19, ఫిబ్రవరి 2017, ఆదివారం

సమస్య - 2287 (పృచ్ఛకులఁ గాంచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"పృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె"లేదా...
"బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే"

35 కామెంట్‌లు:



  1. అదిగది గో! గనుండటను శంకరు కొల్వు కవీశ్వరుల్ సుమా
    కుదురగ వేళ వచ్చి రిట కోరిక మేరన నేటికిన్నిటన్
    సదనము వారిదే యనగ చట్టని చుట్టుచు చాపనౌ భళా
    బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. "శాస్త్రి" పేరున్న వారెల్ల శాస్త్రులవరు
    "సోమయాజులు" జేయరు హోమములను
    "వెంకటావధాని" వణికి వీవ లోన
    పృచ్ఛకులఁ గాంచి "యవధాని" బెదరి పాఱె


    వీవ = Viva Voce

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పేరులో నేమున్నది పెన్నిధి అన్నట్టు చెప్పిన మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
      Viva ను వైవా అంటారని విన్నాను!?

      తొలగించండి


  3. పదరకుడటు జిలేబి యప్రస్తుత మన
    పృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె
    శంకరాభరణ కవులు చక్క నైన
    నేమి పారితోషికము యెంతేని నేమి :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. గట్టి వారలు పండితుల్ దిట్ట మైన
    హృద్య మంబగు పదముల నుద్య మించ
    తెలిసి తెలియక నాతడు తెల్ల బోయి
    పృచ్చకులఁ గాంచి యవధాని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  5. చదువది కొంచమే యనగ చాలిన గర్వము మెండు గావుతన్
    విదితము గాకపోయినను వేయివిధమ్ముల భేషజమ్ముగా
    కుదుకన గోలు బోవగను కూరిమి నెంతయు తోచకున్నచో
    బెదిరి పలాయితుం డయెను పృచ్చకులం గనఁగన్ వధానియే

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    బిరుదు నాశించి బిరబిర బిగియ గోచి
    సవరణము జేసి సభకని సాగె కవిగ
    ధారణంబు చమత్కృతి దనరలేక
    పృచ్ఛకుల గాంచి యవధాని బెదరిపారె!

    చెదిరిన యాత్మబోధ సరిజేయని యభ్యసనమ్ము దాననే
    కుదురునె పాండితీ ప్రభలు 'కూటికినైన విషంబు ద్రాగుచో'
    అదిరెడి బ్రశ్నలొక్కటొకటారడిబెట్టగ నోలగంబునన్
    బెదరి పలాయితుండయెను పృచ్ఛకులం గనగన్ వధానియే!

    రిప్లయితొలగించండి
  7. వాణి తేజమ్ము నిండును వానిలోన
    నమ్మకమ్మది నిండును నెమ్మి మదిని
    వెన్నుచూపని దన్నది నెన్న నెచట
    పృచ్ఛకుల గాంచి యవధాని బెదరిపారె?

    రిప్లయితొలగించండి
  8. ఆంధ్ర కవిపండితోత్తమ అష్టదిగ్గ
    జముల నోడింప భువన విజయము కేగి
    ''మేక కొకతోక'' పద్యము మేలమాడ
    పృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  9. కొఱ క బడరాని పదములు గూర్చి మిగుల
    వీలుకాని స మస్యలు విసరు నట్టి
    పృచ్ఛ కులగాంచి యవధాని బెదరి పా ఱె
    ననువు గానిచోదలదూర్చ వ్యర్ధ మనుచు

    రిప్లయితొలగించండి
  10. సంప్రదింపుల మేరకు సహకరించి
    తనదు యవధానమున్ చేయు తపన దీర్చు
    యొప్పిదమ్ముఁ బాటించక తప్పుకొనెడు
    పృచ్ఛకుల గాంచి యవధాని బెదిరి పాఱె

    రిప్లయితొలగించండి
  11. కోర్కెఁదీరగ ప్రేక్షకుల్ కూడిరచట
    సభను నిండిరి నాటియుత్సవముఁజూడ
    తమిని పంచెలుఁగట్టి యాలసముగ వచ్చు
    పృచ్ఛకులఁగాంచి యవధాని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  12. …………………………………………………

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,


    డా౦బికముగ దుశ్శాలువలను ధరి౦చి

    వీగు " చాకార పుష్టి - నైవేద్య నష్టి "

    యను విధమ్మున గనిపి౦చు నట్టి వ్యర్థ

    పృఛ్ఛకుల గా౦చి యవధాని బెదరి పారె :--

    * ర౦గు చీరల ధరియి౦చు గ౦గి రెద్దు

    ల గని బెదరి పోవు వృషభ రాజము వలె *
    ి

    వీగు = విర్రవీగు
    ి

    రిప్లయితొలగించండి
  13. చదువది శూన్యమై ధరను జాలక శక్తి యు జెప్ప పద్యముల్
    బెదరి పలాయతుండయెను పృచ్ఛ కులంగ నగన్ వధానియే
    బెదరి పలాయతుండగుట పెద్దరికంబును గాదు గా ధరన్
    పదును నెఱింగి పృచ్ఛకుల బ్రశ్న ల కుత్తర మీయగా దగున్

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. వృత్తములు నభ స్పృశ్యపు వృక్షములుగ
      శబ్దములు వివిధ కుసుమ షండములుగ
      వెలయ కవన వనాంతర విహరణముగఁ
      బృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె


      ["బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే"]

      “అగునకు వక్రంబు గూడుచో దీర్ఘం బగు. వక్ష్యమాణంబు ద్విత్వంబు.”
      ఈ సూత్రము ననుసరించి “అయెను” రూపమసాధువని యెంచి “ బెదరుచు పాఱి పోయెనట” గా సవరించి చేసిన పూరణ:


      మదమున హుంకరించి తృణ మాత్రుడు క్షత్రియ సంభవుండునున్
      సదమల చిత్త ద్రౌపదిని సాహస మంచుఁ దలంచి దొంగిలం
      బదపడి వెంట దూక నిక పాండవ వీరులు సైంధవుండటన్
      బెదరుచు పాఱి పోయెనట, పృచ్ఛకులం గనఁగన్, వధానియే

      [ పృచ్ఛకులు = యుద్ధ శాస్త్రములో వ్యాసమహర్షి యంతటి వారు;
      పృత్ + శకులం = పృచ్ఛకులం; పృత్ = యుద్ధము; శకుడు = బాదరాయణుడు ( వ్యాసముని); వధ + ఆని = వధాని; వధ = మారణము; ఆను = అణఁచు; యుద్ధము నణచి]

      తొలగించండి
  15. పరుగు లిడి నిత్యమవధాన ప్రక్రియలకు
    పృచ్ఛకుడ గాను యవధాన మిచ్చగింతు
    ననుచు కూసెడి కుకవిని యణగ ద్రొక్కు
    పృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె

    నిన్నటి సమస్యకు పూరణ

    కాలు గాల దిరిగి వేలు లక్షలు దెచ్చి
    కుమ్మరించి కూర్మి కొంగు బట్ట
    నలక పాన్పు లనుచు నటకెక్క జూచెడి
    యాలు లేని మగఁడు హాయినందు

    రిప్లయితొలగించండి
  16. ఇచ్చకంబులతో ప్రొద్దు బుచ్చ వచ్చి
    స్పష్టతయెలేని ప్రశ్నల, కష్ట బడుచు
    వారిలో వారు తడబడ, తీరు లేని
    "పృచ్ఛకుల గాంచి యవధాని బెదరి పాఱె!'



    రిప్లయితొలగించండి
  17. కవితలందున ప్రఖ్యాతి కలదటంచు
    సలిపెద నవధానమునని జబ్బచఱచి
    యతిరథమహారథులవంటి చతురులైన
    పృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  18. "ఇదిగొ సర్పమ్ము దీని వర్ణింపు" మనుచు
    ప్రేక్షకులనుండి పోకిరి విసిరినంత ,
    "అమ్మ బాబో "యటంచును హడలి గెంతు
    పృచ్ఛకుల జూచి అవధాని బెదిరి పాఱె !!

    🙏🌺నమో గురుభ్యః🌺🙏

    "ఎదుటనె మేడసాని , కనిపింపగ నాగఫణీంద్రశర్మయున్
    పదముల దిట్టయౌ గరికపాటియు వైద్యులు , శంకరార్యులున్!
    బెదిరి పలాయితుండయెను పృచ్ఛకులన్ గనగన్ వధానియే ! "
    నిదుర తొలంగెనింతనె ! యనిశ్చితి ! సత్యము గాదు స్వప్నమే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. కందిశంకరులాదిగాగలుగునట్టి
    పృఛ్ఛకులగాంచియవధానిబెదరిపారె
    దనదుధారణాశక్తినిదలచిమదిని
    ననువుకాదనియవధానమచటతనకు

    రిప్లయితొలగించండి
  20. చదువులతల్లి ప్రాపునను సాధనఁ జేసి గడించి విద్యలన్
    సదమలమైన పద్ధతిని చక్కగ చెప్పుచు కైతలిచ్ఛతో
    చతురతతో చెలంగుచును సల్పవధానములెప్డు, తానెటన్
    బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే?

    రిప్లయితొలగించండి
  21. అది రమణీయ రాయల సభాంతరమందున నిండుగా కవుల్
    కుదురుగ 'నష్ట పృఛ్చకులు' కూర్చొని యుండిరి వేదికా స్థలిన్
    ఎద బరువెక్కె నేమొ గని యెల్ల కవీశ్వర పండితాఖ్యులన్
    బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే

    రిప్లయితొలగించండి
  22. సమస్య:పృఛ్ఛకుల గాంచి యవధాని బెదరి పారె
    పూరణ:1.వేదిక పయి నాసీనులౌ విబుధవరుల
    భీకరానన కవిసింహ విశ్రుతులను
    సరసవాక్ప్రౌఢి గల్గు ప్రసంగపరుల
    పృఛ్ఛకుల గాంచి యవధాని బెదరి పారె
    సమస్య:బెదరి పలాయితుం డయెను పృఛ్ఛకులన్ గనగన్ వధానియే
    పూరణ: 2చదివెను సంస్కృతాంధ్రములు,చక్కని శైలిని కైత బల్కు, శా
    రద కృప,సేయ బూనె, రసరమ్యముగా నవధానజల్పమున్,
    పదునగు సంస్కృతంపు పదబంధము లున్న సమస్య నీయగన్,
    బెదరి పలాయితుండయెను పృఛ్ఛకులన్ గనగన్ వధానియే

    రిప్లయితొలగించండి
  23. .మెదడుకుమేతలేక,పరమేశ్వరి దీవెన లందబోకనే
    కుదురుగలేనిమానసము,కూర్పులు,నేర్పులు మార్పుతీర్పునన్
    అదరెనుయింటి కోరికల, నాలియు జాలియు లేని మార్పునన్
    బెదరి పలాయితుండయెను పృచ్చకులంగనగన్ వధానియే|
    2.పృచ్చకుల గాంచి యవధాని బెదరి పాఱె|
    యనుట కెవ్వరి కౌనట?వినగ వింత
    ధార,దత్తపది,సమస్య తగినరీతి
    పూర్తి జేయగ మెచ్చిరి|స్పూర్తిగాంచి
    ఆంధ్ర యవధానవర్యులయద్బుతంబు|

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కవన పరిచితి శూన్యమై కఱటు లైన
    రాజకీయ పురోగంత లాగ మించి
    పృచ్ఛకులుగ దుడుకు జూపు వేళ నట్టి
    పృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె

    రిప్లయితొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    శత,సహస్ర,పంచ సహస్రయుతమగు నవ

    ధాన ప్రక్రియలందున ధాటి గాను

    పాల్గొని సఫలతొందిన పండితుడును

    పృచ్ఛకుల గాంచి యవధాని బెదరి పాఱె

    ననుట యుచితంబె యాలోచనంబు జేయ.

    9490313830.
    *********************************

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు.
    మేనల్లుడి పెళ్ళి సందర్భంగా ఈరోజు దగ్గరి బంధువులకు ఇచ్చిన విందుకు వెళ్ళి కొంతసేపటి క్రితం ఇల్లు చేరాను. రాగానే మీ పద్యాల సమీక్ష ప్రారంభించాను. ఇంతలో నేను నిర్వహిస్తున్న 'శంకరాభరణం' వాట్సప్ సమూహంలో ఒక మిత్రుని (పుస్తక ప్రచురణకోసం విరాళాలు అడిగిన) వ్యాఖ్యలతో మనస్తాపం చెందాను. ఇక ప్రస్తుతానికి మీ పద్యాలను పరిశీలించలేను. మన్నించండి. వీలైతే రేపు స్పందిస్తాను.

    రిప్లయితొలగించండి
  27. చదువుచు ఖర్గపూరునను చావలి రామవధాని జంకుతో
    నదరుచు దూర ఛాత్రులను యాతన బెట్టెడి వైవ హాలులో
    చెదరిన బుద్ధి తోడనట చెమ్టలు గారగ నొంటినిండనున్
    బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే :)

    రిప్లయితొలగించండి