2, డిసెంబర్ 2020, బుధవారం

సమస్య - 3562

3-12-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్"

(లేదా...)

"జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ"

83 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    చిన్మయ రూపునాదటను చిందులు వేయుచు కొల్వగా జనుల్
    కన్మరు గొందగన్ మురిసి కానగ రాగను వాక్సినయ్యనున్
    తన్మయ మొందుచున్ తనరి దండుగ మాలిన వైరసమ్మదౌ
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ...

    రిప్లయితొలగించండి
  2. చిన్మయుశివుసన్నిధిలో
    తన్మయుడైనట్టినరుడుతనరగమదిలో
    సన్మయమోదంబోదవగ
    జన్మదినంహోత్సవముశ్మశానమునందగున్

    రిప్లయితొలగించండి
  3. చిన్మయ రూపా చెపుమా
    జన్మ రహస్యము తెలియగ సారమెరుంగన్
    తన్మయమునవైరసునకు
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్!!

    రిప్లయితొలగించండి
  4. నాదు మాటలును వినక నాతి వెడలె,

    సంతసముతోడ జనులెల్ల జరుప రాదు

    జన్మదిన మహోత్సవము, శ్మశానమందె

    పిండమును రుక్మిణికి నేను పెట్టు వాడ
    ననుచు పలికెను రుక్మి జ నకుని తోడ


    తన మాటలు వినకుండా కృష్ణుని తో వెళ్ళిన రుక్మిణి జన్మదినము జరుప రాదని‌ రుక్మి తన తండ్రి తో పలుకు సందర్భ ము

    రిప్లయితొలగించండి
  5. శ్మశాన సిరి బూడిద నుంచి అనంగుడుగా పుట్టిన వాని పునర్జన్మదినోత్సవము అక్కడే చేసిన తగునను భావముతో....

    కందం
    చిన్మయు హరు సాంబునిగన్
    తన్మయుఁడై చేయఁబోయి దగ్ధమ్మైనన్
    మన్మథుఁడనంగుని పున
    ర్జన్మదిన మహోత్సవము శ్మశానమునఁ దగున్

    ఉత్పలమాల
    చిన్మయమూర్తి శంకరుడు శీతనగాధిపు సూననందగన్
    జన్మము నందు తారకుని జంపెడుఁ బుత్రుఁడటన్న బూనుచున్
    మన్మథడయ్యె 'బూది' రతి మానసచోరు ననంగుదౌ పున
    ర్జన్మదినోత్సవమ్మును 'శ్మశానము' నం జరుపంగయుక్తమౌ

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పుట్టుకతో వచ్చినది పుడకలతో కూడా పోకుండెడిది: (కొంత మెట్ట వేదాంతము) 😊

    జన్మము నుండిమృత్యునకు జంబము మీరగ చెంతచేరుచున్
    చిన్మయ రూపునున్ మరువ జేయుచు హృత్తున దాగియుండుదిన్
    కన్మరుగొంద కాల్చి కడు కమ్మగ నుండు నహంకృతుండుదౌ
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దాగియుండుదిన్' ? "దాగియుండియున్... నహంకృతుండు తజ్జన్మదినోత్సవమ్మును..." అంటే బాగుంటుందని నా సూచన.

      తొలగించండి

    2. బోనసు సరదా పూరణ:

      చిన్మయ రూపుడౌ నగెడి జేజను తల్వగ భారతీయులౌ
      మన్మలు తాత తండ్రులును మామలు నత్తలు వేనవేలుగా
      తన్మయ మొందుచున్ జనరె ధన్యులు కాగను రాజఘాటుకున్...
      జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ...

      తొలగించండి
  7. జన్మకునొక్కటేశివము, జాగరమైనటువంటి రాత్రిలో
    చిన్మయరూపులౌ సుతులు, ఛీయని జేర్చిరి యాశ్రమమ్ములో
    కన్మరుగాయె బంధువులు,కాలము కర్మము కాటువేయగా
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ
    +++++++++++++++++++++++++

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆశ్రమము శ్మశానం వంటిదని మీ అభిప్రాయమా ?
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. మున్ముందుగ నౌషధమిక
    కన్మేరను లేక జనము కటకట బడరే,
    యున్మేషముడిగి కోవిడు
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్.

    రిప్లయితొలగించండి
  9. చిన్ముద్రనుకైదాల్చన్
    తన్మయముగ భవ్య రీతి తలచిన భక్తిన్
    మన్మథవైరికి నహహా
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పై పద్యాన్ని విస్మరించ ప్రార్థన🙏

      చిన్ముయ రూపుని పార్వతి
      తన్మయముగ తరచి జూచి చనువుగ పల్కెన్
      మన్మథవైరికి నహహా
      జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్


      కన్ముందర గనిపించెను
      మున్ముందర సీటుదక్క ముద్దుగ బొమ్మల్
      సిన్మా మాయల మారికి
      జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. చిన్మయ రూపసి సీత జ
    గన్మోహిని పలికెనిట్లు ఖలు రావణుడా
    షణ్ముఖ జనకుని భక్తుని
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తన్మయముగ జరుపుకొనుము
    జన్మదిన మహోత్సవము; శ్మశానమున దగున్
    కన్మరుగొందు వయస్సుని
    చిన్మాత్రమ్మును తలచుచు జేజే లనుటన్.

    రిప్లయితొలగించండి
  12. తన్మయు డౌచు భీష్ముని సదా నుతియించెడు భూరి భక్తుడా
    యున్మదుడైన రావణుడు యుక్తమయుక్తమె ఱుంగకుండ నా
    చిన్మయి బందిసేసెకద చివ్వున దానవ రాజును గూల్చి వానిదౌ
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  13. జన్మమునెత్తిన మనుజుని
    జన్మమగునుసార్థకంబుజనహితుడగుచో
    మృన్మరువువోలె బ్రతికిన
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్
    (మృన్మరువు=ఱాయి)

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తన్మయమొందు రీతిని నుదాత్తముగా నొనరించు చుండుమా
    జన్మదినోత్సవమ్మును; శ్మశానమునం జరుపంగ యుక్తమౌ
    కన్మరుగొందినట్టి చెలికాని ఘనమ్మును కీర్తిజేయుచున్
    చిన్మయుడా సఖున్ గని విశేషమునౌ శివమివ్వగోరుటల్.

    రిప్లయితొలగించండి
  15. సమస్య :
    జన్మదినోత్సవమ్మును శ్మ
    శానమునం జరుపంగ యుక్తమౌ

    ( పుత్రమరణసంజనిత దు:ఖవివశాత్ముడైన హరిశ్చంద్రుడు వారణాసిలోనిశ్మశానవాటికలో ...)
    ఉత్పలమాల
    -------------
    చిన్మయరూపుడౌ శివుని
    జెల్వపు జేతుల బూజజేసితే !
    మన్మన మందునన్ సుతుడ !
    మంచిగ వెల్గిన లోహితాస్యుడా!
    జన్మ ద్యజించినావ ! నును
    చక్కని చెక్కుల ముద్దుగొంచు నీ
    జన్మదినోత్సవమ్మును శ్మ
    శానమునం జరుపంగ యుక్తమౌ.

    రిప్లయితొలగించండి
  16. తన్మయమందుచున్ సుతుల తల్లులు
    నిండుగ నిర్వహించరే
    జన్మదినోత్సవమ్మును ; శ్మశానము
    నం జరుపంగ యుక్తమౌ
    చిన్మయరూపుడౌ శివుడు సేనల తోడుత తాండవంబునన్
    దున్మగ పాపభారమును ధూర్తుల పాలిటి కాలకాలుడై

    దునుము= ఖండించు

    రిప్లయితొలగించండి


  17. భవసాగరమ్మిదియె వన
    జ! వరలుచు సుఖమ్ముగాను జన్మదినమహో
    త్సవము శ్మ శానము నఁ దగున్
    జవసత్వములింకగా సుజన కుదరదుగా !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  18. తరిగెడు యౌవనమాయె వి
    నుర జన్మదినోత్సవమ్మును శ్మశానమునం
    జరుపంగ యుక్తమౌ త
    ప్పు రవంతయులేదు మునసబు కుమారుండా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. తన్మయమొంది జరుపనగు
    జన్మదినమహోత్సవము ; శ్మశానమునఁ దగున్
    కన్మోడ్పు శాశ్వతముగన్
    సన్మార్గమిదియె , నికపయి సాగించనగున్

    రిప్లయితొలగించండి
  20. చిన్మయ రూపుని రుద్రుని
    తన్మయ మగు జన్మ వేళ దర్పము లొప్పన్
    మన్మ o దిర నూ హల లో
    జన్మ దిన మహోత్సవ ము శ్మశాన న దగున్

    రిప్లయితొలగించండి
  21. నిన్నటి పూరణ

    వివిధానేకమనోరథమ్ము లొగి హృద్వీధి న్బ్రవర్తిల్లుచో
    బువి చాంచల్యమనస్కులౌదురని బొల్పొందన్ ప్రపూర్ణార్తిసం
    స్తవకైవల్యవిధాయకాశ్రయపదధ్యానైకనిష్కామకృ
    చ్ఛివపూజం, బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్.

    నిష్కామకృత్ + శివపూజ = కోర్కెలు లేని మంగళప్రదమైన పూజ.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం.

    రిప్లయితొలగించండి


  22. ము‌న్ముట్టగా కరోనా
    కన్మొగిచె తృటిని భళారె గాంచెను కలయున్
    తన్మాత్రములొరుగనికన్
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం అర్థం కాలేదు.

      తొలగించండి


    2. తన్మాత్రములు ఒరుగుట తగ్గిపోవుట సరియేనాండీ ?

      తొలగించండి
  23. నర్మగర్భం గా లక్ష్మి పార్వతితో

    త్వన్మహనీయవైభవము దంచితశోభనభాగధేయమౌ
    సన్మతి కాయమందునను సార్ధమొసంగగ భూతిపూతవై
    తన్మయమగ్నమైతివట తప్పెను వంటలు భిక్షుపత్ని! నీ
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ.

    కంజర్ల రామాచార్య.
    వనస్థలిపురం.

    రిప్లయితొలగించండి
  24. 03.12.2020
    అందరికీ నమస్సులు🙏

    *కం||*

    సన్మార్గము వీడగ నే
    జన్మను నీ కిచ్చినట్టి జనకుని నెపుడో
    సన్మానించక జంపిన
    *"జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  25. ఉ:

    తన్మయమొంది నేటికిని తత్పర తోడుత పూర్వకర్మగా
    జన్మదినమ్ము పండుగగ సాగగ నెంచిరి లోకమంతటన్
    కన్మరుగొంద నీ క్రమము కాటికి మారుచొ కర్మకాండగా
    జన్మ దినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్త మౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  26. చిన్మయుడగు నాశివునకు
    జన్మముమరణంబులనుటసబబేయార్యా!
    తన్మయతగలుగునెడలను
    జన్మదినోత్సవముశ్శశానమునదగున్

    రిప్లయితొలగించండి
  27. మైలవరపు వారి పూరణ

    తన్మయమందు వేడుకలఁ దాతకుఁబుట్టినరోజు చేయగాన్
    హృన్మథనమ్మునంది మరణించెను మోదము శోకమయ్యె.. వి..
    ద్వన్మణివాక్యముంగొని శవమ్మును పాడెను జేర్చిరంతటన్
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  28. చిన్మయరూపుడౌ శివుడుసేదనునొందుచువల్లకాడునన్
    దున్మెను బాపులందరిని దోరపువాడిన శూలధారియై
    సన్మతినానతీయుడిట సజ్జనులౌదగువారలెయ్యెడన్
    జన్మదినోత్సవమ్మును శ్శశానమునంజరుపంగయుక్తమౌ

    రిప్లయితొలగించండి
  29. (శివరాత్రి నాడు తనయుల గిల్లికజ్జాలతో
    సతమతమైన శివుని అవస్థ)

    షణ్ముఖు కిన్కగ బల్కెను
    మున్ముందుగపూజలెపుడు మూషికరథుకా
    చిన్ముద్ర బట్టి భవుడనె
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్

    రిప్లయితొలగించండి
  30. సన్మతి నేఁగి మహాత్ముని
    జన్మాహమ్మున నమాత్య సంచయము నతుల్
    మృన్మయ శాలకు నొసఁగును
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్


    విన్మిది చావు పుట్టుకలు విశ్వములోఁ బరికించ నింపుగాఁ
    జన్మఱి దైవ సమ్మతి విచారము నందిన లాభ ముండునే
    కన్మఱుఁ గైన వింతగ నకాలము జన్మ దినమ్ము నందునే
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'జన్మఱి' ?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      నింపుగాన్ + చను మఱి దైవ సమ్మతి(న్): ఇది నా భావ మండి.

      తొలగించండి
  31. మన్మథునగ్గికంటగనమన్యువుగావృషవాహనుండునా
    చిన్మయమూర్తిదృక్కులకు చిత్తజుడాయనె బూదికుప్పగా
    మన్మథుకిచ్చెజీవితము మన్ననజేసిరతీనివేదనన్
    జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మన్మథున కిచ్చె...' అనడం సాధువు.

      తొలగించండి
  32. కన్మరుగైరియాదవులకాంతలుకాంతులుసాధుసంతువుల్
    మన్మలుసూనులున్సతులుమానినులక్కలునన్నదమ్ములున్
    తన్మయమొక్కొదైన్యమిదిధాత్రినధర్మముహెచ్చుగల్కికిన్
    *"జన్మదినోత్సవమ్మును శ్మశానమునం జరుపంగ యుక్తమౌ"*


    (కృష్ణనిర్యాణమువివరించుచు అర్జునుడు ధర్మరాజుతో...)

    రిప్లయితొలగించండి
  33. సన్మానితులైరి సుతులు 
    మన్మోహను నిలయముందు మాతయె జరుపన్ 
    చిన్ముద్రాధిపు నిలయము
    జన్మదినమహోత్సవము శ్మశానమున తగున్ 

    రిప్లయితొలగించండి
  34. సన్మిత్రుని మెత్తు రతని
    జన్మదినంబును ఘనముగ జరిపెద రౌరా
    ఉన్మాదియె యను నిట్టుల
    జన్మదినమహోత్సవము శ్మశానమునఁ దగున్

    రిప్లయితొలగించండి


  35. మన్మథ జనకుండాదిగ
    సన్మతితో సల్పి రచట సంతోషముతో
    మన్మథహరువాసమ్మున
    జన్మదిన మహోత్సవము శ్మశానము న తగున్

    .
    .

    రిప్లయితొలగించండి