16-10-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె”(లేదా...)“రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో”(ఆముదాల మురళి గారి పాలమూరు శతావధాన సమస్య)
ఉ.దైవత ధట్ట కీర్తిత నితాంత మహోజ్జ్వల వైభవంబులంజేవను జూపి గెల్చెనని చెప్పుచు ముంగిట గర్వ రూపుడైలావును చూపు కాలమున రక్కసు లచ్చెరువొంద హృత్స్థలిన్ రావుణు గూల్చె సీత రఘురాము దలంచుచు గడ్డిపోచతో !
దేవళమున విగ్రహముల పీవరమగు ప్రోచ తోడ పెనవేయంగాలావుగ వాటిని లాగగరావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె
తేటగీతిపంకజాక్షుని రాముని వంకలెంచియంతిపురమున జానకి నందుదనఁగనలిపి తృణముగ పోల్చి, మానసికముగనురావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చెఉత్పలమాలకావరమందునన్ జెలఁగి కంజదళాక్షిని సీతఁ జేరుచున్సేవకులెల్లరిన్ మలచి శీఘ్రమె యంతి పురమ్ము జేర్చు సంభావన నిందలాడ పతి, మానసికమ్మగ క్రుంగఁ జూపుచున్రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో
మోహ పరవశు డైనట్టి మూర్ఖు డపుడు వనము జేరి జానకి తోడ పలుక నెంచ గడ్డి పరకను మధ్యన కలికి వేయ నిది గని యంజనీసుతుడిట్లు తలచె రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె.పావని జేరి దానవుడు పాపపు మాటలు పల్కుచుండగా తా విన లేనటంచు సతి తక్షణమే యొక గడ్డి పోచనే రావణు ముందు వేయ గని రాముని బంటు దలంచె నిట్టలన్ రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో.
చెరను బట్టగ జానకి కరము మ్రగ్గి బాధ పడు వేళ మగత గా బవ్వ ళించి స్వప్న మున దాను గాంచి యు పరవ శించె రావణు న్ గడ్డి పోచతో రమణి గూల్చె
ఉ.
రిప్లయితొలగించండిదైవత ధట్ట కీర్తిత నితాంత మహోజ్జ్వల వైభవంబులం
జేవను జూపి గెల్చెనని చెప్పుచు ముంగిట గర్వ రూపుడై
లావును చూపు కాలమున రక్కసు లచ్చెరువొంద హృత్స్థలిన్
రావుణు గూల్చె సీత రఘురాము దలంచుచు గడ్డిపోచతో !
దేవళమున విగ్రహముల
రిప్లయితొలగించండిపీవరమగు ప్రోచ తోడ పెనవేయంగా
లావుగ వాటిని లాగగ
రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె
తేటగీతి
రిప్లయితొలగించండిపంకజాక్షుని రాముని వంకలెంచి
యంతిపురమున జానకి నందుదనఁగ
నలిపి తృణముగ పోల్చి, మానసికముగను
రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె
ఉత్పలమాల
కావరమందునన్ జెలఁగి కంజదళాక్షిని సీతఁ జేరుచున్
సేవకులెల్లరిన్ మలచి శీఘ్రమె యంతి పురమ్ము జేర్చు సం
భావన నిందలాడ పతి, మానసికమ్మగ క్రుంగఁ జూపుచున్
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో
రిప్లయితొలగించండిమోహ పరవశు డైనట్టి మూర్ఖు డపుడు
వనము జేరి జానకి తోడ పలుక నెంచ
గడ్డి పరకను మధ్యన కలికి వేయ
నిది గని యంజనీసుతుడిట్లు తలచె
రావణున్ గడ్డిపోఁచతో రమణి గూల్చె.
పావని జేరి దానవుడు పాపపు మాటలు పల్కుచుండగా
తా విన లేనటంచు సతి తక్షణమే యొక గడ్డి పోచనే
రావణు ముందు వేయ గని రాముని బంటు దలంచె నిట్టలన్
రావణుఁ గూల్చె సీత రఘురాముఁ దలంచుచు గడ్డిపోఁచతో.
చెరను బట్టగ జానకి కరము మ్రగ్గి
రిప్లయితొలగించండిబాధ పడు వేళ మగత గా బవ్వ ళించి
స్వప్న మున దాను గాంచి యు పరవ శించె
రావణు న్ గడ్డి పోచతో రమణి గూల్చె