14-10-2025 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భానుఁడు సోముఁడును గలసి వచ్చిరి వేడ్కన్”(లేదా...)“భానుఁడు సోముఁడుం గలసి వచ్చిరి విందుకు మా గృహంబునన్”(ఆముదాల మురళి గారి పాలమూరు శతావధాన సమస్య)
ఉ.ఏనట వారణాసిని మహేశుని కేశవు శుద్ధ బుద్ధతో బూని నుతింతునెప్డు బహు పుణ్య సమంచిత సిద్ధి నొందగంబూనిక మారు రూపముల బొంది రమా హృదయాబ్జ నేతయౌ భానుడు, సోముడుం గలిసి విందుకు వచ్చిరి మా గృహంబునన్ !
ఈనాటినుండి జతగాపానమునకు బారు జేరవలదని జెప్పన్మానక నేడు సహజలగుభానుఁడు సోముఁడును గలసి వచ్చిరి వేడ్కన్
జానకి రాముని పుత్రులు మేనళ్ళుండ్లని పిరిమిని మేనత్తయె తా బోనము నకుపిలిచె ననుచు భానుఁడు సోముఁడును గలసి వచ్చిరి వేడ్కన్.భానుడు సోముడున్ గలసి వచ్చిన నెట్లు సమస్య యయ్యెనో జానకి పుత్రులిద్దరును సద్గుణ వంతుల టంచు ప్రేమతో బోనము చేయ రమ్మనుచు పొల్తుక పిల్చెనటంచు వారలా భానుఁడు సోముఁడుం గలసి వచ్చిరి విందుకు మా గృహంబునన్.
ఉ.
రిప్లయితొలగించండిఏనట వారణాసిని మహేశుని కేశవు శుద్ధ బుద్ధతో
బూని నుతింతునెప్డు బహు పుణ్య సమంచిత సిద్ధి నొందగం
బూనిక మారు రూపముల బొంది రమా హృదయాబ్జ నేతయౌ
భానుడు, సోముడుం గలిసి విందుకు వచ్చిరి మా గృహంబునన్ !
ఈనాటినుండి జతగా
రిప్లయితొలగించండిపానమునకు బారు జేరవలదని జెప్పన్
మానక నేడు సహజలగు
భానుఁడు సోముఁడును గలసి వచ్చిరి వేడ్కన్
రిప్లయితొలగించండిజానకి రాముని పుత్రులు
మేనళ్ళుండ్లని పిరిమిని మేనత్తయె తా
బోనము నకుపిలిచె ననుచు
భానుఁడు సోముఁడును గలసి వచ్చిరి వేడ్కన్.
భానుడు సోముడున్ గలసి వచ్చిన నెట్లు సమస్య యయ్యెనో
జానకి పుత్రులిద్దరును సద్గుణ వంతుల టంచు ప్రేమతో
బోనము చేయ రమ్మనుచు పొల్తుక పిల్చెనటంచు వారలా
భానుఁడు సోముఁడుం గలసి వచ్చిరి విందుకు మా గృహంబునన్.