26-10-2025 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఉప్పు లేని కూరకు రుచి యుండును గద”(లేదా...)“లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ”
మ.కవనోత్సాహ విరాజిత ప్రబల హృద్గాంభీర్య సంపత్తితో కవిరాజిప్పుడు వ్రాసె కావ్యము మహా ఖ్యాతిన్ భువిం బొంద వే కువలన్ రేయుల లెక్క చేయక సదా, క్షుద్బాధలో మున్గ నల్లవణంబింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ !
శాకమేదైన లవణమె చవి నిడిననుజీవికి లవణ మధికమై చెడును గూర్చు ;తనివిగ తినెడు గాతిని దద్దరీతియుప్పు లేని కూరకు రుచి యుండును గద”
హెచ్చె రక్తపోటని వెజ్జు డిపుడె చెప్పె నిక రుచుల వీడి స్వస్థత నిచ్చు నట్టి బోనమున్ జేసిన నదియెముదము గూర్చు ఉప్పు లేని కూరకు రుచి యుండును గద.కవిశ్రేష్ఠుల్ తమ కావ్య మందుగన శృంగారమ్మె ప్రాధాన్యమౌ కావనమ్ముల్ రచియించి నంతనవి సత్కావ్యమ్ము లౌచున్ గదా యవనిన్ నిల్చును నాల్గు కాలములు సత్యంబియ్యదే కాదుటేలవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ?
తేటగీతిఅతియె రాణింపదెందున నవనిపైనవర్తనమ్ముననైనను వంటలందువినయమొప్పును తగినంతయు, నధికముగఉప్పు లేని కూరకు రుచి యుండును గద.మత్తేభవిక్రీడితముఅవనిన్మానవులేది యొప్పరతిగా నాస్వాదనన్మీరినన్వివరంబొప్పెడువర్తనంబు దగుఁ దృప్తిన్ బొందరుచ్యంబులేయవగుణ్యంబగు మించెడున్ వినయమే, యాహారమందెక్కువౌలవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ!
మ.
రిప్లయితొలగించండికవనోత్సాహ విరాజిత ప్రబల హృద్గాంభీర్య సంపత్తితో
కవిరాజిప్పుడు వ్రాసె కావ్యము మహా ఖ్యాతిన్ భువిం బొంద వే
కువలన్ రేయుల లెక్క చేయక సదా, క్షుద్బాధలో మున్గ న
ల్లవణంబింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ !
శాకమేదైన లవణమె చవి నిడినను
రిప్లయితొలగించండిజీవికి లవణ మధికమై చెడును గూర్చు ;
తనివిగ తినెడు గాతిని దద్దరీతి
యుప్పు లేని కూరకు రుచి యుండును గద”
రిప్లయితొలగించండిహెచ్చె రక్తపోటని వెజ్జు డిపుడె చెప్పె
నిక రుచుల వీడి స్వస్థత నిచ్చు నట్టి
బోనమున్ జేసిన నదియెముదము గూర్చు
ఉప్పు లేని కూరకు రుచి యుండును గద.
కవిశ్రేష్ఠుల్ తమ కావ్య మందుగన శృంగారమ్మె ప్రాధాన్యమౌ
కావనమ్ముల్ రచియించి నంతనవి సత్కావ్యమ్ము లౌచున్ గదా
యవనిన్ నిల్చును నాల్గు కాలములు సత్యంబియ్యదే కాదుటే
లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ?
తేటగీతి
రిప్లయితొలగించండిఅతియె రాణింపదెందున నవనిపైన
వర్తనమ్ముననైనను వంటలందు
వినయమొప్పును తగినంతయు, నధికముగ
ఉప్పు లేని కూరకు రుచి యుండును గద.
మత్తేభవిక్రీడితము
అవనిన్మానవులేది యొప్పరతిగా నాస్వాదనన్మీరినన్
వివరంబొప్పెడువర్తనంబు దగుఁ దృప్తిన్ బొందరుచ్యంబులే
యవగుణ్యంబగు మించెడున్ వినయమే, యాహారమందెక్కువౌ
లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ!