21-2-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్”(లేదా...)“అండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్”
కందందండమువెట్టుచుఁ బూజలుగండడు సంక్రాంతి కెంచ కరివరదునకున్పండుగ దినమంచున్ గూష్మాండమ్మను నైష్ఠికునకు నంగన వండెన్
పండుగ దినమని భర్తకునిండైన మనంబుతోడ నిర్మల మతితోకొండంత ప్రేమతో కుష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.
ఎండాకాలంబు ధరలుదండిగ గలవంచు మిగుల దావంతముతో భాండము దాచుకొనిన కూ ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.ఎండలు మెండుగా కురియ నెక్కడ గాంచిన గూరగాయలే దండి నిమానమంచు కొన తాహతు లేక విచారమందుచున్ బండము లుంచినట్టి యొక భాండము నందు లభించినట్టి కూష్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్.
పండుగ నాడరుదెంచగనఃడమ్మును నైష్ఠికునకు నంగన వండెన్ ,మెండగు నాకలినొందగ దండిగ దానిని భుజించె దనివోవంగా
మెండుగ శ్రమపడి చేరఁగదండిగ రూప్యములనుగొని తన గీమునకున్పండుగ దినమున నొక కూష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్
కొండొక దినమునఁ బతి బ్రహ్మాండమ్మనెను పరిగృహ్య వంటకములనేమెండుగఁ బతి తలపుల బ్రహ్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్పండుగ నాడు సేసెదను వాసన బియ్యపు వంటకంబునేదిండికి సాటిరానిదగు దివ్యమనోహర పక్వ మంచు తాఁబండని గాయలెంచి తన వల్లభుడే రుచి చూచి తెల్ప 'బ్రహ్మాండము!' వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్
కందం
రిప్లయితొలగించండిదండమువెట్టుచుఁ బూజలు
గండడు సంక్రాంతి కెంచ కరివరదునకున్
పండుగ దినమంచున్ గూ
ష్మాండమ్మను నైష్ఠికునకు నంగన వండెన్
పండుగ దినమని భర్తకు
రిప్లయితొలగించండినిండైన మనంబుతోడ నిర్మల మతితో
కొండంత ప్రేమతో కు
ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.
రిప్లయితొలగించండిఎండాకాలంబు ధరలు
దండిగ గలవంచు మిగుల దావంతముతో
భాండము దాచుకొనిన కూ
ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.
ఎండలు మెండుగా కురియ నెక్కడ గాంచిన గూరగాయలే
దండి నిమానమంచు కొన తాహతు లేక విచారమందుచున్
బండము లుంచినట్టి యొక భాండము నందు లభించినట్టి కూ
ష్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్.
పండుగ నాడరుదెంచగ
రిప్లయితొలగించండినఃడమ్మును నైష్ఠికునకు నంగన వండెన్ ,
మెండగు నాకలినొందగ
దండిగ దానిని భుజించె దనివోవంగా
మెండుగ శ్రమపడి చేరఁగ
రిప్లయితొలగించండిదండిగ రూప్యములనుగొని తన గీమునకున్
పండుగ దినమున నొక కూ
ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్
కొండొక దినమునఁ బతి బ్ర
రిప్లయితొలగించండిహ్మాండమ్మనెను పరిగృహ్య వంటకములనే
మెండుగఁ బతి తలపుల బ్ర
హ్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్
పండుగ నాడు సేసెదను వాసన బియ్యపు వంటకంబునే
దిండికి సాటిరానిదగు దివ్యమనోహర పక్వ మంచు తాఁ
బండని గాయలెంచి తన వల్లభుడే రుచి చూచి తెల్ప 'బ్ర
హ్మాండము!' వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్