27, ఫిబ్రవరి 2017, సోమవారం

సమస్య - 2294 (బాలుర సంహరించి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"బాలుర సంహరించి శిశుపాలుఁడు కీర్తి గడించెఁ బుణ్యుఁడై"
లేదా... 
"బాలురఁ బరిమార్చిన శిశుపాలుఁ డనఘుఁడౌ"

38 కామెంట్‌లు:

  1. కాలిని కుంటిగ జేయుచు
    వేలాది జనులను సోకి వేధించెడి యా
    పోలియొ భీకర వ్యాధది
    బాలురఁ; బరిమార్చిన "శిశుపాలుఁ" డనఘుఁడౌ!


    "శిశుపాలుడు" = పోలియొ వాక్సీనును కనుగొనిన పిల్లల వైద్యుడు "జొనాస్ సాక్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిశుపాలునకు మీరు చెప్పిన అర్థం బాగుంది. పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
      కొంత అన్వయదోషం ఉంది. "పోలియొ బాధింపగ పసి।బాలుర..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  2. మేలములాడి బంధుజన మిత్రవరేణ్యుల పెద్దవారలన్
    ఆలమునందు సజ్జనులనందఱితో జగడంబు సల్పి,వా
    క్పాలన లేక, దూషణ శఖామణియయ్యె-నదెట్టులోగదా
    బాలర సంహరించి శిశుపాలుఁడు కీర్తి గడించెఁబుణ్యడై!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యను ప్రశ్నగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెద్దవారల। న్నాలమునందు.." అనండి.

      తొలగించండి

  3. శూలము గొని వేగముగా
    బాలురఁ బరిమార్చిన శిశుపాలుఁ డనఘుఁడౌ
    చాలపు మహేంద్ర జాలికు
    డౌ! లెస్సగను బతికించె రాదీయుచునున్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పోలవరంబునం జదువ బోయెడి యాశ్రమవాసు లెల్లరన్
    మూలన నక్కి కాళ్ళనట మోదుచు మ్రింగగ దూకబోవుచున్
    వాలము నూపు బెబ్బులిని వాడదె శీఘ్రము ధైర్యయుక్తుడై
    బాలుర సంహరించి శిశుపాలుడు కీర్తి గడించె బుణ్యుడై.
    (శిశుపాలుడు = శిశురక్షకుడు)
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. చివర కొంత అన్వయలోపం. 'శీఘ్రము రక్ష సేయగా। బాలుర...' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. ఆర్యా!
      ధన్యవాదములు. అలా అంటే అన్వయ సందిగ్దత లేకుండా మరింత బాగుంటుంది. నేను ఆశ్రమ వాసు లెల్లరన్, బాలుర అనే విధంగా అన్వయం కుదురుతుందని భావించాను. పొరపాటు జరిగింది.

      తొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    పోలిక కంసుడు శిశువే
    ఆలమునన్ జంపు తననటన్నను యఘమి
    క్కాలపు శాస్త్రజ్ఞుడు స్త్రీ
    బాలుర పరిమార్చిన శిశు పాలుడనఘుడౌ

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    పాలనజేయ శాస్త్రములె, బంధము గూల్చగనైన నవ్వియే
    చాలవటయ్య శోధనలు చావులబెంచుటదేల పిండ సం
    చాలనమాపి స్త్రీగ గను శ్రాంతిని/(శాల్తుల)మాయము జేయు విజ్ఞుడే(శాస్త్రజ్ఞుడే)
    బాలుర సంహరించి శిశుపాలుడు కీర్తిగడించె బుణ్యుడై!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా నుండి,ఆర్యా,
    పుండు-అలించు ॥పుండలించు.అలించు కు అర్థం లేదు.కాని ప్రేమాతిశయము గూర్చిన భావన ఉంటుంది.ఆ పదాన్ని అన్యార్థంలో వాడినాను.పదం మంచిది,అదష్టమే తక్కువ.

    రిప్లయితొలగించండి
  8. కాలరు సవరించు కొనుచు
    చాలరు నాసాటి యెవరు సాహస మందున్
    తేలిక దుష్కార్య ములుజేయ
    బాలురఁ బరిమార్చిన శిశుపాలుఁ డనఘుఁడౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      మూడవ పాదంలో గణదోషం. 'తేలిక దుష్కార్యమ్ములు' అనండి.

      తొలగించండి
    2. కాలరు సవరించు కొనుచు
      చాలరు నాసాటి యెవరు సాహస మందున్
      తేలిక దుష్కార్య మ్ములుజేయ
      బాలురఁ బరిమార్చిన శిశుపాలుఁ డనఘుఁడౌ

      తొలగించండి
  9. మేలగు తనకనె కంసుడు
    బాలురఁ బరిమార్చిన ; శిశుపాలుఁ డనఘుఁడౌ
    పోలియొ వ్యాధి నిరోధిగ
    కాలము గడుపక సృజించ ఘన యౌషధమున్

    (శిశుపాలుడు = బాలల కాపాడు వాడు )

    నిన్నటి సమస్యకు నా పూరణ

    అరసి కీచకు నంపగాయముని దరికి
    వాని నోటివాపును దీర్చ వలలునిగనె
    నీవు కాపుండుమని గోర నిజవనితయె
    చిత్ర వద్ద చేసె భీముడు చిత్రముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఘన+ఔషధము = ఘనౌషధము' కదా!'ఘనమగు మందున్' అందామా?

      తొలగించండి
  10. పాలకుడయ్యునుదుష్టుడు
    బాలురబరిమార్చినశిశుపాలుడ,నఘుడౌ
    బాలురమంచినిచెడ్డను
    లాలనతోజూచునతడురహినీజగతిన్

    రిప్లయితొలగించండి
  11. మహాకవి పోతనామాత్యునకు వినమ్ర ప్రణతులతో:

    బాల రసాల సాల నవ పల్లవ కోమల విగ్రహమ్మునన్
    సాల విభంజనుండును విశాల భుజాంతర భాసితుండు గో
    పాల సునామధేయమునఁ బద్మ దళాక్షుడు కంస మల్లురన్
    బాలుర సంహరించి శిశుపాలుఁడు కీర్తి గడించెఁ బుణ్యుఁడై

    [శిశువు = వత్సము; శిశుపాలుఁడు =(గో)వత్స పాలకుడు:కృష్ణుడు]
    “వనమార్గంబున గోప బాలకులతో వత్సంబులన్ మేపుచుం” భాగ. 10.పూర్వ. 1331


    కాల వశంబున కంసుడు
    బాలురఁ బరిమార్చిన, శిశుపాలుఁ డనఘుఁడౌ
    మాలినిఁ గృష్ణుని నిందల
    పాలుం జేయగ సమసిరి వనజజు లీలన్

    రిప్లయితొలగించండి
  12. పాలకుడయ్యునాతడిటపాలసుడయ్యెనునేమిఖర్మమో
    బాలురసంహరించిశిశుపాలుడు,కీర్తిగడించెబుణ్యుడై
    బాలలమంచిచెడ్డలనటబాగుగజూచుచున్యాయశీలుడై
    లాలనతోడనుంటయనురాగమునొందెనువారినుండియున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'పాలసు డయ్యె నదేమి ఖర్మమో...మంచి చెడ్డ లట బాగుగ...' అనండి.

      తొలగించండి
  13. కాలుని లోకము గల్గును
    బాలురఁ బరిమార్చిన, శిశుపాలుఁ, డనఘుఁడౌ
    పాలకడలిశయనుఁ దా
    హేళన జేసి సభలోన నీభువి వీడెన్

    రిప్లయితొలగించండి
  14. తేలిభయమ్మునుండి కడు తీరుగనుండెను కంసుడెవ్విధిన్?
    గేలియొనర్చి శ్రీపతిని గిట్టిన దెవ్వరు చక్రదాటికిన్?
    పాలసముద్రపున్ శయను భక్తిని, రక్షస పుత్రు డొందె తా?
    బాలుర సంహరించి, శిశుపాలుఁడు, కీర్తి గడించెఁబుణ్యడై

    రిప్లయితొలగించండి
  15. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
    సవినయ ప్రణామములతో,

    శ్రీమహాభాగవతపాత్రలై శ్రీకృష్ణాతిమానుషతత్త్వంతో అనుబంధాన్ని పొందిన ప్రతిఒక్కరూ ధన్యజీవులే.

    శ్రీలలనామనోహరుని సేవకుఁడై మునికోపలబ్ధజం
    బాలత సంసృతిత్రయముఁ బాయఁగ విష్ణుని ద్వేషమూని, దు
    ష్కాలముఁ గోరితెచ్చికొని శాపవిముక్తిని వైరిషట్కజా
    బాలుర సంహరించి శిశుపాలుఁడు కీర్తి గడించెఁ బుణ్యుఁడై.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాన్యులు ఏల్చూరి మురళీధరరావుగారూ...నమస్సులు!

      శ్రీకృష్ణాతిమానుషతత్త్వాభియుక్తితో మీ పూరణ మనోహరంగా ఉన్నది. శుభాభినందనలు!

      తొలగించండి
    2. మాన్యవిద్వత్కవీంద్రులు శ్రీ మధుసూదన్ గారి
      సౌహృద్యోదితానికి హృదయపూర్వక ధన్యవాదాలు!

      మీవంటి విద్వన్మాన్యుల ప్రోత్సాహమే నాకు ప్రేరణ.

      తొలగించండి
  16. బాలుర బాలికా వసతి పాలకుడైనగురూత్త ముండునా
    బాలురు యెట్టి యాపదలపాలవకుండగ కాపుకాయునా
    పాలకుడేసదా శిశువుపాలకుగా జనసాధులందరౌ
    బాలుర సంహరించి శిశుపాలుఁడు కీర్తి గడించెఁ బుణ్యుఁడై

    రిప్లయితొలగించండి
  17. *సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    నాలుగువచ్చెవేగవిషనాగములా శిశుమందిరంబునన్
    పాలకుడడ్డువచ్చి గబగబా బడితన్ గొని నేర్పుమీరగన్
    వాలములున్ తలల్ పగులఁబాదెనుపాముల బ్రోచెనట్లునా
    *బాలుర! సంహరించి, శిశుపాలుఁడు, కీర్తి గడించెఁబుణ్యడై*

    *సహస్రకవిరత్న కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  18. బాలుర సంక్షేమ గదిన్
    తేలొకటి రయమున దూరి తిరుగుటఁ గనియున్
    జాలిపడి నిలువరించుచు
    బాలురఁ, బరిమార్చి శిశుపాలుఁడనఘుడౌ

    శిశుపాలుడు = Hostel warden

    రిప్లయితొలగించండి