8, ఫిబ్రవరి 2026, ఆదివారం

సమస్య - 5376

9-2-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును”
(లేదా...)
“ఆలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ”

4 కామెంట్‌లు:

  1. కాంత సంతసించు దనను గాంచినంత
    పతి యడలఁగ ; నన్యోన్యదాంపత్య మగును
    భర్త యెల్లవేళల దన భార్యయనిన
    జంకు చుండినట్లు నటన సలుప జాలు

    రిప్లయితొలగించండి
  2. సతి పతికినర్థ భాగమై సతతముండ
    సతి కుతిలపాటు గణుతింపఁ బతిది కాదె
    పతివతీ ప్రసవంబున బాధఁ గాంచి
    పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును

    నాలోనీవగు నర్ధభాగమని తానర్ధాంగితోఁ బల్కి తా
    నేలోకంబుఁ నపూర్వమై నిలిచి ప్రాణేశాగ్రభాగంబునన్
    గాలాతీతపు కాన్పులోన వధువాక్రందించు వైళంబునా
    యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ

    రిప్లయితొలగించండి

  3. భార్య యన తనలో సగ భాగ మంచు
    దలచి చరియించ నేమిరా తమ్మికంటి
    వలదను పని చేయ వలసి వచ్చిన తరి
    పతి యడల నన్యోన్యదాంపత్య మగును.


    స్త్రీలే మూలము ధాత్రి కంచు సతి వ్యక్తిత్వమ్ము మన్నించు చున్
    పాలాకుండ్రులు వారు కాదనుచు సంభావించెడిన్ వారలే
    చాలింకన్ వలదన్న కార్యము నటన్ సంపూర్తిగా చేయ నా
    యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ.

    రిప్లయితొలగించండి