మానవులందు మాన్యులుగ మన్ననలందిన సచ్చరిత్రులున్ దీనులపాలి దైవములు ధీయుతులై దనరారు వారు స న్మానములందగా నెలమి, మారెను కాలము నేడు ధూర్తుడౌ హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
నీతి నియమమ్ము లనువీడి నేత లిలను జనుల వంచింప నెంచుచు ధనము బంచి యెన్నికలను గెలిచి నట్టి యేలిక యను హీనుఁడే లోకమున గౌరవించఁబడును.
భానుని నంది వర్ధనుడు భారత మందున సూత పుత్రుడా హీన కులోద్భవుండనుచు నెల్లరు నవ్వుల పాలు జేసినన్ దానగుణమ్ముతో భువిని దాతగ కీర్తి వహించె గాంచగా హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందు చుండెడిన్.
ఉ:స్థానిక నేతలన్ గనక సంతత మిందిరనో,నరేంద్రునో మానస మందు నిల్పి మతి మాలుక వోట్లను వేయుచుండ స మ్మానితు డోడు చుండు,తల మాసిన వాడును నెగ్గు, నెవ్వడో హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్” (ఢిల్లీ వైపు చూసి గల్లీ నాయకుణ్ని ఎన్నుకుంటే మంచి వాడు ఓడ వచ్చు. పనికి మాలిన వాడు గెలవ వచ్చు. )
తేటగీతి
రిప్లయితొలగించండిపూర్వభాషిగ రాణించి పొందెయశము
ధర్మసంరక్షణా దీక్ష దాశరథియె
సురుచిర దరహాస యుతుఁడు వెరశి గర్వ
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
ఉత్పలమాల
మానిత ధర్మవిగ్రహుడు మంజుల భాష సుధీరుఁడంచనన్
జానకిమానసాలయుఁడు సారసనేత్రడు రామచంద్రుఁడున్
కానలకేగ పట్టమును కాదని తండ్రిని గౌరవింపగన్
హీనచరిత్రుఁడే? మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
రిప్లయితొలగించండిపుట్టి మరణింతురెందరో పుడమిపయిన ,
గుంపునందను నిత్యము గుదురుగ దన
జీవనంబు నందెటువంటి చెడ్డ చరిత
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
హీనచరితు లెపుఁడు గౌరవింపబడరు
రిప్లయితొలగించండిసచ్చరిత్రులు పూజ్యులు సంతతమ్ము
సాధువర్తనుఁడు సకల జన హితుఁడు న
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
మానవులందు మాన్యులుగ మన్ననలందిన సచ్చరిత్రులున్
రిప్లయితొలగించండిదీనులపాలి దైవములు ధీయుతులై దనరారు వారు స
న్మానములందగా నెలమి, మారెను కాలము నేడు ధూర్తుడౌ
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
రిప్లయితొలగించండినీతి నియమమ్ము లనువీడి నేత లిలను
జనుల వంచింప నెంచుచు ధనము బంచి
యెన్నికలను గెలిచి నట్టి యేలిక యను
హీనుఁడే లోకమున గౌరవించఁబడును.
భానుని నంది వర్ధనుడు భారత మందున సూత పుత్రుడా
హీన కులోద్భవుండనుచు నెల్లరు నవ్వుల పాలు జేసినన్
దానగుణమ్ముతో భువిని దాతగ కీర్తి వహించె గాంచగా
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందు చుండెడిన్.
కోరి జనులకు మంచి చేకూర్చు వార
రిప్లయితొలగించండిలెందరో నాడు గౌరవమందినారు
నేడు యెన్నికై గెలిచిన నేతయనెడు
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
కానలకేగిరాముడు సకాలము నందున లంకకేగి యా
వానర జాతిముఖ్యుడగు పావని గౌరవమంద నేడిటన్
హీనుడు నేతయై మిగుల హేయపు కృత్యములెల్లఁ సల్పగా
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
తే॥ సద్గుణములొదవి సకల జనుల కాప్తుఁ
రిప్లయితొలగించండిడగుచు సాయముఁ జేయగ నాదరమున
దుష్టత వదలి వరలెడు దురిత గుణ వి
హీనుఁడె లోకమున గౌరవించఁ బడును
ఉ॥ మానసమందు భక్తిఁ గని మాన్యుని వీడకఁ గొల్చు మాధవున్
దీనుల యార్తిఁ బాపుటకుఁ దీరగు సాయము నెంచు సర్వదా
మానిత సద్గుణమ్ములన మక్కువ దుష్టులు గాంచు దృష్టిలో
హీన చరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందు చుండెడిన్
తే.గీ:భవిత నెరిగి పురాణముల్ పలికె నిట్లు
రిప్లయితొలగించండిభూసురులు జ్ఞానదూరు లై పోగ,కలిని
వారి గౌరవమే వారి వదలగ కుల
హీనుఁడే లోకమున గౌరవించఁబడును”
(కలియుగం లో బ్రాహ్మణులు పతన మౌతారని,గౌరవం పోతుందని పురాణాలు పూర్వమే చెప్పాయి. అదే జరుగుతున్నది. )
సుజన సంగతి మెలగుచు సుంత యైన
రిప్లయితొలగించండిబొంకు లాడని వా డౌ చు బుద్ది మంతు
డ గుచు పరుల మే ల్గో రు వా డవ గుణ ముల
హీను డే లోకమున గౌర వింప బడును
ఉ:స్థానిక నేతలన్ గనక సంతత మిందిరనో,నరేంద్రునో
రిప్లయితొలగించండిమానస మందు నిల్పి మతి మాలుక వోట్లను వేయుచుండ స
మ్మానితు డోడు చుండు,తల మాసిన వాడును నెగ్గు, నెవ్వడో
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్”
(ఢిల్లీ వైపు చూసి గల్లీ నాయకుణ్ని ఎన్నుకుంటే మంచి వాడు ఓడ వచ్చు. పనికి మాలిన వాడు గెలవ వచ్చు. )
మున్ను గుర్తింపఁ బడకున్న నెన్నఁ డేని
రిప్లయితొలగించండిసత్య మెఱిఁగ నట్టి జన సంచయము చేతఁ
గల్ల లెఱుఁగ నట్టి పరోపకారి కపట
హీనుఁడే లోకమున గౌరవింపఁబడును
కానఁగ రాదు గౌరవము కార్య దురంధర ధైర్యశాలికిం
గానఁగ రాదు గౌరవము కైతవ హీన మనోధినేతకున్
మానవ లోక మందు ధన మర్మము నేరిన మాటకారియౌ
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందుచుండెడిన్
దాన ధర్మ ముల్ నిరతముఁ దానుజేయ
రిప్లయితొలగించండిసంతసం బొంద మిత్రులు సాదరమునఁ
జేయి చేతులు గలుపంగఁ జేరు గర్వ
హీనుఁడే లోకమున గౌరవించఁబడును”
సమస్య: హీనుఁడే లోకమున గౌరవించఁబడును
రిప్లయితొలగించండితే: మానుగ పరుల సేవకై పూనుకొనుచు
కానుకలనొసంగుచు మంచి కార్యములకు
ధ్యానమొనరించుచు హరికి నవని మను న
హీనుడే లోకమున గౌరవించ బడును
సమస్య: హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్ (ఆకాశవాణి వారి సమస్య)
ఉ: గానము జేయుచున్ బగితి కైటభవైరిని చిత్తశుద్ధితో
పూనికతోడ పేదలకు మోదము గూర్చుచు సేవనమ్ములన్
మానుగ వెల్గి బైసిగొను మాన్యుడు పృథ్విని, నెవ్విధమ్ముగా
హీనచరిత్రుడే మిగుల హెచ్చగు గౌరవమందు చుండెడిన్?
దానముఁజేయకెప్పుఁడునుధారుణియందునగొప్పదాతగా
రిప్లయితొలగించండినానుచు నుండుచున్ననట నాయము లేదని తేటతెల్లమౌ
కానగరాని పాట్లుపడి కాసుల మూటలు బొందఁగల్గుచో
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భక్తితో పూజ చేయుచు ప్రతి దినంబు
పేదలకు సాయమున్ జేసి యాదరమున
కోట్ల ధనము కల్గిన సాత్వికుండు, గర్వ
హీనుడే లోకమున గౌరవించఁ బడును.