31, జులై 2026, శుక్రవారం

సమస్య - 5545

1-8-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్”

(లేదా...)

“మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితోఁ జెప్పితిన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య)

24 కామెంట్‌లు:

  1. మా కంద పద్యము నెదిరి
    తోకముడుచు దమరు నుడువు తుచ్ఛపు కవితల్
    ఈ కవితల రవరవలో
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్

    రిప్లయితొలగించండి
  2. మీకుంగూరిమి పల్లెలందు బ్రతుకన్ మేమేమొ పట్నంబులన్
    చీకున్ జింతయు లేక నిమ్మళముగా జీవించగా జూతుమే
    మాకుం దోచదు పల్లెలందు గడుపన్ మా దారి భిన్నంబికన్
    మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితోఁ జెప్పితిన్

    రిప్లయితొలగించండి
  3. 'చేకూర్చన్ దలచితి యతి
    మాకున్ మీకును ప్రమోదమౌ పద్యములో
    నాకిడుమా నీ సమ్మతి'
    'మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్'

    'నాకో సందియమున్న దయ్య దయతో నాకిప్డెఱింగించుమా
    చేకూర్చన్ యతి నీమమేమి హొయలే చిందించు ఛందస్సులో
    మాకున్ మీకును మైత్రి శక్యమగునా మైత్రేయ వాక్రుచ్చుమా'
    'మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితోఁ జెప్పితిన్'

    రిప్లయితొలగించండి

  4. హే కవి పొరపాటొక్కటి
    నే కనుగొని చెప్పు చుంటి నీ కావ్యమునన్
    మా కు యతి తప్పె గాంచుము
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్.


    నీ కావ్యంబున దోషమొక్కటిపుడే నే గాంచి చూపింప నా
    పై కోపంబది యేల? గాంచుమిది నీ పద్యంబు లో పాదమున్
    మాకంచున్ మొదలైన పాదపు యతిన్ మార్చంగ నొప్పౌను లే
    మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితోఁ జెప్పితిన్.

    రిప్లయితొలగించండి
  5. పాకున్ బాకును మైత్రి చెల్లు యతికై పద్యంబులో చక్కగన్
    కాకున్ గాకును మైత్రి చెల్లు యతికై కట్టొచ్చు పద్యంబునున్
    నాకున్ నీకును పద్యమన్న నెనరే నాంచారి , పద్యంబులో
    మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితో జెప్పితిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కట్టొచ్చు' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  6. చే కొను చు లo చ ములు దా
    వా కొను చెలిమి యొ న ర్చె డి వాంఛ ను దెలు ప న్
    మేకొని పలికి త త ని తో
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజము గన్

    రిప్లయితొలగించండి
  7. -

    యే కులము వేంకటేశా?
    మాకు తెలియకున్న చోడుమయ్యరొ! దాటం
    గా కుదరని కేయమిదయొ
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఏ కులము.." అనండి. మూడవ పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. కేయము అనగా అగడ్త అని‌ ఆంధ్రభారతి ఉవాచ :)

      ఈ కులమనే కుదరని అగడ్తని మించి ఏ కులమో తెలియని నిను .... :)


      తొలగించండి
  8. కం:ఓ కవి! తెలుగు ప్రజలలో
    నేకత కర వనగ ఛందమే యొక ఋజువౌ
    నాకున్ నీకున్ గుదురదు
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్”
    (తెలుగు వాళ్లకి ఐక్యత లేదనటానికి ఛందస్సే ఉదాహరణ.అక్కడ నాకు,నీకు మైత్రి కుదరదు.మాకు,మీకు కుదరదు.అని ఒక చమత్కారం)

    రిప్లయితొలగించండి
  9. శా:"మా"కున్ "మీ"కు యతిన్ ఘటించితివి గా మాయమ్మ! గుర్తుండదే
    నీకున్?హల్లును గల్ప జాలదు గదా! నిర్ణీత మౌ నచ్చులే
    లేకుండన్ యతి వేయరాదు కద! యాలింపంగ నిన్ గోరెదన్
    మాకున్ మీకును మైత్రియేకుదుర దమ్మా!మైత్రి తో జెప్పితిన్
    (పద్యం లో ఒకామె మా కు మీకు యతి వేస్తే మిత్రుడు అది కుదరదని చెప్పినట్లు. )

    రిప్లయితొలగించండి
  10. ' మీ' కును 'మే' కెపుడైనను
    ' మా' కును 'మై' తోడనెటుల మైత్రి కుదురునో
    మాకు తెలిసినంత దనుక
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్

    రిప్లయితొలగించండి
  11. తాఁకవు భిన్న ధృవమ్ములు
    వీఁకఁ జలుప యత్నములను విశ్వం బందున్
    మా కేల నయ్య తగవులు
    ‌మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్


    కైకొండంచును మైత్రి నాఁ దనరు నిక్కన్యామణిం జూపఁగా
    మీకున్ లే కిఁక మాకు నొక్కరికె చుమ్మీ సేవ కర్హం బగున్
    వీకం బల్కిరి యిట్లు బంధువు లొగిన్ వేర్వేరుగాఁ గావునన్
    మాకున్ మీకును మైత్రియే కుదర దమ్మా మైత్రితోఁ జెప్పితిన్

    రిప్లయితొలగించండి
  12. వకుళా! వినునా మాటను
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్”
    మీకులపు చూడ పద్ధతి
    మాకవిసరిపోవు బాల! మైత్రికి నెపుడున్

    రిప్లయితొలగించండి
  13. మొట్ట మొదట తనను సమీపించి భీముని వలచితినను హిడింబతో కుంతీమాత:

    కందం
    ఈ కారడవి వసించెడు
    రాకాసివి నీవుజూడ, రహితో పతిగా
    మా కొమరునెంచితివనన్
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్

    శార్దూలవిక్రీడితము
    కాకల్ దీరిన వారు మీ రలన నాకాంక్షల్ విబేధించెడున్
    రాకాసుల్ జన జీవనంబునొదవన్ రాణించుటెట్లుండునో
    జేకూరన్ దగవమ్మ పత్నివిగ రంజిల్లంగ నా సూనుతో
    మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితోఁ జెప్పితిన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    (వివాహ సంబంధంగా....)
    మాకున్ సంపద లేదని
    మీకున్ జెప్పితిమి ముందె,మీరడిగితిరం
    చున్ కానుకలెటు లిత్తుము
    మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్.

    రిప్లయితొలగించండి