14, ఫిబ్రవరి 2026, శనివారం

సమస్య - 5382

15-2-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,

మహాశివరాత్రి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్”
(లేదా...)
“శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్”

14 కామెంట్‌లు:

  1. శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్,
    శిరసి ధరింతును నీ చరణారవిందముల్।
    భవభయ హరణ పరమేశ్వర పరాత్పర,
    భక్తుల పాలిత పరమానంద కందర॥

    గంగాధర గిరిజా రమణ గౌరీశ,
    నీలకంఠ శూలపాణి జగదీశ।
    అర్ధనారీశ్వర ఆది అనంత,
    ఆనంద తాండవ విహారి చిదంబరాంత॥

    పశుపతి పరమ శివ శాశ్వత మూర్తి,
    పాప విమోచన పవిత్ర కీర్తి।
    ఓంకార స్వరూప ఒళివెలుగు దీప,
    ఉమామహేశ్వర నీకు నా నిత్య స్మృతి దీప॥

    నామస్మరణే మాకు నావకరంబు,
    నీకరుణే మా జీవనారంభంబు।
    శివ హర భవ శంకర శరణు శరణు,
    చిరమున మా మనమున నిలచు పరమధనము॥

    రిప్లయితొలగించండి
  2. శివ కలుగును శివరాత్రిని
    శివ హర భవ శంకర యనఁ ; జేకుఱు నిడుమల్
    భవుని మరచి జీవితమును
    చవి, పరితోషముల తోడ సాగించినచో

    రిప్లయితొలగించండి

  3. భవమన్నది లేదనుచును
    భవుడన్నను కల్పితమని వాచించెడి వా
    డు విడంబనమ్ము తోడను
    శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్.


    ధవనాంశుండను జూటమందున సదాతా దాల్చెడిన్ వాడెగా
    భవనాశుండును రక్షకుండనుచు విశ్వాసమ్ముతో నిత్యమున్
    శివ గౌరీశ్వర శంకరా హర యనన్ , జేకూఱు సర్వాపదల్
    భువిలో మక్కిలు నంచు సర్వరసులౌ మోక్షార్థులే చెప్పిరే.

    రిప్లయితొలగించండి
  4. శివరాత్రినిఁ భక్త జనులు
    శివ హర భవ శంకర యనఁ ,జేకుఱు నిడుమల్
    వ్యవధి రహితమై తొలఁగగ
    భువిపై భక్తుల మనుగడ మోదాన్వితమౌ

    స్తవనీయంబని చంద్రచూడుని సదా శ్లాగింతురే భక్తులే
    శ్రవణానందము కల్గురీతి సతమా సర్వేశ్వరున్ దల్చుచున్
    శివ గౌరీశ్వర శంకరా హర యనన్, జేకూఱు సర్వాపదల్
    వ్యవధానంబు హుళక్కియై తొలఁగగా భాసిల్లునానందమే

    రిప్లయితొలగించండి
  5. కం॥ చవిఁ గనక భక్తిఁ దలఁపక
    భువిలో స్వార్థము విరియఁగ పొడవఁడు నటులన్
    వివరించఁగఁ బర్వ మనుచు
    శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్

    మ॥ చవి లేకుండఁగ భక్తిఁ గాంచకను నిస్త్రాణమ్ముగా నమ్మకన్
    భవుఁడాప్తుండును దేవదేవుడనుచున్ భావించకన్ స్వార్థమే
    యవధుల్ దాటినఁ బర్వమంచు బహు దుష్టాత్ముండు దుశ్శీలుఁడై
    శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్

    భగవంతుడు చూసేది కేవలం సద్వర్తన మాత్రమేనండి
    పొడవడు దుష్టుడు

    రిప్లయితొలగించండి
  6. కం:శివునిన్ ద్వేషించెడు వై
    ష్ణవ గురు డీ రీతి బల్కె "నాయన! మన కే
    శవు డొక్కడె మోక్ష మిడును
    శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్

    రిప్లయితొలగించండి
  7. 2)మ:స్తవముల్ పెక్కు లొనర్చినా విహమునన్ సౌభాగ్యముల్ బొంద న
    య్యవి ప్రాప్తించిన శాశ్వతమ్ము లగునే?యధ్యాత్మ విద్యార్థి వై
    "శివ! గౌరీశ్వర! శంకరా! హర!" యనన్ జేకూఱు సర్వాపదల్,
    భవ రోగమ్ముల బాపు ముక్తి యను సద్భాగ్యమ్ము నీ జన్మలోన్.

    రిప్లయితొలగించండి
  8. శివుడు కరుణించు భక్తుల
    శివ హర భవ శంకర యన :: జేకురు నిడుమ ల్ జవమున దొలగును భక్తులు
    దవి లియు మనసార గొలువ ధార్మిక పరులై

    రిప్లయితొలగించండి
  9. భువి లోన దేవ దేవుని
    నవమానింపఁ దగ దేరి కైనను సత్యం
    బవలోకింపఁగ నెవ్విధి
    శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్


    శ్రవణానందము గల్గ రుద్రునకు వాత్సల్యంబు వర్ధిల్లఁగా
    నవనార్థమ్మున కుత్సహింపఁగ నసాధ్యం బెద్ది వీక్షింపఁగా
    భవ భక్తాలిని నిర్దయం గదియు నాపద్రాజి కెల్లన్ వెసన్
    శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్

    రిప్లయితొలగించండి
  10. భవము నశించును భక్తిగ
    శివ హర భవ శంకర యనఁ, జేకుఱు నిడుమల్
    శివ దూషణ మొనరించిన
    భవహరుఁడగు శివుని వేడ భయములు తొలగున్

    రిప్లయితొలగించండి
  11. శివరాత్రిన్ శివసన్నిధానమున విశ్వేశున్ మదిన్ నిల్పుచున్
    భవ నాశంబు వరంబుగా నొసఁగు సంభావించి సద్భక్తితో
    శివ గౌరీశ్వర శంకరా హర యనన్, జేకూఱు సర్వాపదల్
    శివనిందా పరులైన కుత్సితులకున్ సిద్ధించుగా దుర్గతుల్

    రిప్లయితొలగించండి
  12. కందం
    అవనిన్ భగవన్నామము
    స్తవమొనరింపనను వాడు సైతము భక్తిన్
    వివశత్వమ్మున మఱి మఱి
    శివ! హర! భవ! శంకర యనఁ, జేకుఱు నిడుముల్

    మత్తేభవిక్రీడితము
    అవనిన్ దైవము నెప్పుడున్ మదిని నేనాశించి యేదానికిన్
    స్తవమున్ జేయనె జేయనన్ మనుజునిన్ సైతమ్ము భక్త్యాత్ముడై
    వివశత్వమ్మున మాటిమాటికిని సద్విశ్వాసమేపారగన్
    శివ! గౌరీశ్వర! శంకరా! హర యనన్, జేకూఱు సర్వాపదల్

    రిప్లయితొలగించండి