17, అక్టోబర్ 2025, శుక్రవారం

సమస్య - 5277

18-10-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అల్లుని మంచితనము నహహా రోసిరిగా”
(లేదా...)
“అల్లుని యొక్క మంచితన మందఱుఁ గాంచి యసహ్యమందిరే”

10 కామెంట్‌లు:

  1. ఉ.
    తొల్లిట ప్రేమ నొప్పుకొని తొయ్యలి నిచ్చిరి పెండ్లి జేసి యీ
    తల్లియు తండ్రి నిప్డు పని దక్కగ నూరి చెలంగుచుండ సం
    ధిల్లెను కిన్క, బంధువులు దెల్లము పూర్వపు చూపు మాన ని
    య్యల్లుని యొక్క మంచితన మందరు గాంచి యసహ్యమందిరే !

    రిప్లయితొలగించండి
  2. తెల్లని కాకులఁ జూడము
    అల్లుని మంచితనమసలె యగుపించదుగా
    కల్లల నెపుడున్బలికెడు
    నల్లుని మంచితనము నహహా రోసిరిగా

    రిప్లయితొలగించండి
  3. కల్ల కపట రహితుడగుట
    యల్లుని మంచితనము ; నహహా రోసిరిగా”
    తల్లి పలుకులను నమ్ముచు
    నిల్లాలి నెడపదడపగ నెడముగ నుంచన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    చెల్లదు రణమని సభనన
    మెల్లన మామను గని జగమేలెడు కృష్ణుం
    డల్లన విని కౌరవులా
    యల్లుని మంచితనము నహహా రోసిరిగా!

    ఉత్పలమాల
    చెల్లదు యుద్ధమంచు సభ శ్రీకరుఁడేర్పడ జెప్ప మామతో
    త్రుల్లుచు తూలుచున్ రగిలి దుష్టచతుష్టయమెంచ 'నందులో',
    నల్లన వంశనాశనపు టంశము రేపిన నాప్తబంధువౌ
    యల్లుని యొక్క మంచితన 'మందఱుఁ' గాంచి యసహ్యమందిరే!

    రిప్లయితొలగించండి
  5. అల్లదివో యువతి కచట
    పల్లెన నార్థిక సమస్య బాప దలచి యా
    పిల్లకు సాయము సేసిన
    యల్లుని మంచితనము నహహా రోసిరిగా”*


    పల్లెన వాసమున్న నొక బాగరి యార్థిక బాధ గాంచుచున్
    జెల్లెలటంచు నెంచి తన జీతము లోనను కొంత సొమ్ము మా
    యల్లుడు మంచి మానసము నందు సహాయము జేయ గాంచి మా
    యల్లుని యొక్క మంచితన మందఱుఁ గాంచి యసహ్యమందిరే.

    రిప్లయితొలగించండి
  6. కల్లలనాడుచుండు తనకన్నను సత్పురుషుండు లేడనున్
    తల్లడమందజేయుఁ దన దారను దిట్టుచు మాటిమాటికిన్
    మెల్లగ మాటలాడుచునె మిత్తిని జూపుచునుండు మామకున్
    అల్లుని యొక్క మంచితన మందఱుఁ గాంచి యసహ్యమందిరే

    రిప్లయితొలగించండి
  7. అల్లుడు మేల్బంతి యనుచుఁ
    వాల్లభ్యముతో వితంతువా యోగ్యునిఁ దా
    నల్లుకొనెఁ ద్వితీయంబై
    యల్లుని మంచితన మది యసహ్యంబయ్యెన్

    పిల్లకు యోగ్యుడౌననుచుఁ బెండ్లియొనర్చినదా వితంతువే
    చెల్లెలు కూడ కోరెనని జేసెను వానికిఁ జిన్న భార్యగా
    నల్లుడు సజ్జనుండనుచు నత్తయు వానినిఁ బెండ్లి యాడగా
    నల్లుని యొక్క మంచితన మందఱుఁ గాంచి యసహ్యమందిరే

    రిప్లయితొలగించండి