30-10-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే”(లేదా...)“చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చ.అరులను జూచి యెడ్తరకు నాజిని స్వేచ్ఛను గూర్చి సింహమైపరువులు పెట్టి చంపెను గృపాణము రక్తముతోడ దడ్వ భూ వరునకు గాయముల్ గలిగె, వైభవ శౌర్య సుసూచకంబులచ్చిరిగిన వస్త్రముల్, గన విశేషముగా నుతియింత్రు సత్సభన్ !
అరుదగు తుఫాను కతమునపురమున వాటికలు నీట మునుగగ వాటిన్సరిజేయు చుండు నప్పుడుచిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే
కందంసిరిగలిగిన లేకున్ననుధరియించుట నాగరికత ధాత్రిని వలువల్కొరతల ప్రోగున గుట్టినచిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే!చంపకమాలఉరువులఁ జూపెడున్ బగిది నొప్పని రీతిగ చించి పీలికల్తరిగిన సంప్రదాయముల దాల్చఁగ నాగరికుల్! విమర్శలన్గురియుచు పోసి కుప్పగను కూడదటంచును గాల్చినంతటన్జిరిగిన వస్త్రముల్! గని విశేషముగా నుతియింత్రు సత్సభన్
తరములు మారెను తాతా బరువది కాయమ్ము నిండ వలువలు దాల్చన్ బరదేశము లందు గనగ చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే.బరువది కాదె కాయమును వస్త్రము నందున దాచుటయ్యదే తరములు మారె నంగముల దాచుటె తప్పని యెంచు చుండిరంచు రమణి చెప్పె నివ్విధిని జూడ విదేశము నందుపౌరులే చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు, సత్సభన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచ.
రిప్లయితొలగించండిఅరులను జూచి యెడ్తరకు నాజిని స్వేచ్ఛను గూర్చి సింహమై
పరువులు పెట్టి చంపెను గృపాణము రక్తముతోడ దడ్వ భూ
వరునకు గాయముల్ గలిగె, వైభవ శౌర్య సుసూచకంబుల
చ్చిరిగిన వస్త్రముల్, గన విశేషముగా నుతియింత్రు సత్సభన్ !
అరుదగు తుఫాను కతమున
రిప్లయితొలగించండిపురమున వాటికలు నీట మునుగగ వాటిన్
సరిజేయు చుండు నప్పుడు
చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే
కందం
రిప్లయితొలగించండిసిరిగలిగిన లేకున్నను
ధరియించుట నాగరికత ధాత్రిని వలువల్
కొరతల ప్రోగున గుట్టిన
చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే!
చంపకమాల
ఉరువులఁ జూపెడున్ బగిది నొప్పని రీతిగ చించి పీలికల్
తరిగిన సంప్రదాయముల దాల్చఁగ నాగరికుల్! విమర్శలన్
గురియుచు పోసి కుప్పగను కూడదటంచును గాల్చినంతటన్
జిరిగిన వస్త్రముల్! గని విశేషముగా నుతియింత్రు సత్సభన్
రిప్లయితొలగించండితరములు మారెను తాతా
బరువది కాయమ్ము నిండ వలువలు దాల్చన్
బరదేశము లందు గనగ
చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే.
బరువది కాదె కాయమును వస్త్రము నందున దాచుటయ్యదే
తరములు మారె నంగముల దాచుటె తప్పని యెంచు చుండిరం
చు రమణి చెప్పె నివ్విధిని జూడ విదేశము నందుపౌరులే
చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు, సత్సభన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి