25-7-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె”
(లేదా...)
“విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో పి.యెల్. నాగేశ్వరరావు గారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిచక్కనైన మిత్రవరులు దక్కినంతతల్లిదండ్రి యాశయముల తనయుఁడౌచువమ్ము జేయ కుండ కలల వాంఛదీరవిద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె!శార్దూలవిక్రీడితముసద్యస్ఫూర్తిని గల్గు మిత్రులమరన్ సావాస మేపార నైవేద్యంబంచును భక్తి వాణి కొసఁగన్ ప్రీతిన్ ప్రసాదంపు వైవిధ్యంబౌ నిపుణత్వమున్ గురియగన్ విజ్ఞాన భాండమ్ముగన్విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో?
పెండ్లి వలదంచు నీవిట్లు పేచి పెట్ట నేల లక్షల లంచమ్ము నిచ్చి కాదె మంచి నౌకరిన్ గొంటి కుమార వినుము విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె.ఉద్యోగంబది లేక నూఢి యదియే యుక్తంబు కాదంచు నా డాద్యుల్ చెప్పిన యట్టి మాటలవినేనాలించి లంచంబు తో నుద్యోగమ్మును గొంటి గాదె యిక ప్రత్యూహమ్మదే వీడె గా విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో.
విద్య తెచ్చునుద్యోగము వేగిరమునవరునికుద్యోగ మున్నచో వధువు దక్కువిద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకెయనుచు వచియింత్రు పల్వురు ఘనులు మనకుసద్యోజాతుని పైనభక్తి మదిలో సంకల్పమైయుండగానాద్యంతమ్ములు లేని వాని కృపతో నావిశ్వ విఖ్యాతుడౌవిద్యారణ్యుని యొద్దచేరి సరియౌ వేదాంత పాఠాలతోవిద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో
విద్యాభ్యాసము సేయ వెళ్ళితివిగా వేర్వేరు దేశాలకున్విద్యా వంతులు సెప్పగన్ చదువులన్ ప్రేమాభిమానాలతోసద్య స్ఫూర్తిని జూపుచున్ గురువులన్ సద్భక్తితో కొల్చి పల్విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో
ఎంత విత్తముండిన నేమి హితము, , పెండ్లిజేసు కొనెదమని దలచ జెలువ దొరక కుండె , తగినంతటి గడన కొరత కనుక ,విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిచక్కనైన మిత్రవరులు దక్కినంత
తల్లిదండ్రి యాశయముల తనయుఁడౌచు
వమ్ము జేయ కుండ కలల వాంఛదీర
విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె!
శార్దూలవిక్రీడితము
సద్యస్ఫూర్తిని గల్గు మిత్రులమరన్ సావాస మేపార నై
వేద్యంబంచును భక్తి వాణి కొసఁగన్ ప్రీతిన్ ప్రసాదంపు వై
విధ్యంబౌ నిపుణత్వమున్ గురియగన్ విజ్ఞాన భాండమ్ముగన్
విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో?
రిప్లయితొలగించండిపెండ్లి వలదంచు నీవిట్లు పేచి పెట్ట
నేల లక్షల లంచమ్ము నిచ్చి కాదె
మంచి నౌకరిన్ గొంటి కుమార వినుము
విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె.
ఉద్యోగంబది లేక నూఢి యదియే యుక్తంబు కాదంచు నా
డాద్యుల్ చెప్పిన యట్టి మాటలవినేనాలించి లంచంబు తో
నుద్యోగమ్మును గొంటి గాదె యిక ప్రత్యూహమ్మదే వీడె గా
విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో.
విద్య తెచ్చునుద్యోగము వేగిరమున
రిప్లయితొలగించండివరునికుద్యోగ మున్నచో వధువు దక్కు
విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె
యనుచు వచియింత్రు పల్వురు ఘనులు మనకు
సద్యోజాతుని పైనభక్తి మదిలో సంకల్పమైయుండగా
నాద్యంతమ్ములు లేని వాని కృపతో నావిశ్వ విఖ్యాతుడౌ
విద్యారణ్యుని యొద్దచేరి సరియౌ వేదాంత పాఠాలతో
విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో
విద్యాభ్యాసము సేయ వెళ్ళితివిగా వేర్వేరు దేశాలకున్
రిప్లయితొలగించండివిద్యా వంతులు సెప్పగన్ చదువులన్ ప్రేమాభిమానాలతో
సద్య స్ఫూర్తిని జూపుచున్ గురువులన్ సద్భక్తితో కొల్చి పల్
విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో
ఎంత విత్తముండిన నేమి హితము, , పెండ్లి
రిప్లయితొలగించండిజేసు కొనెదమని దలచ జెలువ దొరక
కుండె , తగినంతటి గడన కొరత కనుక ,
విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె