18, ఫిబ్రవరి 2026, బుధవారం

సమస్య - 5385

19-2-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును”
(లేదా...)
“శబరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్”

2 కామెంట్‌లు:

  1. తండ్రి మాట నిలుపుటకై తల్కమునకు
    జేర , నచట నొక సివంగి చేతబడిన
    శబరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును
    జంతువు పయికి, దానిని జంపగోరి

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    మౌనియజ్ఞమ్ము గావఁగన్ పూని విధిని
    నసుర కాంతయనెడు శంక యంతరింప
    తాటకన్ యజ్ఞవేదిపై దాటెడు వివ
    శ బరిఁ గాంచి రాముఁడు వేసె సాయకమును

    చంపకమాల
    ప్రబలుచు యజ్ఞవాటికను రాక్షసమూకలు విజ్ఞమెంచఁగన్
    విబుధ మునీశ్వరుండు సభ వేడగ రక్షకు రామలక్ష్మణుల్
    కబలిత తాటకన్ దునుమ గాంచియు వీడఁగ శంకయున్ నివే
    శ బరినిఁ గాంచి రాఘవుఁడు చయ్యన వేసె నిశాతబాణమున్

    రిప్లయితొలగించండి