ఉ:సంంస్కృతభాష యార్యులది, చచ్చిన భాషను వీడి వేయు డా సంస్కృత భాష చే ద్రవిడ సంస్కృతి నాశన మయ్యె, దేశమున్ సంస్కరణమ్ము జేతు మను సఖ్యత గూల్చెడు వారి దూషకా సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్” (సంస్కృతం విదేశీయు లైన ఆర్యులది.అది మృతభాష.అనే వారి అసంస్కృత భాష తో సంస్కృతి నాశన మౌతున్నది. దూషక+అసంస్కృతభాష.)
ఉ॥ సంస్కృత భాష నేర్వఁగను శక్తినిఁ గాంచ నసాధ్యమైచనన్ సంస్కృతి హీనులై భువిని సాగెడు దుష్ట మదాంధ ధూర్తులై సంస్కృత భాషపై మిగుల సంచిత ఖష్పముఁ జూప పల్కిరో సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్
తేటగీతి గురువు జెప్పినదేమని గుర్తులేద? సంస్కృతము నిలఁబెట్టెను సంస్కృతి నని సుత! పరధ్యాస వంటె వికృతమనంగ, సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ!
ఉత్పలమాల సంస్కృతి శ్రేష్టమౌనటుల సాధువులెల్ల రచింపవేదముల్ సంస్కృతభాషచే మనెను సంస్కృతి సర్వము భారతావనిన్ సంస్కరణమ్ము లేక విని సంకరమొందఁగ వ్రాసితే సుతా! "సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్! "
సంస్కరింపఁబడ సుర భాష వితతమ్ము నేర్పె సంస్కారము జనుల కోర్పు తోడఁ గనుమఱుఁ గయి పుడమిని నిక్కాల మందు సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ
సంస్కృతి పల్కు భాష పయి సంతత మూనిక నూన వింతయే పుంస్కపి యంజనీసతి సుపుత్రుఁడు వ్యాకరణప్రవీణుఁడే సంస్కరణమ్ము లాతని వశమ్ములె పౌర తృణీకృతంపు టా సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్
సంస్కృతి హెచ్చిజీవితము చక్కగ సాగు నటంచు నెంచుచున్ సంస్కృత భాష నేర్వమని సంకట పెట్టగ తల్లిదండ్రులే సంస్క్రతమున్ పఠించుట యసాధ్యమటంచునొకండు పల్కెతా సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్.
సకల భాషలకు జనని సంస్కృతమ్ము వేద వాజ్ఞ్మయ మంతయు వెలసియుండె పూర్వ మితిహాస గ్రంథముల్ పొందుపరచె "సంస్కృతము చెడగొట్టెను సంస్కృతి నయొ" యనుట సత్య దూరము కద ఘనత నెఱిగి.
ఈ ౦స్కను ప్రాసగా నిడుచు నిట్టి సమస్య నొసంగ న్యాయమా? సంస్కరణ మ్మెఱుంగక విషప్రచురోక్తులఁ బల్కువాఁ డొకం డాంస్కి యనంగ సంస్థ గల దంధికారిగ నుండువాఁ డనెన్ సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతియంతయు భారతావనిన్. (ఆంస్కి - Amsky - ప్రింటింగ్ టెక్నాలజీకి చెందిన కంపెనీ)
జసులకర్థము కానిది సంస్కృతముగ
రిప్లయితొలగించండిపరిగణించుచు చట్టసభల సభికులు
నూతనముగ మొదలుపెట్టి నుడువు బూతు
సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ
🥁 శంకరాభరణం 🥁
రిప్లయితొలగించండి*************************
సమస్య 🌷 11 /06/2026
************************
“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”
నా పూరణ :ఉ. మా.
**********************
సంస్కృత మౌను కారణము సర్వ పురాణపు గ్రంధరాజముల్
సంస్కృతి న్యాయ ధర్మములను చక్కగ దెల్పగ మానవాళికిన్
సంస్కృతి హీనుడొండు పర సంస్కృతి మోహమునందు నిట్లనెన్
“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”
🌿 ఆకుల శాంతి భూషణ్ ✍️
వనపర్తి
నవ్య రీతుల మనుగడే నాగరికత
రిప్లయితొలగించండినాగరికత మారుపడు ననారతంబు
దినదినముఁ గ్రుంగి కాలగతిని కృశించి
సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ
సంస్కరణాభిలాషకుల సంసృతి మారుట సాజమేకదా
సంస్కృతి మార్పుచెందెనిట సత్వరమే జనులిచ్చగించగా
సంస్కరణానురక్తి గల సంఘమునందు కృశించినట్టిదౌ
సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్
మార్గ దర్శన మీయక వర్గ భేద
రిప్లయితొలగించండిములను గల్పించు రీతిగా ప్రోత్స హించు
కవనముల నల్లు రచయిత కావ్య మందు
సంస్కృతము జెడ గొట్టెను సంసృతి న యొ
-
రిప్లయితొలగించండిభాష కు మెరుగు లొసగె ప్రభాసమగుచు
సంస్కృతము; చెడగొట్టెను సంస్కృతినయొ
వేష భాషల మార్చిన పేర్మి జేర్చి
ముద్దులాడిన నాంగ్లము ముంచె కొంప
https://youtube.com/shorts/RchmaPNwq9w?si=kgHAVJAOpRHrDR9R
తే.గీ:నేడు కులతత్త్వముల బడి నీచ భాష
రిప్లయితొలగించండిలో బరస్పర నిందల లో మునింగి
పోయె సాంఘిక మాధ్యమ మోయి! యీ య
సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ!
ఉ:సంంస్కృతభాష యార్యులది, చచ్చిన భాషను వీడి వేయు డా
రిప్లయితొలగించండిసంస్కృత భాష చే ద్రవిడ సంస్కృతి నాశన మయ్యె, దేశమున్
సంస్కరణమ్ము జేతు మను సఖ్యత గూల్చెడు వారి దూషకా
సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”
(సంస్కృతం విదేశీయు లైన ఆర్యులది.అది మృతభాష.అనే వారి అసంస్కృత భాష తో సంస్కృతి నాశన మౌతున్నది. దూషక+అసంస్కృతభాష.)
ఉ॥ సంస్కృత భాష నేర్వఁగను శక్తినిఁ గాంచ నసాధ్యమైచనన్
రిప్లయితొలగించండిసంస్కృతి హీనులై భువిని సాగెడు దుష్ట మదాంధ ధూర్తులై
సంస్కృత భాషపై మిగుల సంచిత ఖష్పముఁ జూప పల్కిరో
సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్
ఖష్పము క్రోధము
తేటగీతి
రిప్లయితొలగించండిగురువు జెప్పినదేమని గుర్తులేద?
సంస్కృతము నిలఁబెట్టెను సంస్కృతి నని
సుత! పరధ్యాస వంటె వికృతమనంగ,
సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ!
ఉత్పలమాల
సంస్కృతి శ్రేష్టమౌనటుల సాధువులెల్ల రచింపవేదముల్
సంస్కృతభాషచే మనెను సంస్కృతి సర్వము భారతావనిన్
సంస్కరణమ్ము లేక విని సంకరమొందఁగ వ్రాసితే సుతా!
"సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్! "
రిప్లయితొలగించండిదివ్య సంస్కార సంపన్న దేవభాష
సంస్కృతము; చెడఁగొట్టెను సంస్కృతి నయొ
నాగరికత పేరున మార్పు నైజ మనుచు
శ్రేష్ఠ వాక్కుసౌందర్యంబు చిన్న బోయె
సంస్కరింపఁబడ సుర భాష వితతమ్ము
రిప్లయితొలగించండినేర్పె సంస్కారము జనుల కోర్పు తోడఁ
గనుమఱుఁ గయి పుడమిని నిక్కాల మందు
సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ
సంస్కృతి పల్కు భాష పయి సంతత మూనిక నూన వింతయే
పుంస్కపి యంజనీసతి సుపుత్రుఁడు వ్యాకరణప్రవీణుఁడే
సంస్కరణమ్ము లాతని వశమ్ములె పౌర తృణీకృతంపు టా
సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్
సంస్కృతి హెచ్చిజీవితము చక్కగ సాగు నటంచు నెంచుచున్
రిప్లయితొలగించండిసంస్కృత భాష నేర్వమని సంకట పెట్టగ తల్లిదండ్రులే
సంస్క్రతమున్ పఠించుట యసాధ్యమటంచునొకండు పల్కెతా
సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సకల భాషలకు జనని సంస్కృతమ్ము
వేద వాజ్ఞ్మయ మంతయు వెలసియుండె
పూర్వ మితిహాస గ్రంథముల్ పొందుపరచె
"సంస్కృతము చెడగొట్టెను సంస్కృతి నయొ"
యనుట సత్య దూరము కద ఘనత నెఱిగి.
ఈ ౦స్కను ప్రాసగా నిడుచు నిట్టి సమస్య నొసంగ న్యాయమా?
రిప్లయితొలగించండిసంస్కరణ మ్మెఱుంగక విషప్రచురోక్తులఁ బల్కువాఁ డొకం
డాంస్కి యనంగ సంస్థ గల దంధికారిగ నుండువాఁ డనెన్
సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతియంతయు భారతావనిన్.
(ఆంస్కి - Amsky - ప్రింటింగ్ టెక్నాలజీకి చెందిన కంపెనీ)