చంపకమాల బలయుతులైన మ్లేచ్ఛులకు బానిసలై మన కుండ దేశ భ క్తులగుచు భిన్న రీతులను గూర్చిన పోరున పార ద్రోలియున్ వెలసిన రాజ్యతంత్రమును విజ్ఞతనల్లుచు లేవులేవనన్ కుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్!
అక్కరకు రానివైన కులాంతరముల విడిచి యేకోదరులవోలె పేర్మితోడ మెలగవలయు జనులికను, తొలగినంత కుల మతమ్ముల భేదముల్, గూర్మిఁ బెంచు.
పలువిధ సాంప్రదాయములు భాషల గల్గిన నాదు దేశమున్ కులమత భేదమెంచుచును కుచ్చితులై చరియించు వారితో పలువురు చెప్పినట్టి హితవాక్యములేమన నంతరించినన్ గుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్
తేటగీతి
రిప్లయితొలగించండితెల్లవారిని దరిమియు దిట్టలనఁగ
స్వపరిపాలనా తంత్రము భరతభూమి
రీతిగన్ సాగుతను, లేవులేవనంగ
కుల మతమ్ముల భేదముల్, గూర్మిఁ బెంచు
చంపకమాల
బలయుతులైన మ్లేచ్ఛులకు బానిసలై మన కుండ దేశ భ
క్తులగుచు భిన్న రీతులను గూర్చిన పోరున పార ద్రోలియున్
వెలసిన రాజ్యతంత్రమును విజ్ఞతనల్లుచు లేవులేవనన్
కుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్!
రిప్లయితొలగించండిఅక్కరకు రానివైన కులాంతరముల
విడిచి యేకోదరులవోలె పేర్మితోడ
మెలగవలయు జనులికను, తొలగినంత
కుల మతమ్ముల భేదముల్, గూర్మిఁ బెంచు.
పలువిధ సాంప్రదాయములు భాషల గల్గిన నాదు దేశమున్
కులమత భేదమెంచుచును కుచ్చితులై చరియించు వారితో
పలువురు చెప్పినట్టి హితవాక్యములేమన నంతరించినన్
గుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్
దేశ యభివృద్ధి నంతను దిగ్గుబరచు
రిప్లయితొలగించండికుల మతమ్ముల భేదముల్ ; గూర్మిఁ బెంచు
జనుల శక్తి , దానివలన స్ఫాతి బడయు
కలసి మెలసి యుండినపుడె కలుగు సుఖము