24, అక్టోబర్ 2025, శుక్రవారం

సమస్య - 5284

25-10-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్”
(లేదా...)
“కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో యం.యస్.వి. గంగరాజు గారి సమస్య)

3 కామెంట్‌లు:

  1. శా.
    తార్తీయారికి బద్ధులౌచు విషముల్ తాకింపగా బూని దు
    ర్వార్తల్ చూపెడు మాధ్యమంపు జనులీ రాష్ట్రంబులో మంచినే
    కర్తల్ వోలిక మారి ఖ్యాతిరతులై గావించి యీ దుష్టమౌ
    కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్ ‌!

    రిప్లయితొలగించండి
  2. కందం
    కర్తయె కర్మము క్రియ ని
    ర్వర్తనమర్పించి హరికి ఫలమెంచని స
    ద్వర్తన సాగుమనఁగ నే
    కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్?

    శార్దూలవిక్రీడితము
    ధూర్తుల్ మాత్రమె వంచనన్ పరులనే దోచంగ నాశించుచున్
    వర్తింపన్ జగమీసడించుసతమున్ వారిన్ విరోధంబుగన్
    కీర్తింపన్ బ్రజ బాధ్యతాయుతముగన్ గెల్పొందెడున్వారి, నే
    కర్తవ్యంబును విస్మరించినపుడే కళ్యాణమౌ జాతికిన్?

    రిప్లయితొలగించండి
  3. కార్తీక మాస మందున
    ఆర్తుల రక్షిని గొలువక , నన్నము దినుచున్
    మూర్తిని బెంచుకొనెడి , యా
    కర్తవ్యము మరచు జాతి గనును శుభంబుల్

    రిప్లయితొలగించండి