12, ఫిబ్రవరి 2026, గురువారం

సమస్య - 5380

13-2-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే”
(లేదా...)
“నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

4 కామెంట్‌లు:

  1. ఇలలో తెలియుదు రందరు
    నల పాండవులనగ నెపుడు నైదుగురె కదా!
    తలపోయ నెటుల ధర్మము?
    నలువురు పాండవులటన్న నమ్మిరిజనులే?!

    రిప్లయితొలగించండి
  2. కందం
    తొలి సుతుడవన్న కుంతికిఁ
    గలతను తొలగింప వరము కర్ణుఁడొసంగన్
    నులుమునని నరుని మిగిలిన
    నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే?


    చంపకమాల
    తొలిసుతుఁడీవనన్ జనని తోషమునింపగ కుంతిమాతకున్
    గలతను బాపెడున్ వరము కర్ణుడొసంగ నధర్మపక్షమై
    బలమును గల్గినన్ నరుని వంకన గృష్ణుని జూచి, యెక్కడన్
    నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో?

    రిప్లయితొలగించండి
  3. కలహము నందున పాల్గొని
    తలపడు వీరులెవరనిన ధర్మేంద్రుడు ను
    జ్వలమైన వాని సహజులు
    నలువురు పాండవు లటన్న నమ్మిరి జనులే

    పలువురి యంతరంగముల వచ్చిన సంశయ మిద్ది శీఘ్రమే
    కలహము తప్పకున్నయెడ కౌరవ సేననెదిర్చి గట్టిగా
    తలపడు వీరులెవ్వరన ధర్మజుడున్ మరి వాని సోదరుల్
    నలువురె పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో

    రిప్లయితొలగించండి

  4. ఇల ధర్మము తప్పని వా
    రలెవరని యడిగిన యట్టి రమణికి వడిగన్
    తెలిపిరి యటగల విజ్ఞులు
    నలువురు పాండవు లటన్న , నమ్మిరి జనులే.


    అలుగుటయే యెఱుంగని మహామహితాత్ముడు ధర్మజుండు, తా
    బలికిన చాలు భూరి గరవమ్మును జూపు విధేయులైన త
    మ్ములు కడు శక్తివంతులె యపూర్వ సహోదరు లైన వారలా
    నలువురె, పంచపాండవు లనన్ జనులెల్లరు నమ్మినారు పో.

    రిప్లయితొలగించండి