21, అక్టోబర్ 2025, మంగళవారం

సమస్య - 5281

22-10-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆస్తుల పంపకముఁ జేయుమనె భరతుండే”
(లేదా...)
“ఆస్తుల నెల్లఁ బంచుమని యన్నను నా భరతుండె కోరెఁ బో”

5 కామెంట్‌లు:


  1. వాస్తవ మిది యాలించుడు
    నిస్తేజంబది యయోధ్య నీవట లేకన్
    విస్తృత మగు త్యాగ మనెడి
    యాస్తుల పంపకముఁ జేయుమనె భరతుండే.


    విస్తృత ధర్మ వర్తనము పెర్మియు వంశజు లిచ్చినట్టి యా
    యాస్తిని పెద్ద వీవొకడ వందు కొనంగను న్యాయమౌ నటే
    యాస్తిగ నీవు గైకొనిన త్యాగము నాకునొ సంగ మంచు నా
    యాస్తుల నెల్లఁ బంచుమని యన్నను నా భరతుండె కోరెఁ బో.

    రిప్లయితొలగించండి
  2. పస్తులతో రోజులిటులఁ
    గస్తిపడుచు గడుపనేటి కర్మము మనకున్
    శస్తము చేకూరుటకై
    యాస్తుల పంపకముఁ జేయుమనె భరతుండే

    రిప్లయితొలగించండి
  3. ఆస్తులు గల్గినన్ మనకు నప్పుల బాధలు దుస్సహమ్మయెన్
    పస్తుల తోడ నెల్లరము పల్లట మొందుటకన్న నిట్టులన్
    శస్తము చేకురన్ మనసు సాంత్వనమొందఁగనో సహోదరా
    యాస్తుల నెల్లఁ బంచుమని యన్నను నాభరతుండె కోరెఁ బో

    రిప్లయితొలగించండి
  4. ఉ.
    నిస్తర ధర్మ పాలనకు నిద్దపు రూపుడు రామడివ్వనిన్
    హస్తి మహోగ్ర పంచవదనాది విశేష సుజంతు కోటితో
    వస్తువులెల్ల వీడి యిట వచ్చిన రీతిని జూచి బాధలో
    నాస్తుల నెల్ల బంచమని యన్నను నా భరతుండు గోరె బో !

    రిప్లయితొలగించండి
  5. శస్తముగ సతి యితమునిడు
    శాస్తిగ బాధప డుచుండి సంగత మెంచన్
    గేస్తు తనయన్న కొసగిన
    ఆస్తుల పంపకముఁ జేయుమనె భరతుండే”

    రిప్లయితొలగించండి