలగించండిశిశుపాలుడు ధర్మరాజుతో
రిప్లయితొలగించండివాడొక దుష్టవర్తనుడు వత్సము లాను రసోత్తమంబులన్
వీడక త్రాగుచున్ సతము వ్రేతల కోసము తోటివారితో
కూడుచు నుద్భటంబుగను గోలలు చేయుచు తాపతాపకున్
వాడల వాడలం దిరుగువాడగు చోరుడు దేవుడెట్లగున్
కొంటెచేష్టల సడిఁ గోరు విధంబున
రిప్లయితొలగించండిగోపికల వలువలు కొల్లగొట్టె
వీడకుండనెపుడు వెన్నను దొంగిలఁ
వాడలందుఁ దిరుగువాఁడు వేల్ప?
వీడక కొల్లగొట్టుగద వెన్ననుఁ బాలను యిండ్ల లోపలన్
వాడెగ వల్లవాంగనల వస్త్రములన్ గొని పోయెఁ జోరుడై
వేడుకనూది వేణువును వేగమె దొంగిలె రాధ గుండెనే
వాడల వాడలం దిరుగువాఁడగు చోరుఁడు దేవుఁ డెట్లగున్