పెట్టు బడియె లేని మెట్టపంటగ జొన్న వేయ నదియె నచట విరివి బండ స్వాస్థ్యతనిడు ననుచు జనులు హెచ్చుగ వాడ పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు.
కరమున లేక పెట్టుబడి కర్శన మందున మెట్ట దాన్యమున్ విరివిగ వేసినంత నది విస్తృత మైఫలి యించె జొన్నయే ధరణిని క్షేమ మిచ్చనుట తథ్యమటంచును వాడినంతటన్ ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో.
ఆ. గంజినీటి కొరకు గత్యంతరములేక గడప గడప త్రొక్కు గతులు బాసి చెలగి చేతివృత్తిఁ జేయువారి శ్రమకు పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
భావం : ఒకప్పుడు గంజి నీళ్ల కోyసం కూడా వేరే దారి లేక, ప్రతి గడప తొక్కుతూ ఇతరులపై ఆధారపడుతూ గడిపిన దీనస్థితులు తొలగిపోయాయి. ఉత్సాహంగా తమ చేతివృత్తులు, నైపుణ్యం నమ్ముకుని కష్టపడేవారి శ్రమకు తగిన గుర్తింపు, విలువ పెరిగింది. దీనివల్ల ఆ పేదవాడు ఎంతో సంతోషించి, ఆ మార్పును మెచ్చుకుంటున్నాడు.
కనక , రజతములను క్రయము జేయదలచ
రిప్లయితొలగించండిపెరిగె ధరలు ; మెచ్చెఁ బేదవాఁడు
దానె కాదు యిపుడు ధనికునికయినను
వీలుపడదు కొనగ విపణిలోన
రిప్లయితొలగించండిపెట్టు బడియె లేని మెట్టపంటగ జొన్న
వేయ నదియె నచట విరివి బండ
స్వాస్థ్యతనిడు ననుచు జనులు హెచ్చుగ వాడ
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు.
కరమున లేక పెట్టుబడి కర్శన మందున మెట్ట దాన్యమున్
విరివిగ వేసినంత నది విస్తృత మైఫలి యించె జొన్నయే
ధరణిని క్షేమ మిచ్చనుట తథ్యమటంచును వాడినంతటన్
ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో.
త్వరితగతిని మారె వాగ్ధాన పరిపాటి
రిప్లయితొలగించండిరాజకీయమందు రాటుదేలి
పౌరులకుచితములు పక్షాలు ప్రకటింప
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
విరివిగ రాజకీయమున వేగముపస్థితి మారిపోయెగా!
త్వరితగతిన్ మహామహులు దానగుణంబును వెల్లడించుచున్
బరిమితిలేనివౌ యుచిత పంపక యోజనముల్ సృజింపగా
ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో
సమస్య : "పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు"
రిప్లయితొలగించండిఆ. గంజినీటి కొరకు గత్యంతరములేక
గడప గడప త్రొక్కు గతులు బాసి
చెలగి చేతివృత్తిఁ జేయువారి శ్రమకు
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
భావం : ఒకప్పుడు గంజి నీళ్ల కోyసం కూడా వేరే దారి లేక, ప్రతి గడప తొక్కుతూ ఇతరులపై ఆధారపడుతూ గడిపిన దీనస్థితులు తొలగిపోయాయి. ఉత్సాహంగా తమ చేతివృత్తులు, నైపుణ్యం నమ్ముకుని కష్టపడేవారి శ్రమకు తగిన గుర్తింపు, విలువ పెరిగింది. దీనివల్ల ఆ పేదవాడు ఎంతో సంతోషించి, ఆ మార్పును మెచ్చుకుంటున్నాడు.