13, జూన్ 2026, శనివారం

సమస్య - 5497

14-6-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బూతులం బల్కువారలే పుణ్యజనులు”

(లేదా...)

“బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే”

21 కామెంట్‌లు:

  1. చట్టమగు సుంత లోననె శంకవలదు ,
    చట్టసభలందు దప్పక చక్కనైన
    బూతులం బల్కువారలే పుణ్యజనులు
    పలుకనగు నటుల నికపై ప్రకటితముగ

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    నీతినియమముల్ వీడుచు నేతననెడు
    గర్వమున వైరిపక్షముఁ గర్కశముగ
    నిందలాడ గద్దెన్ దించి నెట్టిరి ప్రజ
    బూతులం బల్కువార లే పుణ్యజనులు?


    ఉత్పలమాల
    నైతిక ధర్మమున్ విడచి నాలుకఁ ద్రిప్పుచు వైరిపక్షమున్
    రీతిని దప్పి నాకెదురు లేదను భంగివిమర్శలెంచఁగన్
    నేతను సైతురే ప్రజలు నెట్టుచు వెన్కకు గద్దెదించరే
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే?

    రిప్లయితొలగించండి
  3. నేతల సరళి గమనింప నెయ్యమేడ?
    కోతులన్ బురుడించుచు గోచరింత్రు
    నేతల పలుకులఁ దొరలు బూతులెపుడు
    బూతులం బల్కువారలే పుణ్యజనులు

    నేతల పోకడల్ గనిన నెయ్యపు బల్కులు మాయమయ్యెలే
    కోతుల కంటె హీనులుగ గోచరమై చెలరేగుచుందురే
    నేతలు పల్కుచుందురిట నేర్పరురై పలు బూతుమాటలన్
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే

    రిప్లయితొలగించండి

  4. దుర్మతులు వాడు మాటలు దొరల కుండ
    నెదుటి వారిని మన్నించి యింపు గాను
    పలకరించుచు వీడుచు పలుకు లందు
    బూతులం, బల్కువారలే పుణ్యజనులు.


    ఖ్యాతి గడింతు రోయి మరియాదను వీడక సాటి వారికిన్
    బ్రీతిని గూర్చ నెంచుచును విజ్ఞత తో వచియించు వారలే,
    నీతియె లేని దుర్జనుల నెయ్యము తోనల వర్చు కొన్న యా
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే?

    రిప్లయితొలగించండి
  5. ఎన్నికల సమయ ము నందు నె దుటి వారి
    భా గ వతములు లెక్కించి పలు విధాల
    బూతు లo బల్కు వారలే పుణ్య జనులు
    నేత లై మను జుండు ట నిక్కము గద

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి:
    సాయమడిగిన దీనునిఁ జేయకుండ
    హేళనల్, బృందమందున గేలిపలుకు
    లాడకన్, సభ నుండగ వాడకుండ
    బూతులం, బల్కువారలే పుణ్యజనులు

    రిప్లయితొలగించండి
  7. నీతులు బల్కుచున్ వెనుక నిల్వున గోతులు త్రవ్వునట్టి దు
    ర్నీతులు గద్దెలెక్కి మననేతలుగా ప్రచురత్వమొందగన్
    నేతలమన్న యుద్ధతిని నిత్య మవాక్కులఁ బల్కుచుండ నా
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రులటంచు మెత్తురే?

    రిప్లయితొలగించండి
  8. తే.గీ: తన మత మ్మేది యైనను దాని నున్న
    ధర్మ మేదియొ చేసెడు దారి వదలి
    తనదె సరియని పరదేవతలను గూర్చి
    బూతులం బల్కువారలే పుణ్యజనులు?

    రిప్లయితొలగించండి
  9. ఉ॥ యాతన రాజకీయమన నచ్చట ముఖ్యము తన్నుతానుగాఁ
    జేతనుఁడై నుతించుకొని చేవనుఁ గాంచుచు శత్రుపక్షమున్
    రోఁతగ దుయ్యఁబట్టుచును రొప్పుచు ఘాటుగ గించపర్చుటే
    బూతులఁ బల్కు వారలనె పుణ్య చరిత్రులటంచు మెత్తురే

    రిప్లయితొలగించండి
  10. ఉ:నీతియె లేదు రాజులకు, నిష్ఠురసత్యము దెల్ప మంత్రు , లా
    నీతుల వీడి బూతులనె నేస్తము లంచు దలంచ వారు "ని
    ష్ణాతుడ వీవు, స్త్రీల యెడ నంగజువే" యని మెచ్చ నట్టి యా
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే!
    (రెండవ పాదం లో బూతులు అంటే రాజులని స్తోత్రం చేసే భట్టులు. నీతి లేని రాజులు మంత్రులు చెప్పే సత్యాలని,నీతులని మెచ్చరు.భట్రాజులు వారి వృత్తి ధర్మం గా నువ్వు రసికుడివి, స్త్రీలకి మన్మథునివి అంటే ఆ బూతు మెప్పులు మెచ్చుకొని వాళ్లనే పుణ్యాత్ము లని మెచ్చుకుంటారు. )

    రిప్లయితొలగించండి
  11. ఎక్కసక్కెము లాడఁగ మిక్కుటముగ
    నివ్వటిల్ల నెడఁదఁ గిన్క యెవ్వ రైన
    నరుల నిందించు వేళల యందు వీడి
    బూతులం బల్కు వారలే పుణ్యజనులు


    జోత లొసంగి వందలు విశుద్ధ మనమ్ముల మోడ్చి చేతులే
    యాతత భక్తి తోడ వినయమ్ముగ నింపుగఁ బ్రస్తుతించుచున్,
    నాతి చరామి యంచు నని న్యాయము తప్పక సంచరింపఁగాఁ
    బూతులఁ, బల్కు వారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే

    [పూతుఁడు = పవిత్రుఁడు]

    రిప్లయితొలగించండి
  12. పూతమనస్కులై మనుచు పోడిగ పత్నిని గౌరవించుచున్
    చేతము నందు మన్మథుడు చేరి చెలంగుచునుండ, పాన్పుపై
    రాతిరి వేళలోన నిజరాణిని చేరుచు, కోర్కెల రెచ్చగొట్టగా
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే
    (ఇంచుక బూతాడక రతి రంజిల్లదు)

    రిప్లయితొలగించండి