28, అక్టోబర్ 2025, మంగళవారం

సమస్య - 5288

29-10-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భీష్మద్రోణులకుఁ గలిగె భీషణరణమే”
(లేదా...)
“భీష్మద్రోణుల కాహవమ్ము గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో ఆచార్య వేణు గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. కందం
    కుష్మలమిడఁ పార్థునక
    ర్చిష్మంతుడు, ధనువుఁ బట్టి చెలగిన యంతన్
    విస్మయమొంద నరునితో
    భీష్మద్రోణులకుఁ గలిగె భీషణరణమే!

    శార్దూలవిక్రీడితము
    ఊష్మమ్మయ్యెను శౌర్యమే నరుఁడుఁ దానొందంగ మోహమ్ము! న
    ర్చిష్మంతుండట వేగ గీతనుడువన్ జేబట్ట కర్తవ్యమున్
    భస్మాంగుండిడ కార్ముకమ్ము కృపతో భాసిల్లు గాండీవితో
    భీష్మద్రోణుల కాహవమ్ము గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్!

    రిప్లయితొలగించండి
  2. భీష్ముఁడు ద్రోణాచార్యుడు
    గ్రీష్మములో నూష్మమువలె రెచ్చిలినంతన్
    భీష్మముగా పాండవులకు
    భీష్మద్రోణులకుఁ గలిగె భీషణరణమే

    రిప్లయితొలగించండి
  3. గ్రీష్మమును భీష్ముడెంచగ
    ఉష్మమధికమనుచు ద్రోణు డుల్లేఖించన్
    ఉష్మమడరె నిరువురినడి ,
    భీష్మద్రోణులకుఁ గలిగె భీషణరణమే

    రిప్లయితొలగించండి

  4. భీష్ముని పౌత్రుడు నరునకు
    గ్రీష్మఋతువులో చెలగెడి కీశుండాజ్యో
    తిష్మతిని బోలు వారగు
    భీష్మద్రోణులకుఁ గలిగె భీషణరణమే.


    భీష్ముండాప్తుడు వృద్ధుడైనను మహా వీరుండనిన్ గాంచగా
    గ్రీష్మమ్మందున భానువోలె యనిలో క్రీడించు వారిర్వు రున్
    భీష్మ ద్రోణులు, యుద్ధ రంగమున నా వీరుండు పార్థుండకున్
    భీష్మద్రోణుల కాహవమ్ము గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్.

    రిప్లయితొలగించండి
  5. శా.
    ఊష్మస్ఫార శరౌఘ శక్తి గొని యే యుద్దేశముల్ లేక య
    ర్చిష్మత్తాపములై కిరీటి బలముల్ చెన్నార, దుర్యోదన
    గ్రీష్మాదిత్యు గలన్ విరుద్ధముగ నా రేయిన్ విచిత్రంబుగా
    భీష్మద్రోణుల కాహవమ్ము గలిగెన్ భీష్మంబుగా నత్తరిన్ !

    రిప్లయితొలగించండి