8-2-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అన్నముం దిన నాఁకలి యధికమయ్యె”(లేదా...)“అన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో”
అంగద కలిగి నందున , నావకాయయన్నముం దిన నాకలి యధికమయ్యె .యేది దిన దగ్గునో మరి యెరుక రాదు ,తీపి దినుచు జూడనగును దెలియుటకయి
ఉత్తమ గతులు కోరుచు నుర్వియందుసతము పరమాత్ముని గొలుచు సాధకులకుభక్తి యను రుచి కరమైన శక్తి నిచ్చెడన్నముం దిన నాఁకలి యధికమయ్యె.వెన్నుని గొల్చువారికి నివృత్తి లభించుటె కాదు కాంచగన్ చెన్నగు నామమయ్యదియె చింతలు బాపునటంచు నమ్ముచున్ మిన్నగ విశ్వసించినను మేదిని భక్తి రసంపు సారమాయన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో.
చిన్న నాటి మిత్రుండు కుచేలుడరిగెచిపిటముల మూటతో తనస్నేహి గృహముమూటవిప్పిన మురవైరి తేటఁజేసెనన్నముం దిన నాఁకలి యధికమయ్యెచిన్నతనంబునన్ దనకుఁ స్నేహితుడేనని భార్యపంపగామిన్నక చేరవచ్చెనట మిత్రసహాయమునెంచి వెన్నుడాచెన్నుడు పల్కినాడట కుచేలుడు తెచ్చిన మూట విప్పి నేనన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో
అంగద కలిగి నందున , నావకాయ
రిప్లయితొలగించండియన్నముం దిన నాకలి యధికమయ్యె .
యేది దిన దగ్గునో మరి యెరుక రాదు ,
తీపి దినుచు జూడనగును దెలియుటకయి
రిప్లయితొలగించండిఉత్తమ గతులు కోరుచు నుర్వియందు
సతము పరమాత్ముని గొలుచు సాధకులకు
భక్తి యను రుచి కరమైన శక్తి నిచ్చె
డన్నముం దిన నాఁకలి యధికమయ్యె.
వెన్నుని గొల్చువారికి నివృత్తి లభించుటె కాదు కాంచగన్
చెన్నగు నామమయ్యదియె చింతలు బాపునటంచు నమ్ముచున్
మిన్నగ విశ్వసించినను మేదిని భక్తి రసంపు సారమా
యన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో.
చిన్న నాటి మిత్రుండు కుచేలుడరిగె
రిప్లయితొలగించండిచిపిటముల మూటతో తనస్నేహి గృహము
మూటవిప్పిన మురవైరి తేటఁజేసె
నన్నముం దిన నాఁకలి యధికమయ్యె
చిన్నతనంబునన్ దనకుఁ స్నేహితుడేనని భార్యపంపగా
మిన్నక చేరవచ్చెనట మిత్రసహాయమునెంచి వెన్నుడా
చెన్నుడు పల్కినాడట కుచేలుడు తెచ్చిన మూట విప్పి నే
నన్నముఁ దృప్తిగాఁ దినిన నాఁకలి హెచ్చె నిదేమి చోద్యమో