17, ఫిబ్రవరి 2026, మంగళవారం

సమస్య - 5384

18-2-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అప్పాలే కప్పలయ్యెఁ గళ్యాణమునన్”
(లేదా...)
“అప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్”

3 కామెంట్‌లు:

  1. కందం
    అప్పరమేశుఁడు కృపతో
    గుప్పగ భీమకవికినొన గూరె మహత్తుల్
    చప్పున శపించ విస్తరి
    నప్పాలే కప్పలయ్యె నా మనువందున్

    (కందమున యతిసవరించి కదలితి గురువా!)

    శార్దూలవిక్రీడితము
    విప్పారన్ కవనంబు భీమకవికిన్ విశ్వేశు కారుణ్యమై
    చెప్పన్ శంకరు సాక్షిగన్ హితములున్ చెల్లెన్ గదా! సత్యమై!
    తిప్పల్ వెట్టగ స్వాభిమానమున నిందింపంగ విస్తర్లలో
    నప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్

    రిప్లయితొలగించండి

  2. బొప్పడటంచు దలంచుచు
    తప్పున్ జేసితిరటంచు తా శాపమిడన్
    చెప్పవశమె విస్తరి లో
    నప్పాలే కప్పలయ్యెఁ గళ్యాణమునన్.


    చెప్పన్ జాలడు తండ్రి యెవ్వడనినన్ ఛీత్కారమున్ బెద్దలే
    బొప్పండంచు దలంచి భీమకవినే బోనమ్ముకై పిల్వకన్
    దప్పున్ జేయగ వారినాగ్రహమునన్ దా తూలగా వెంటనే
    యప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్.

    రిప్లయితొలగించండి
  3. తప్పక రమ్మని పిలువగ
    చప్పున నచ్చటకు జేరి చక్కగ గొప్పల్
    చెప్పుకొనుచుండగా నా
    గప్పాలే కప్పలయ్యెఁ గళ్యాణమునన్

    రిప్లయితొలగించండి