5-2-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఎవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ”(లేదా...)“ఎవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో”
ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు:తేటగీతినొవ్వ పలుమార్లు దండించ నోట పలుకమానవేమిర ప్రహ్లాద మాధవు నుతి!సర్వమయుఁడంటె? చూపించు స్తంభమందునెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ?చంపకమాలఅవధుల దాటె నీ నడత! యా హరి నామజపంబు వీడవే?యవగణ మన్న మానకయె యందువె? సర్వమయుండటంచు! మాధవుడను నీదు దేవునిట స్తంభమునందున జూపు చూతు తానెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో?
ఎవ్వ డెవ్వడనుచు దన కెరుకజేయ మని యొక సమస్య నీయగ ననుగుణముగపూరణ సలుపుటందున బ్రోచుటకయి యెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ” !
ఆగ్రహమ్మున నటజేరి యనఘుడైనభార్గవుండడిగె నట సభాసదులనువిరిచె నెవ్వడట యిచట హరుని చాపమెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ.కవిదల యందు నర్జునుడు గాండివమున్ ధరి యించి నిల్చినన్ పవతుడెవండు నిల్చునిక పార్థునెదుర్కొను వీరుడెవ్వడీ కువలయమందు తెల్పుమని కోరితి నోయి సుయోధనా యెవండెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వడో.
ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు:
రిప్లయితొలగించండితేటగీతి
నొవ్వ పలుమార్లు దండించ నోట పలుక
మానవేమిర ప్రహ్లాద మాధవు నుతి!
సర్వమయుఁడంటె? చూపించు స్తంభమందు
నెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ?
చంపకమాల
అవధుల దాటె నీ నడత! యా హరి నామజపంబు వీడవే?
యవగణ మన్న మానకయె యందువె? సర్వమయుండటంచు! మా
ధవుడను నీదు దేవునిట స్తంభమునందున జూపు చూతు తా
నెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో?
ఎవ్వ డెవ్వడనుచు దన కెరుకజేయ
రిప్లయితొలగించండిమని యొక సమస్య నీయగ ననుగుణముగ
పూరణ సలుపుటందున బ్రోచుటకయి
యెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ” !
రిప్లయితొలగించండిఆగ్రహమ్మున నటజేరి యనఘుడైన
భార్గవుండడిగె నట సభాసదులను
విరిచె నెవ్వడట యిచట హరుని చాప
మెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ.
కవిదల యందు నర్జునుడు గాండివమున్ ధరి యించి నిల్చినన్
పవతుడెవండు నిల్చునిక పార్థునెదుర్కొను వీరుడెవ్వడీ
కువలయమందు తెల్పుమని కోరితి నోయి సుయోధనా యెవం
డెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వడో.