22, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్య - 2290 (ఖరపాదమ్ముల సేవ...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్"
లేదా...
"ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్"

74 కామెంట్‌లు:

  1. అరవకుమా జాలి దలచి
    మొఱలిడుదును నీకటంచు మ్రొక్కగ లేదా
    కరముల కృష్ణుని మోయుచు?
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీతి: రాజకీయ వ్యవస్థయందు శత్రువుల జయించుటకై సామ దాన భేద దండనలలో మొదటిది "సామము"

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. దురితంబుల్ పరిమార్చి చిత్తమున సంతోషంబు రేకత్తగా
    శరణున్ దైవముఁగోరినంత శుభముల్ సంప్రాప్తి చెందున్ గదా
    కరుణాలోలుడు,భక్తవత్సలు డుమాకాంతుండు నౌ చంద్రశే
    ఖర పాదమ్ములసేవ మానవులకున్ఁగళ్యాణముల్ఁగూర్చుతన్

    రిప్లయితొలగించండి
  3. పరిపూర్ణ మైన భక్తిని
    నిరతము ధ్యానించి నంత నిండు మనంబున్
    కొరతయె రాదట శశిశే
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్

    రిప్లయితొలగించండి


  4. హరహర శంభో‌ శంకర
    వరహా రంబై జిలేబి వరుసగ జపియిం
    చు రవాళి, చంద్రమశ్శే
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. గిరిజా రమణుని నాగా
    భరణుని హరుని త్రినయనుని ఫాలాక్షుని శం
    కరుని శివుని వర శశిశే
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    వరదుండై స్మరియించు మానవులనున్ వర్ధిల్లఁజేయున్; శుభా
    కరమైనట్టి హృదంతరాళమునఁ దాఁ గారుణ్యమున్ నిండఁగన్
    ధరనెల్లప్పుడుఁ గాచుచుండు మిగులన్; దద్దివ్య బాలేందుశే
    ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్!

    రిప్లయితొలగించండి
  7. ……………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    సురదైత్యుల్ జలధిన్ మధి౦ప పెను

    …………… స౦క్షోభమ్ము గావి౦చుచున్

    గరళ మ్ముద్భవ మ౦దె | నట్టి తరి

    …………… సత్కారుణ్యము౦ దాల్చుచున్

    పరి రక్షి౦చెను పార్వతీ పతియె విశ్వశ్రేణి |

    …………………… నా చ౦ద్రశే

    ఖర పాదద్వయ సేవ మానవులకున్

    …………… గళ్యాణము౦ గూర్చుతన్ !


    రిప్లయితొలగించండి
  8. పరిపూర్ణుడునిశ్చలుడును
    నిరతముదాయోగమందునిండినయతడు
    న్పార్వతియుతుడగుశశిశే
    ఖరపదములసేవయొసగుగళ్యాణమ్ముల్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిలిపే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  10. ధరనేలెడి దొర యగుచును
    వరవిభుడై మనుజ కోటి పాలన మిడుచున్
    నిరతము గాచే శశిశే
    ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్!

    రిప్లయితొలగించండి
  11. హరహర గరుణించమనుచు
    శరణంచును భక్తితోడ సన్నుతులిడుచున్
    నిరతము గొలువగ శశిశే
    ఖర పదములసేవ యొసగు గల్యాణమ్ముల్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరహర' అన్న సంబోధన తరువాత ద్రుతకార్యం కాని, గసడదవాదేశం కాని జరుగదు. కనుక 'కరుణించు' అనండి.

      తొలగించండి
  12. నిరుపేదలసేవించుచు
    కరమగు నెయ్యమ్ముతోడ, కలుషము విడువన్
    నిరతము తారాపతి శే
    ఖరపదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. అర భాగ మన్నపూర్ణయు
    హరు శిరమున గంగయుండి యాకలి దప్పుల్
    సరిదీర్చునదై శశి శే
    ఖర పదముల సేవ యొసఁగు కళ్యాణమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరహర!సదాశివా!శం
      కర!గిరిజారమణ!నీలకంధర!యనుచు
      న్నిరుసంజల౦దు శశిశే
      ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. వరమౌ మానవ జీవితమ్ముసిరికై వ్యర్థంబుఁ గానీక సు
    స్థిరమౌ ప్రేముడి పేదవారలసదా సేవించుచున్ దీక్షతో
    కరమౌ భక్తిని నిత్యమున్ తలచుచున్ కాత్యాయినిన్ చంద్ర శే
    ఖర పాదమ్ములసేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

    రిప్లయితొలగించండి
  15. పరమోత్కృష్ట విలాస తాండవ సనిస్వానాద్రి సంచారముల్
    గిరికన్యా కర సారసద్వయ సు సంకీర్ణప్రకాశమ్ములున్
    శరణాకాంక్షిత మౌని హృద్విపిన సంచారంపు శీతాంశు శే
    ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్


    పరమ పురుషుండు వేంకట
    గిరి నాథుఁ డట విలసిల్లఁ గీర్తిత మయ్యెం
    దిరుపతి తిరుమల ప్రముఖ శి
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్

    [పదము = స్థానము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  16. ఖర పాదమ్ముల సేవ మానవుల కు న్గళ్యాణ ముల్ గూ ర్చుతన్
    ఖర పాదమ్ముల సేవ మానవుల కున్ గష్టo బు లీడే ర్చునే
    ఖర పాదమ్ముల దా క గా నెపుడు నోకాంతమ్మ !పోబోకుమా
    యిరవుoగా దది గానె ఱుంగుమిక నేయేవే ళ లన్ బో సుమీ

    రిప్లయితొలగించండి
  17. అరయగ కలియుగమున ము
    ష్కరుల స్వైరవిహరణము సాధారణమై
    దొరతనములు శిక్షింపక
    ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో గణదోషం. "ము।ష్కరుల స్వైర..' అన్నపుడు 'ల' గురువు కాదు. సవరించండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు సవరించిన పద్యము
      అరయగ కలియుగమున ము
      ష్కరులే స్వైరవిహరణము సాధారణమై
      దొరతనములు శిక్షింపక
      ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్

      తొలగించండి
    3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. హర హర మహదేవ యనుచు
    నిరతము నెదలో కొలుచుచు నీమము తోడన్
    నెఱ నమ్ముకొనగ హిమ శే
    ఖర పదముల సేవ యొసగు గళ్యాణమ్ముల్!

    గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.
    ' రామా ' యన పలుకు నెవరు
    ఏమి వరుస యగు జనకున కిల దశరథుతో
    ఏ మగనికి సతి రేవతి
    రాముడు, వియ్యంకుడు, బలరామునికి గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హిమశేఖరుడు'..? "నెర నమ్మియు హిమకర శే।ఖర..." అనండి.
      క్రమాలంకారంలో నిన్నటి సమస్యకు పూరణ బాగుంది.

      తొలగించండి
    2. హిముడు అంటే చంద్రుడు అనే అర్థం వున్నందున శివుని హిమశేఖరుడని అన్నాను. ఇది సరి కాక పోతే శశిశేఖరుడని మారుస్తాను. దయచేసి తెలుపండి. ధన్యవాదములు.

      తొలగించండి
    3. హిముడు అని చంద్రునికి పర్యాయపదం ఉన్నా అది అంత ప్రసిద్ధం కాదు. మీరు చెప్పినట్లే సవరించండి.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరపున విరాళి జూపుచు
    నిరతము మనసించు చుండి నెమ్మిక తోడన్
    తిరువడి చలిపెడి విధుశే
    ఖర పదముల సేవ యొసఁగు గళ్యాణమ్ముల్

    రిప్లయితొలగించండి
  20. మురియుచు నభిషేకము నన
    వరతము వాంఛించు భవుని పాద యుగళమున్
    మరువక గొలువఁగ శశి శే
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    సోమయ సూరయల్ సవతి సోదరు లిర్వురు భామ వేషమున్
    గ్రామము గ్రామముం దిరిగి గాంచి కుదిర్చిరి పెండ్లి నొక్కచో
    రాముని కూతురెంకి బలరాముని బొట్టెడు నాని కొప్పనన్
    రాముఁడు వియ్యమందె బలరామునితో రవిచంద్రసాక్షిగాన్

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరపున్ నిచ్చలు నూర్ధ్వరేతసుని నాప్యాయమ్ముతో భక్తినిన్
    తిరువారాధన లెంచు వేడబము నుద్దీపించి నాణ్యమ్మునౌ
    సరవిన్ యొమ్మిక గూడు నర్చనలతో సాగించు నా చంద్రశే
    ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సరవిన్+ఒమ్మిక' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  22. నిరతం బద్భుతశబ్దజాల మహిమన్ నిష్ఠాగరిష్ఠాత్ములై
    సరసంబై ప్రజ నెల్లసద్గతులకై సమ్యక్ప్రయత్నం బిలన్
    కరముం జేయగ బల్కు కావ్యరచనం గావించు విద్వాంస శే
    ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్.
    సురుచిర శబ్దంబులతో
    నిరతానందంబు గూర్చు నిర్మలకృతులన్
    విరచించెడి సత్కవి శే
    ఖర పదముల సేవ యొసగు గళ్యాణమ్ముల్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  23. గరళమ్మున్ గ్రహియించె, భర్గుడల గంగాదేవినిన్ ప్రీతిమై
    శిరమందు న్వసియింప జేసె , సుధ నాశీస్సుల్ ప్రసాదించుచున్
    వరమౌ రీతినొసంగె దేవతలకున్, ప్రార్ధించ నా చంద్ర శే
    ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

    రిప్లయితొలగించండి
  24. గుర్తునుబెట్టిరియార్యులు
    గుర్తునకర్ధమ్ముదెలుపగోరుదుసామీ!
    కర్తలుగర్మలుగ్రియతో
    భర్తీయైలేదరచనభావములేదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా! అది నమస్కార చిహ్నం. మీ పూరణ బాగుందని, మీకు నమస్కారమని నా భావం.

      తొలగించండి
    2. గుర్తది వందనమునకున్
      గుర్తించితి మీదు ప్రతిభ గొప్పదనుచు సం
      పూర్తిగ వ్యాఖ్యానించెడి
      కర్తవ్యము మరచినాడఁ గద సుబ్బారావ్!

      తొలగించండి
    3. అయ్యో!వందనమంటిరి
      యయ్యా యిదిన్యాయమగునె?నర్హతగలదే
      యియ్యంగాదీసికొనగ?
      వెయ్యింతలనతులుమీకువిబుధవరేణ్యా!

      తొలగించండి
  25. ఖరులే రాజ్యము లేలగన్ జనములన్ కాపాడు వారెవ్వరే?
    మొర లాలింపగ రారు ఘోరకలిలో,ముక్కంటి నీవే గదా
    శరణమ్మింక,మృకండుసూను వలె రక్షన్ సేయుమా యిందుశే
    ఖర!పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

    రిప్లయితొలగించండి
  26. వరముల్ బంచెడిమూర్తి| ముఖ్యుడిలయాపద్ బంధువన్నట్లుగా
    శరణంబంటివ?సర్వరక్షకుడె|విశ్వంబందునూహించగా
    పరమై ప్రాణులగాచు దైవముగ ఆపన్నుండుగాచంద్రశే
    ఖర పాదమ్ములసేవ మానవులకున్ గల్యాణమున్ గూర్చుతన్
    2.ధరలోధర్మము నిల్పగ
    హరిహరులిల నసుర భయమునంతము జేయన్
    మరువరు|”భక్తిగశశిశే
    ఖర పదముల సేవ యొసగు”| గల్యాణమగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఇల నాపద్బంధు'వనండి.

      తొలగించండి
  27. పరమాత్ముండ జరామరుండు పుడమిన్ పాలించు గౌరీశుడున్

    వరదుండార్తుల రక్షకుండ చలుడ వ్యక్తుండు బాలేందు శే

    ఖర పా దమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

    నరడా! మర్వకు మెల్లవేళల సదానందున్ మదిన్ గొల్వుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద విభాగం ఇలా చేయండి...'పరమాత్ముం డజరామరుండు... రక్షకుం డచలు డవ్యక్తుండు...'

      తొలగించండి
  28. డా.పిట్టాసత్యనారాయణ
    ఖరకరుడే సూర్యుడు నా
    ఖరణుడు రాచరికపు జాతి,ఖరపుష్పములున్
    ఖరహరప్రియరాగమునౌ
    "ఖర"పదముల సేవ యొసగు కళ్యాణంబుల్!

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టా
    ఖరపాదమ్ములవెన్నియన్న ముఖర క్రాంతిన్"గురూ రెండ"నెన్
    ఖర శృంగమ్ములవెన్నియన్న"నొక"టా! గండడ్బలే శిష్యుడే
    "ఖరపాదమ్ము"గణమ్ములౌ స.హ.లునా"కారమ్ము"కున్నిట్టులే
    అరయన్ కొమ్మది యొక్కటొక్కటి గదాయాయెన్ స.భ ల్ తద్గణాల్
    "ఖరపాదమ్ముల"(సభల)సేవ మానవులకున్ గళ్యాణమున్ గూర్చుతన్
    అక్షర ,గణ పంక్తి నాధారముగా గ్రహించగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణలో 'ఖరణుడు'...?
      రెండవ పూరణలో 'గండడ్బలే'...?

      తొలగించండి
  30. వ్హాట్సప్ పూరణలు:


    "వరముల గోరుచు కాంగ్రెసు
    కరచిహ్నపు కాళ్ళుబట్టి కరచెడి యాదవ్!
    తరతమ మెరుగవు! గుజరాత్
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్!"

    "గుజరాత్ ఖరమని" మోడిని గేలి జేసిన యూపీ యాదవ పుత్రునికి అమిత్ షా సమాధానము...సరదగా!!!

    ************************

    హరి గోవిందా!!! యనకనె
    బిరబిర నెక్కక భళిభళి బీయము డబ్లూల్
    తిరముగ నెక్కు తిరుమల శి
    ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్



    బీయము డబ్లూల్ = BMW luxury cars
    శిఖర పదములు = కొండ మెట్లు

    రిప్లయితొలగించండి
  31. మొరలిడుదునయ్య శశిశే
    ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
    నరయక చేసిన యఘముల
    మరిమరి తలవక హరుండు మరువక నిచ్చున్.

    గిరిజాపతి షణ్ముఖ పిత
    హరహర మహదేవ యనుచు ననవరతంబున్
    నిరతము కొల్వగ,శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

    గరళము మ్రింగిన శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

    గరితల కనయము శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
    గిరిరాజ తనయ సతితా
    నరమేనై యుండి వారికభయమొసంగున్.

    పరితాపమదేల వినుము
    హరుని సతతము గొలువంగ హరియించుగదా!
    తరుణంబిదియే శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'కళ్యాణమ్ముల్+అరయక = కళ్యాణము లరయక' అవుతుంది. నుగాగమం రాదు. "కళ్యాణములే యరయక" అనండి.

      తొలగించండి
  32. గురువు గారిసూచన ప్రకారం సవరించిన పద్యం

    ఉరగాభరణుడు గంగా
    ధరుండు పాలాక్షుడతడె తామసహరుడౌ
    గిరిజాపతియౌ శశిశే
    ఖర పదములసేవ యొసగు గళ్యాణమ్ముల్

    పరమేశున్ దగ విశ్వసించిన సదా భక్తాళినే బ్రోచుచున్
    దురితమ్ముల్ హరియించి కాచుచును సంతోషమ్ములందించు నా
    గిరిజానాథుని నామమొక్కటె గదా కీర్తింపుమా, చంద్రశే
    ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతున్

    రిప్లయితొలగించండి
  33. మొరలిడుదునయ్య శశిశే
    ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
    నరయక చేసిన యఘముల
    మరిమరి తలవక హరుండు మరువక నిచ్చున్.

    గిరిజాపతి షణ్ముఖ పిత
    హరహర మహదేవ యనుచు ననవరతంబున్
    నిరతము కొల్వగ,శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

    గరళము మ్రింగిన శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

    గరితల కనయము శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
    గిరిరాజ తనయ సతితా
    నరమేనై యుండి వారికభయమొసంగున్.

    పరితాపమదేల వినుము
    హరుని సతతము గొలువంగ హరియించుగదా!
    తరుణంబిదియే శశిశే
    ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

    రిప్లయితొలగించండి
  34. కరముల్ మోడ్చుచు మ్రొక్కుచున్ కవితకున్ గారాబు సూనున్నకున్
    మరపున్ రాని విధమ్ముగా చిలుకగా మద్యంపు వర్షాలనున్
    వరదాతై తెలగాణనున్ ఘనముగా పాలించెడిం చంద్రశే
    ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

    రిప్లయితొలగించండి