చం:మృగ శిర వచ్చి నింగి పయి మేఘపు పంక్తులు నిండు వేళ లో నిగనిగ కాంతులన్ వెలుగు నింపెడు వెన్నెల పుట్టె కూతురై గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపఁగన్ స్వగృహము నందు నిద్ది యొక భవ్య వినోదము గుర్తు వచ్చినన్. (వర్షాలు ప్రారంభ మై ఆకాశం లో మేఘాలు నిండిన సమయం లో ఇతనికి కూతురు పుట్టింది. ఆమె పేరు వెన్నెల.ఈ అచ్చ తెనుగు పేరు ఈ మధ్య చాలా మందికి కనిపిస్తోంది.)
(ఒక ఎత్తువరకు ఒక కొండ అక్కడ కొంత ఫ్లాట్ గాఉండి దానిపై మరొక కొండ ఉంటుందండి. ఇటువైపొకటి అటువైపొకటి కూడ ఉంటాయండి అందుకని నగములు అన్నాను. ఇదే విధంగా చిరపుంజి-షిలాంగ్ మధ్య కూడ వాతావరణ వ్యత్యాసముంటుందండి
భీమమగు వేడికి పుడమి బీటలొంద
రిప్లయితొలగించండినింగి మబ్బులు గ్రమ్మె ; వెన్నెలయుఁ గురిసె
రైతుల మనము లందు , దూర భువిపయిన
పడగ విరివిగ పంటలు పండుననుచు
తేటగీతి
రిప్లయితొలగించండిదేవకీసతి గర్భాన దివ్యమనఁగ
నవతరింపగ నష్టమి నచ్యుతుండు
నంద గోకుల మేగెడు ముందు, వెనుక
నింగి మబ్బులు గ్రమ్మె! వెన్నెలయుఁ గురిసె!
చంపకమాల
జగమున ధర్మమున్ నిలుప శౌరియె దేవకి గర్భమందునన్
సుగతిని గూర్పఁగన్ వెలయ సుందరడై! వసుదేవుఁడా నిశిన్
వగపును వీడ నందకుల వాసము జేర్చెడు ముందు వెన్కలన్
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపఁగన్
కఱవు రక్కసి కసిబూని కాటువేయు
రిప్లయితొలగించండితరుణమందున వరుణుఁడు కరుణ జూప
నింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసె
వానతోబాటుగా రైతు బ్రతుకునందు
రిప్లయితొలగించండివృద్ధ భీష్ముడొరిగినంత విజయ మదియె
తథ్య మనుచు పాండవుల నేత్రములు కాంతి
వంత మైనను లోకమ్ము వగచె గాంచ
నింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసె.
పగతురి పక్షమున్ నిలిచి పౌంస్యమొనర్చెడి భీష్మ పర్వమే
ముగిసిన పాళ మందు పృథ పుత్రులు గర్వము నందు వేళలో
మొగములు కాంతులీనగను ముజ్జగముల్ పరికేద మందెగా
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్.
వింగడించగ వానకు వెనుక ముందు
రిప్లయితొలగించండిసంగతుల పరిణామము స్పష్టమాయె
నింగి మబ్బులు గ్రమ్మె వెన్నెలయుఁ గురిసె
పొంగి పోయెను గలువలు పోతరమున
పగటికి రేయికిన్ గలుగు వ్యత్యయమే గమనించినంతలో
స్వగతము తెల్పెనీ విధము 'వర్షపు చిన్కులు రాలునప్పుడే
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్
ధగధగ కాంతులీనినవి తన్మయ మొందగ కల్వఱేకులే'
తే.గీ:ఋతుపవనములు తాక కేరళ నెల్ల చోట్ల
రిప్లయితొలగించండినింగి మబ్బులు గ్రమ్మె , వెన్నెలయుఁ గురిసె
తెలుగు రాష్ట్రము లందున, తొలగ నట్టి
గ్రీష్మ లక్షణముల నేటి రేయి వరకు
చం:మృగ శిర వచ్చి నింగి పయి మేఘపు పంక్తులు నిండు వేళ లో
రిప్లయితొలగించండినిగనిగ కాంతులన్ వెలుగు నింపెడు వెన్నెల పుట్టె కూతురై
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపఁగన్
స్వగృహము నందు నిద్ది యొక భవ్య వినోదము గుర్తు వచ్చినన్.
(వర్షాలు ప్రారంభ మై ఆకాశం లో మేఘాలు నిండిన సమయం లో ఇతనికి కూతురు పుట్టింది. ఆమె పేరు వెన్నెల.ఈ అచ్చ తెనుగు పేరు ఈ మధ్య చాలా మందికి కనిపిస్తోంది.)
చం॥ నగముల రెండు వైపులను నందనముల్ వలెఁ దోఁట లుండగా
రిప్లయితొలగించండినిగనిగ లాడు గ్రామములు నిశ్చల రూపున నొప్పు చుండగా
నగుపడెఁ గొండలెక్కి కన వ్యత్యయ మొందఁగ రెండు వైపులన్
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరించఁగన్
(ఒక ఎత్తువరకు ఒక కొండ అక్కడ కొంత ఫ్లాట్ గాఉండి దానిపై మరొక కొండ ఉంటుందండి. ఇటువైపొకటి అటువైపొకటి కూడ ఉంటాయండి అందుకని నగములు అన్నాను. ఇదే విధంగా చిరపుంజి-షిలాంగ్ మధ్య కూడ వాతావరణ వ్యత్యాసముంటుందండి
వగపు నుబ్బు వెల్లివిరియ బాగ పెద్ద
రిప్లయితొలగించండిచదువు చదువఁ గోరి పర దేశమ్ము సనఁ గు
మారుఁ డుత్సాహమున మాత మానసంపు
నింగి మబ్బులు గ్రమ్మె వెన్నెలయుఁ గురిసె
జగతిని నెప్పు డేమి యగు సారస గర్భున కైన నెర్కయే
పగటి తెఱంగు వెల్గు లిడ భానుని మించి చెలంగి యత్తఱిం
దొగచెలికాఁడు సంతసముతోఁ జెలరేఁగఁగఁ జూచుచుండఁగా
గగనము నందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్
భగభగమండగన్ పగలు వర్షము జోరున కుర్యటానికై
రిప్లయితొలగించండిగగనమునందు గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపగన్
ఖగవతి నందు చక్కగను క్షాణిని వేళ చకోర పక్షులున్
దిగులును మాని వెన్నెలల తీగల నానుచు నుండె హాయిగన్
పగతునివోలె కాటకము పంటపొలమ్ములయందు నేర్పడన్
రిప్లయితొలగించండివగపున రైతుసోదరులు వానకు వేచిన నూఱడింపుగా
గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపఁగన్
నగవులు నాట్యముల్ సలిపె నందముతో ప్రతిరైతు మోమునన్
చూచుచుండంగ నొకసారి చోద్యముగను
రిప్లయితొలగించండినింగి మబ్బులు గ్రమ్మె,,వెన్నెలయుఁగురిసె
రైతు మనంబు, సంతోషమైతరించె
కోరినంతన వానలుగురియు కతన
విగత మనస్కుఁడైయొకఁడువీధులవెంబడి తిర్గుచిట్లనెన్
రిప్లయితొలగించండిగగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్
ఖగమునవింతలీవిధముకన్పడుచుండుచు మాయమౌనులే
జగదభిరాము నిన్గొలువ చయ్యననిచ్చును గీర్తిసంపదల్
వరుణ దేవుడు కరుణించి వగపు బాప
రిప్లయితొలగించండినెంచి గగ నాన ఉరుములు మించు చపుడు
నింగి మబ్బులు క్రమ్మె వెన్నెలయు గురి సె
కర్షకుల మోము నందున కమ్ర ముగను
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రాగ్దిశను చంద్రు డుదయాన ప్రభవమొంద
గగనమున కారు మేఘముల్ గ్రమ్ముకొనగ
పశ్చిమంబున; చూడగా ప్రకృతి వింత
నింగి మబ్బులు గ్రమ్మె వెన్నెలయుఁ గురిసె.
పశ్చిమాసియా భీకర భండనమున
రిప్లయితొలగించండిఅగ్ర రాజ్యాగ్రహాగ్నిపాలైనరేయిఁ
భగ్గుమనెనిరాను చమురుబావు లపుడు
"నింగి మబ్బులు గ్రమ్మె వెన్నెలయుఁ గురిసె”