24, జులై 2026, శుక్రవారం

సమస్య - 5538

25-7-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె”

(లేదా...)

“విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో పి.యెల్. నాగేశ్వరరావు గారి సమస్య)

6 కామెంట్‌లు:

  1. తేటగీతి
    చక్కనైన మిత్రవరులు దక్కినంత
    తల్లిదండ్రి యాశయముల తనయుఁడౌచు
    వమ్ము జేయ కుండ కలల వాంఛదీర
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె!

    శార్దూలవిక్రీడితము
    సద్యస్ఫూర్తిని గల్గు మిత్రులమరన్ సావాస మేపార నై
    వేద్యంబంచును భక్తి వాణి కొసఁగన్ ప్రీతిన్ ప్రసాదంపు వై
    విధ్యంబౌ నిపుణత్వమున్ గురియగన్ విజ్ఞాన భాండమ్ముగన్
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో?

    రిప్లయితొలగించండి

  2. పెండ్లి వలదంచు నీవిట్లు పేచి పెట్ట
    నేల లక్షల లంచమ్ము నిచ్చి కాదె
    మంచి నౌకరిన్ గొంటి కుమార వినుము
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె.



    ఉద్యోగంబది లేక నూఢి యదియే యుక్తంబు కాదంచు నా
    డాద్యుల్ చెప్పిన యట్టి మాటలవినేనాలించి లంచంబు తో
    నుద్యోగమ్మును గొంటి గాదె యిక ప్రత్యూహమ్మదే వీడె గా
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో.

    రిప్లయితొలగించండి
  3. విద్య తెచ్చునుద్యోగము వేగిరమున
    వరునికుద్యోగ మున్నచో వధువు దక్కు
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె
    యనుచు వచియింత్రు పల్వురు ఘనులు మనకు

    సద్యోజాతుని పైనభక్తి మదిలో సంకల్పమైయుండగా
    నాద్యంతమ్ములు లేని వాని కృపతో నావిశ్వ విఖ్యాతుడౌ
    విద్యారణ్యుని యొద్దచేరి సరియౌ వేదాంత పాఠాలతో
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో

    రిప్లయితొలగించండి
  4. విద్యాభ్యాసము సేయ వెళ్ళితివిగా వేర్వేరు దేశాలకున్
    విద్యా వంతులు సెప్పగన్ చదువులన్ ప్రేమాభిమానాలతో
    సద్య స్ఫూర్తిని జూపుచున్ గురువులన్ సద్భక్తితో కొల్చి పల్
    విద్యల్ నేర్చితివీవు కొల్వు దొరికెన్ బెండ్లాడ జాగెందుకో

    రిప్లయితొలగించండి
  5. ఎంత విత్తముండిన నేమి హితము, , పెండ్లి
    జేసు కొనెదమని దలచ జెలువ దొరక
    కుండె , తగినంతటి గడన కొరత కనుక ,
    విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లికొఱకె

    రిప్లయితొలగించండి