4-2-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము”(లేదా...)“శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్”
తేటగీతిగరళకంఠుని గాధయె స్మరణలేకపాపమున్ భిక్షగాగొన భక్తులలరమరలమరల స్తవము సేయ మఱువ 'నోరు'శివుని నామము, నరులకుం 'జేఁదు సుమ్ము'మత్తేభవిక్రీడితముస్తవనీయమ్మగు లీలలన్ సలిపి దుస్సాధ్యాలు సాకారమైయవనీజాతులు మోదమొందఁగనుచున్ హానిన్ నివారింపగన్భవనాశుండగు చంద్రమౌళి మఱువన్ వల్లింప నోరార నాశివనామమ్ము, సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్
శివ శబ్దంబు శుభంకరమ్మిలను సుశ్రీలన్ ప్రసాదించునేభవు నాశీసుల నంద కీ జగతి సంభావ్యంబుగాదే సుమా!రవళించున్ఘన నామమై సుగతి విభ్రాజిల్లగా నేల నీశివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్?!
ఆస్తికత్వము మూర్ఖత్వమనుచు నేడుహేతు వాదుల మాటలే యింపటంచుతలచినంతట నికపైన ధాత్రియందుశివుని నామము నరులకుం జేఁదు సుమ్ము.ప్రవయుండొక్కడు బాధతోడ సతితో వాచించె నీరీతిగానవభాసమ్మని క్రొత్త పోకడలవే యావిర్భవించెన్ గదాభువిలో దైవపు నామమున్ దలచుటే మూర్ఖత్వ మయ్యెన్ గనన్ శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్.
మరల మరల పలుకుచుండ మధురమౌను శివుని నామము నరులకుం ; జేఁదు సుమ్ముఆశరుల జెవులకు , దాని నాలకించ ,పేరొకటె వేరురుచి , జాతి వేరు కనుక
తేటగీతి
రిప్లయితొలగించండిగరళకంఠుని గాధయె స్మరణలేక
పాపమున్ భిక్షగాగొన భక్తులలర
మరలమరల స్తవము సేయ మఱువ 'నోరు'
శివుని నామము, నరులకుం 'జేఁదు సుమ్ము'
మత్తేభవిక్రీడితము
స్తవనీయమ్మగు లీలలన్ సలిపి దుస్సాధ్యాలు సాకారమై
యవనీజాతులు మోదమొందఁగనుచున్ హానిన్ నివారింపగన్
భవనాశుండగు చంద్రమౌళి మఱువన్ వల్లింప నోరార నా
శివనామమ్ము, సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్
శివ శబ్దంబు శుభంకరమ్మిలను సు
రిప్లయితొలగించండిశ్రీలన్ ప్రసాదించునే
భవు నాశీసుల నంద కీ జగతి సం
భావ్యంబుగాదే సుమా!
రవళించున్ఘన నామమై సుగతి వి
భ్రాజిల్లగా నేల నీ
శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్?!
రిప్లయితొలగించండిఆస్తికత్వము మూర్ఖత్వమనుచు నేడు
హేతు వాదుల మాటలే యింపటంచు
తలచినంతట నికపైన ధాత్రియందు
శివుని నామము నరులకుం జేఁదు సుమ్ము.
ప్రవయుండొక్కడు బాధతోడ సతితో వాచించె నీరీతిగా
నవభాసమ్మని క్రొత్త పోకడలవే యావిర్భవించెన్ గదా
భువిలో దైవపు నామమున్ దలచుటే మూర్ఖత్వ మయ్యెన్ గనన్
శివనామమ్ము సమస్త మానవులకుం జేఁదౌను భావింపఁగన్.
మరల మరల పలుకుచుండ మధురమౌను
రిప్లయితొలగించండిశివుని నామము నరులకుం ; జేఁదు సుమ్ము
ఆశరుల జెవులకు , దాని నాలకించ ,
పేరొకటె వేరురుచి , జాతి వేరు కనుక