27-10-2025 (సోమవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “అమ్మకుఁ గలదు భార్య యేమని పిలుతురు” (లేదా...) “అమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్” (వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో ముత్యంపేట గౌరీశంకర్ గారి సమస్య)
పిడికెడు మెతుకుల కొరకు వెట్టి చేయు పేద కా యూరి వారలు పెండ్లి సేయ పతియె సర్వస్వ మనియెంచు పడతి నాయు డమ్మకుఁ గలదు భార్య, యేమని పిలుతురు.
*(నాయుడమ్మ అని పురుషులకు పేరు పెట్టుకొనుట కొన్ని చోట్ల కలదు.)*
ఇమ్మహి లోన వాడు కన హీనగుణాత్ముడటంచు లోకులే నమ్మిన మూర్ఖుడొక్కడు వినమ్రత జూపుచు నూరు కంతకున్ నమ్మిన బంటు గా పిలుచు నౌకరతండట యట్టి పేద ద ద్దమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్.
పితర , తాత లిరువురును బిద్ది యుండ,
రిప్లయితొలగించండిముసలి యామె యొకతె మూల మూల్గు చుండె .
నామె నన్ని విధంబుల నాదుకొనగ
నమ్మకుఁ గలదు భార్య ! యేమని పిలుతురు ?
తేటగీతి
రిప్లయితొలగించండిభార్య యుద్యోగియై భర్త వంటవండ
సంకటము వీడె సంతుకు, జనకుని విడి
జనని సఖియఁగొని సహజీవనమునెంచ
నమ్మకుఁ గలదు భార్య యేమని పిలుతురు?
ఉత్పలమాల
అమ్మయె నిత్యమున్ కొలువునందున నుండగ తండ్రివంటలన్
కమ్మగ సంతుకున్ గడచె కాలము కష్టము లేక, తండ్రినే
పొమ్మని కూడగన్ సఖిని ముచ్చటగా సహజీవనమ్మునం
దమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్?
☝నేటి కాల మహిమ...☝
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిడికెడు మెతుకుల కొరకు వెట్టి చేయు
పేద కా యూరి వారలు పెండ్లి సేయ
పతియె సర్వస్వ మనియెంచు పడతి నాయు
డమ్మకుఁ గలదు భార్య, యేమని పిలుతురు.
*(నాయుడమ్మ అని పురుషులకు పేరు పెట్టుకొనుట కొన్ని చోట్ల కలదు.)*
ఇమ్మహి లోన వాడు కన హీనగుణాత్ముడటంచు లోకులే
నమ్మిన మూర్ఖుడొక్కడు వినమ్రత జూపుచు నూరు కంతకున్
నమ్మిన బంటు గా పిలుచు నౌకరతండట యట్టి పేద ద
ద్దమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్.
దిమ్మరి యౌచు దేశములు తిర్గుచు నుండును విందు కెవ్వరున్
రిప్లయితొలగించండిరమ్మని పిల్వకుండిన చలాచలి వెళ్ళి భుజించు తా సదా
వమ్మగు నట్లుగన్ పనులు పాయక చేయుచు నుండు నట్టి ద
ద్దమ్మకు గూడ భార్య గల దామెను నేమని పిల్వగా దగున్