11-6-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ”
(లేదా...)
“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”
జసులకర్థము కానిది సంస్కృతముగ పరిగణించుచు చట్టసభల సభికులునూతనముగ మొదలుపెట్టి నుడువు బూతుసంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ
🥁 శంకరాభరణం 🥁 ************************* సమస్య 🌷 11 /06/2026 ************************ “సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”నా పూరణ :ఉ. మా.**********************సంస్కృత మౌను కారణము సర్వ పురాణపు గ్రంధరాజముల్సంస్కృతి న్యాయ ధర్మములను చక్కగ దెల్పగ మానవాళికిన్సంస్కృతి హీనుడొండు పర సంస్కృతి మోహమునందు నిట్లనెన్“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్” 🌿 ఆకుల శాంతి భూషణ్ ✍️ వనపర్తి
జసులకర్థము కానిది సంస్కృతముగ
రిప్లయితొలగించండిపరిగణించుచు చట్టసభల సభికులు
నూతనముగ మొదలుపెట్టి నుడువు బూతు
సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ
🥁 శంకరాభరణం 🥁
రిప్లయితొలగించండి*************************
సమస్య 🌷 11 /06/2026
************************
“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”
నా పూరణ :ఉ. మా.
**********************
సంస్కృత మౌను కారణము సర్వ పురాణపు గ్రంధరాజముల్
సంస్కృతి న్యాయ ధర్మములను చక్కగ దెల్పగ మానవాళికిన్
సంస్కృతి హీనుడొండు పర సంస్కృతి మోహమునందు నిట్లనెన్
“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”
🌿 ఆకుల శాంతి భూషణ్ ✍️
వనపర్తి