26, జులై 2026, ఆదివారం

సమస్య - 5540

27-7-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అంధుం బరిమార్చె జనకునల్లుఁడు గరుణన్”

(లేదా...)

“అంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో ఆరవల్లి శ్రీదేవి గారి సమస్య)

26 కామెంట్‌లు:

  1. బంధించెను పుడమి సుతను
    బంధకుఁడగు రావణుండు బలవంతముగా
    సంధించి బాణమును గ
    ర్వాంధుం బరిమార్చెను రఘురాముఁడు గరుణన్

    రిప్లయితొలగించండి
  2. స్కందుని పితను భజించుచు
    గంధము నొందు కతన దన గాదిలి సీతన్
    బంధించి యుంచెనని యా
    అంధుం బరిమార్చెను రఘురాముఁడు గరుణన్

    రిప్లయితొలగించండి

  3. కంధిని దాటుచు కప్పుర
    గంధిని బ్రోవంగ నెంచి కపి వాహినితో
    నంధక రిపు భక్తుని కా
    మాంధుం బరిమార్చె జనకునల్లుఁడు గరుణన్.


    కంధిని దాటి లంక జని కాంతను గాంచిన వాయు పుత్రుడే
    సంధి విచేష్టయే చెడెను సంగర మయ్యదె మేలనంగ గ
    ర్వాంధుని యంతు చూడగను వానర వాహిని తోడ సాగి కా
    మాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  4. సంధికి సమ్మతమొసగని
    బంధకుడౌ లంకవిభుని పైతలపడి గ
    ర్వాంధుని కుజహారిని కా
    మాంధుం బరిమార్చె జనకునల్లుఁడు గరుణన్

    బంధకుడైన రావణుఁడు పార్థివినే తరలించె లంకకే
    బంధితనారి జానకికి బంధవిముక్తి నొసంగ రాముడే
    సంధికి సమ్మతించని నిశాటునితో తగు పోరుసల్పి కా
    మాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. సుందరి సీత జాడెరిగి చువ్వన వానర సేన తోడుగన్
      కంధిని దాటి లంక జనికాంతను సీతను బ్రోచడానికై
      స్కంధము నందు తీవ్రముగ సల్పుచు పోరును దుష్టుడైన కా
      మాంధుని సంహరించె గరుణార్ద్ర మనస్కుడు రాముడయ్యెడన్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రోచడానికై' అనడం సాధుప్రయోగం కాదు.

      తొలగించండి
  6. కందం
    సంధిత శాపవిమోచన
    బంధమనఁ దశాస్యుఁడయ్యె వైరి! హరియె తా
    గంధవతి నవతరణఁ గా
    అంధుం బరిమార్చె జనకునల్లుఁడు గరుణన్

    ఉత్పలమాల
    సంధిత శాపమై జయుఁడు శౌరికి వైరిగఁ బుట్టి చేరుటే
    బంధురమంచు లంక దశవక్త్రుని జన్మము నొందె, రాముడై
    గంధవతిన్ జనించె హరి, కారణ జన్ముల బంధమొప్పఁ కా
    మాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్

    రిప్లయితొలగించండి
  7. కం;బంధము నెంచక సుతుడే
    యంధుం బరిమార్చె జనకు , నల్లుఁడు గరుణన్
    బాంధవ్య మెంచి మామకు
    నంథత్వము బాపు వైద్య మందగ జేయన్.
    (అల్లుడు అంథు డైన మామకి వైద్యం చేయించాడు. కొడుకే చావ గొట్టాడు. )

    రిప్లయితొలగించండి
  8. ఉ:సింధువు దాట వానరుల చేతనె సేతువు గట్ట జేసి తా
    బంధము బాప జానకికి పాపిని, రావణు,దుష్టచిత్తు కా
    మాంధుని సంహరించెఁ, గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్
    బంధము వీడి యా రిపుని భ్రాతయె రాగ గ్రహించె మిత్రుగన్.

    రిప్లయితొలగించండి
  9. (3)ఉ:బంధము లందె ప్రేమ గలవా డొక డిట్లనె " కైక లోని మో
    హాంధత గౌరవించి తన యాత్మజు దల్చుచు మూర్ఛ జెందు నా
    బంధము గాంచ లేక యెటు వర్తిలె? నేలనొ తండ్రి యైన ప్రే
    మాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్?
    (బంధములు గొప్పవి అనుకొనే ఒకడు "రాముడు కైక యొక్క పుత్రమోహాన్ని గౌరవించాడు కానీ తన పట్ల ప్రేమాంధుడైన తండ్రి మరణానికి కారకు డయ్యాడు కదా!అని ప్రశ్నించాడు. )

    రిప్లయితొలగించండి
  10. బంధకుఁడైన రావణుడు పావని సీతను దెచ్చి లంకలో
    బందినొనర్ప రాఘవుఁడు వానరసేనను గూడి లంకకున్
    కంధిని దాటివచ్చి దశకంఠునితో సమరమ్మొనర్చి కా
    మాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ అంధుఁడు కామమొదవి సం
    బంధము లేనిఁ పడతిఁ జెర పట్టిన తఱినే
    బంధము పట్టకఁ జను గ
    ర్వాంధుం బరిమార్చె జనుకునల్లుఁడు గరుణన్

    ఉ॥ అంధుఁడు కామమే కనుల యందున నిండఁగఁ గాంచఁ డెద్ది సం
    బంధము లేని స్త్రీనిఁ జెర పట్టెడు వాఁడు హితమ్ముఁ గోరు స
    ద్బంధువులన్ గణించక మదమ్మున సాగెడు వాఁడు నట్టి గ
    ర్వాంధుని సంహరించెఁ గరుణార్ద్ర మనస్కుఁడు రామఁ డయ్యెడన్

    (రావణునికి ఎవరు నీతి బోధ చేసినా వినలేదు కదండి)

    రిప్లయితొలగించండి
  12. బంధించె సీత నిని యును
    సంధిని విడనాడి వెడలి సమరము నందున్
    సంధించి న శరము న కా
    మాంధుని పరిమార్చె జనకు నల్లుడు కరుణ న్

    రిప్లయితొలగించండి
  13. సింధు సమానుఁడు కరుణన్
    బంధింప నిజ సతి నసుర వమ్మయి యుండన్
    సంధి వధియించి వర గ
    ర్వాంధుం, బరిమార్చెను రఘురాముఁడు కరుణన్


    కంధర సన్నిభాంగుఁడు నృకాంత కుమారుఁడు జానకీ సతీ
    బంధన తప్త మానసుఁడు వహ్ని దహించి వనిం గబంధ దో
    ర్బంధితుఁ డా కబంధు ఘన రాక్షసు శక్రద శాప తప్తు జ్ఞా
    నాంధుని సంహరించెఁ గరుణార్ద్ర మనస్కుఁడు రాముఁ డయ్యెడన్

    కబంధుఁడు జ్ఞానాంధుఁడు, ప్రమాణము:
    శ్రీమదాంధ్ర రామాయణము. అరణ్య. 20, 21.

    కం. తెలిసిన వచింపుమ యెవరు
    లలనా మణి సీత నెటకు రయమున నే లీ
    లలఁ గొని పోయిరొ దయ మా
    కిల మే లొనరింపు మయ్య యింపుగ నింకన్

    చం. పలుకఁగ రాముఁ డివ్విధము వాక్య విశారదుఁ డంత నద్దనుం
    డు లలిత వాక్య వక్త యనె డుల్లెను దివ్యపు నాదు జ్ఞానమే
    యిలఁ దగులంగ శాపము మహీసుత నేరను సంస్కరింపఁగాఁ
    దెలిసిన వానిఁ జెప్పెదను దివ్యపు రూపము నూని యంతటన్

    రిప్లయితొలగించండి
  14. బంధించెసీతననుచును
    వంధ్యుఁడె యారావణుఁడని పలుకుచు గరిమన్
    సంధించివింటియాగ
    ర్వాంధుంబరిమార్చె జనకునల్లుఁడు గరుణన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంధించి వింటి నా గర్వాంధుని..."

      తొలగించండి
  15. కుందగజేయ మౌనులను కోపము వారు శపించ ద్వారకుల్
    బంధురమౌ వికుంఠమున వర్జితులై జనియించి ధాత్రిపై
    బంధన జేయ రావణుడు పార్థివి, వానిని శాప యుక్త గ
    ర్వాంధుని సంహరించెఁ గరుణార్ద్రమనస్కుఁడు రాముఁ డయ్యెడన్

    రిప్లయితొలగించండి
  16. వాట్సాప్ లో సమీక్షించిన పద్యాలను ఇక్కడ సమీక్షించలేదని గమనించ మనవి.

    రిప్లయితొలగించండి