29-3-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నింగి మబ్బులు గ్రమ్మె వెన్నెలయుఁ గురిసె”(లేదా...)“గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్”
భీమమగు వేడికి పుడమి బీటలొందనింగి మబ్బులు గ్రమ్మె ; వెన్నెలయుఁ గురిసెరైతుల మనము లందు , దూర భువిపయినపడగ విరివిగ పంటలు పండుననుచు
తేటగీతిదేవకీసతి గర్భాన దివ్యమనఁగనవతరింపగ నష్టమి నచ్యుతుండునంద గోకుల మేగెడు ముందు, వెనుకనింగి మబ్బులు గ్రమ్మె! వెన్నెలయుఁ గురిసె!చంపకమాలజగమున ధర్మమున్ నిలుప శౌరియె దేవకి గర్భమందునన్సుగతిని గూర్పఁగన్ వెలయ సుందరడై! వసుదేవుఁడా నిశిన్వగపును వీడ నందకుల వాసము జేర్చెడు ముందు వెన్కలన్గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపఁగన్
కఱవు రక్కసి కసిబూని కాటువేయుతరుణమందున వరుణుఁడు కరుణ జూపనింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసెవానతోబాటుగా రైతు బ్రతుకునందు
వృద్ధ భీష్ముడొరిగినంత విజయ మదియె తథ్య మనుచు పాండవుల నేత్రములు కాంతి వంత మైనను లోకమ్ము వగచె గాంచ నింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసె.పగతురి పక్షమున్ నిలిచి పౌంస్యమొనర్చెడి భీష్మ పర్వమే ముగిసిన పాళ మందు పృథ పుత్రులు గర్వము నందు వేళలో మొగములు కాంతులీనగను ముజ్జగముల్ పరికేద మందెగా గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్.
భీమమగు వేడికి పుడమి బీటలొంద
రిప్లయితొలగించండినింగి మబ్బులు గ్రమ్మె ; వెన్నెలయుఁ గురిసె
రైతుల మనము లందు , దూర భువిపయిన
పడగ విరివిగ పంటలు పండుననుచు
తేటగీతి
రిప్లయితొలగించండిదేవకీసతి గర్భాన దివ్యమనఁగ
నవతరింపగ నష్టమి నచ్యుతుండు
నంద గోకుల మేగెడు ముందు, వెనుక
నింగి మబ్బులు గ్రమ్మె! వెన్నెలయుఁ గురిసె!
చంపకమాల
జగమున ధర్మమున్ నిలుప శౌరియె దేవకి గర్భమందునన్
సుగతిని గూర్పఁగన్ వెలయ సుందరడై! వసుదేవుఁడా నిశిన్
వగపును వీడ నందకుల వాసము జేర్చెడు ముందు వెన్కలన్
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపఁగన్
కఱవు రక్కసి కసిబూని కాటువేయు
రిప్లయితొలగించండితరుణమందున వరుణుఁడు కరుణ జూప
నింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసె
వానతోబాటుగా రైతు బ్రతుకునందు
రిప్లయితొలగించండివృద్ధ భీష్ముడొరిగినంత విజయ మదియె
తథ్య మనుచు పాండవుల నేత్రములు కాంతి
వంత మైనను లోకమ్ము వగచె గాంచ
నింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసె.
పగతురి పక్షమున్ నిలిచి పౌంస్యమొనర్చెడి భీష్మ పర్వమే
ముగిసిన పాళ మందు పృథ పుత్రులు గర్వము నందు వేళలో
మొగములు కాంతులీనగను ముజ్జగముల్ పరికేద మందెగా
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్.