మానవులందు మాన్యులుగ మన్ననలందిన సచ్చరిత్రులున్ దీనులపాలి దైవములు ధీయుతులై దనరారు వారు స న్మానములందగా నెలమి, మారెను కాలము నేడు ధూర్తుడౌ హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
నీతి నియమమ్ము లనువీడి నేత లిలను జనుల వంచింప నెంచుచు ధనము బంచి యెన్నికలను గెలిచి నట్టి యేలిక యను హీనుఁడే లోకమున గౌరవించఁబడును.
భానుని నంది వర్ధనుడు భారత మందున సూత పుత్రుడా హీన కులోద్భవుండనుచు నెల్లరు నవ్వుల పాలు జేసినన్ దానగుణమ్ముతో భువిని దాతగ కీర్తి వహించె గాంచగా హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందు చుండెడిన్.
తేటగీతి
రిప్లయితొలగించండిపూర్వభాషిగ రాణించి పొందెయశము
ధర్మసంరక్షణా దీక్ష దాశరథియె
సురుచిర దరహాస యుతుఁడు వెరశి గర్వ
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
ఉత్పలమాల
మానిత ధర్మవిగ్రహుడు మంజుల భాష సుధీరుఁడంచనన్
జానకిమానసాలయుఁడు సారసనేత్రడు రామచంద్రుఁడున్
కానలకేగ పట్టమును కాదని తండ్రిని గౌరవింపగన్
హీనచరిత్రుఁడే? మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
రిప్లయితొలగించండిపుట్టి మరణింతురెందరో పుడమిపయిన ,
గుంపునందను నిత్యము గుదురుగ దన
జీవనంబు నందెటువంటి చెడ్డ చరిత
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
హీనచరితు లెపుఁడు గౌరవింపబడరు
రిప్లయితొలగించండిసచ్చరిత్రులు పూజ్యులు సంతతమ్ము
సాధువర్తనుఁడు సకల జన హితుఁడు న
హీనుఁడే లోకమున గౌరవించఁబడును
మానవులందు మాన్యులుగ మన్ననలందిన సచ్చరిత్రులున్
రిప్లయితొలగించండిదీనులపాలి దైవములు ధీయుతులై దనరారు వారు స
న్మానములందగా నెలమి, మారెను కాలము నేడు ధూర్తుడౌ
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్
రిప్లయితొలగించండినీతి నియమమ్ము లనువీడి నేత లిలను
జనుల వంచింప నెంచుచు ధనము బంచి
యెన్నికలను గెలిచి నట్టి యేలిక యను
హీనుఁడే లోకమున గౌరవించఁబడును.
భానుని నంది వర్ధనుడు భారత మందున సూత పుత్రుడా
హీన కులోద్భవుండనుచు నెల్లరు నవ్వుల పాలు జేసినన్
దానగుణమ్ముతో భువిని దాతగ కీర్తి వహించె గాంచగా
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందు చుండెడిన్.