20-2-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కవి గాకున్నను మధురముగా రచియించెన్”(లేదా...)“కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్”
కందం:కవి కాడతండు నిరతముకవిసాంగత్యమున మెలఁగు కారణముననేకవిహృదయము నెరుక గలిగికవి గాకున్నను మధురముగా రచియించెన్
మత్తేభము:కవితల్ వ్రాయఁగలేని పామరుఁడు నిష్కామంబుగా నిత్యమున్కవిసాంగత్యమునన్ జరించు కతనన్ గల్గన్ కవిత్వంబునందు విశిష్ఠంబగు నిచ్ఛయున్ మరియు సద్యోజాతమౌ ప్రజ్ఞయున్కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్
ధవళాంగియె కరుణింపగనవిరళ కృషితో నతండు నద్భుతమగు పాటవమును జూపి పురాతనకవి గాకున్నను మధురముగా రచియించెన్.(మరొకటి)దవమున బడితిరుగాడు మృగవధా జీవుడు కన నొక కావ్యము నతడాదివమునె రామాయణమును కవి గాకున్నను మధురముగా రచియించెన్. భువిలో గాంచగ మేటికావ్యమనుచున్ బూజించెడిన్ గ్రంథమున్ దవమందున్ దిరుగాడు వేటకరియే దావంతమున్ జెందుచున్ హవణించెన్ గద రామగాథయని నిధ్యానింప వాల్మీకియే కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్.
అవిరళమైన పురాణపు కవనము లందించి కీర్తి గాంచు విధముగన్ చవినిడు టందున ఘనుడగు కవి గాకున్నను మధురముగా రచియించెన్”
అవిగళమౌ దర్పముతోస్తవనీయపు శిల్పరచన సల్పెడివారల్భువిపై పలువురు జక్కనకవి గాకున్నను మధురముగా రచియించెన్భువిపై పెక్కురు కానవత్తురు గదా పొంగారగా దర్పమేకవులైనన్ మరికాకపోయినఁ సదా కావింతురే యత్నముల్స్తవ నీయంబగు గొప్ప శిల్పరచనన్ జక్కన్న చేబూనెగాకవి గాకున్నను లోకమాన్య రచనా కార్యోన్ముఖుం డయ్యెడున్
కందం:
రిప్లయితొలగించండికవి కాడతండు నిరతము
కవిసాంగత్యమున మెలఁగు కారణముననే
కవిహృదయము నెరుక గలిగి
కవి గాకున్నను మధురముగా రచియించెన్
మత్తేభము:
రిప్లయితొలగించండికవితల్ వ్రాయఁగలేని పామరుఁడు నిష్కామంబుగా నిత్యమున్
కవిసాంగత్యమునన్ జరించు కతనన్ గల్గన్ కవిత్వంబునం
దు విశిష్ఠంబగు నిచ్ఛయున్ మరియు సద్యోజాతమౌ ప్రజ్ఞయున్
కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్
రిప్లయితొలగించండిధవళాంగియె కరుణింపగ
నవిరళ కృషితో నతండు నద్భుతమగు పా
టవమును జూపి పురాతన
కవి గాకున్నను మధురముగా రచియించెన్.
(మరొకటి)
దవమున బడితిరుగాడు మృ
గవధా జీవుడు కన నొక కావ్యము నతడా
దివమునె రామాయణమును
కవి గాకున్నను మధురముగా రచియించెన్.
భువిలో గాంచగ మేటికావ్యమనుచున్ బూజించెడిన్ గ్రంథమున్
దవమందున్ దిరుగాడు వేటకరియే దావంతమున్ జెందుచున్
హవణించెన్ గద రామగాథయని నిధ్యానింప వాల్మీకియే
కవి గాకున్నను లోకమాన్యరచనాకార్యోన్ముఖుం డయ్యెడున్.
అవిరళమైన పురాణపు
రిప్లయితొలగించండికవనము లందించి కీర్తి గాంచు విధముగన్
చవినిడు టందున ఘనుడగు
కవి గాకున్నను మధురముగా రచియించెన్”
అవిగళమౌ దర్పముతో
రిప్లయితొలగించండిస్తవనీయపు శిల్పరచన సల్పెడివారల్
భువిపై పలువురు జక్కన
కవి గాకున్నను మధురముగా రచియించెన్
భువిపై పెక్కురు కానవత్తురు గదా పొంగారగా దర్పమే
కవులైనన్ మరికాకపోయినఁ సదా కావింతురే యత్నముల్
స్తవ నీయంబగు గొప్ప శిల్పరచనన్ జక్కన్న చేబూనెగా
కవి గాకున్నను లోకమాన్య రచనా కార్యోన్ముఖుం డయ్యెడున్