20, డిసెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3580

21-12-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్”

(లేదా…)

“కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై”

45 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మేలును గోరి హృత్తునకు మెండుగ శాంతికి కాపురమ్మునన్
    కాలము తీరగా కడకు కంపము నోర్వక యెల్లవేళలన్
    వీలును బట్టి చూచి కడు వేదన నిచ్చెడి యత్తగార్లకున్
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కూలగ భర్త చాకిరయొ కోవిడు నందున కోపమెచ్చగా
    మేలుగ లక్ష్మి పూజకిక మీరిన భక్తిని దుడ్డుకోసమై
    పూలను కోయుటన్ జనగ ముప్పును తెచ్చెడి తెనెటీగకున్
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై...

    రిప్లయితొలగించండి
  3. చాలికదంభాచారము
    ఫాలాక్షునికనులనిప్పుపడతులఁజేరెన్
    పాలుగఁజూడమిమగఁడును
    కాలునిదూతలెకనంగకాంతలుభువిలోన్

    రిప్లయితొలగించండి
  4. జాలిని వీడి బోడులు నమోఘ మమేయ విషాద గీతికన్
    బేలగ బాడు కొమ్మనుచు వేడుకగా విరిబాల ప్రాణముల్
    గ్రోలుదు రెంత కర్కశులు గొప్పున బంధి యొనర్చి, బూలకున్
    *“కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై”*

    రిప్లయితొలగించండి

  5. బోనసు సరదా పూరణ:

    "She Teams" in Bhagyanagar:

    మూలల దాగి వీధులను పోలిసు టీముల హైద్రబాదునన్...
    వీలును జూచి లేమలను వెంబడి జేరుచు కేకలేయుచున్
    తూలుచు వచ్చి మందుగొని దూకుచు పైబడు పోటుగాళ్ళకున్
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై...

    రిప్లయితొలగించండి
  6. ఆలినిదాసిగాఁదలచియాదరమింతయుచూపకేతనున్
    గేలినిసేయుచున్తనదుగేహమునందునబాధపెట్టగా
    శూలికిగూడఁదప్పదుగసూదులపోటులుదేహమంతటన్
    కాలునిదూతలౌదురనగన్దగుకాంతలనెల్లధాత్రిపై

    రిప్లయితొలగించండి
  7. బాలిక లర్థ వంతులయి భర్తకు తోడుగ నీడగా శివా
    శూలిగ వాక్కునర్ధమన శోభ నొసంగుచు మెట్టినింటికిన్
    మేలును బుట్టినింటికి నమేయ యశస్సిడు నంచు నెంచగా
    గూళగ మారి కాపురము గూల్చెడు కోడలు కోడలెంచగా
    *“గాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై”*

    రిప్లయితొలగించండి
  8. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

    కాలము మారెను జూడఁగ

    వీలుగ,సీరియలు లందు,పేరు వినంగన్

    జాలును "అత్తాకోడలు"

    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలో

    మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

    రిప్లయితొలగించండి
  9. కందం
    తాళమ్ము వైచ మాటకు
    నాలయముగ దీర్చు నిల్లు నామెయె వెలుగై
    తాళిని హేళన జేసిన
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్

    ఉత్పలమాల
    తాళము వైచి భేషనుచు దారకు కోరినదెల్ల నీయ తా
    నాలయమన్నటుల్ గృహము నందరు మెచ్చఁగ దీర్చు దీపమై
    హేళన జేసి తాళినట నింటికి మిత్రుల దెచ్చి త్రాగినన్
    గాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

     

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      శీలము గల్గు వర్తనుల శీఘ్రమె బ్రోచి శివమ్ముఁ గూర్చుచున్
      తాళఁగ లేని దుష్టులను దగ్దము జేయు లయాధికారిగన్
      శూళి! శుభాశుభమ్ముల ప్రచోదిత మౌచును సృష్టినిన్ మహా
      కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై!

      తొలగించండి
  10. ఆలియు తనమాతయు గ
    య్యాళులు, గృహమందున కలహములాడగ నా
    గోలకు విసిగిన వాడనె
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్

    రిప్లయితొలగించండి
  11. మాలిమి సంతును దిద్దిచు
    చాలిక సంసారమీద చక్కని నావౌ
    తేలికగా బల్క దగునె
    కాలుని దూతలు గనంగ గాంతలు భువిలో?

    కూలగ కాపురమ్ములవి కూలిగ దెచ్చిన కాసులన్నియున్
    పాలకులమ్ము చౌకధర వారుణి యందున జెల్లబెట్టుచున్
    బ్రేలుచు నిచ్చవచ్చినటు పెచ్చుగ దన్నెడు భర్తలున్నచో
    కాలుని దూతలౌదు రనగన్ దగు కాంతలనెల్ల ధాత్రిపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేలిమి పైడిబొమ్మయటు మెల్తుక దోచగ కామమోహులై
      శీలవతీ లలామల నిసిగ్గుగ గోరెడు
      వారిపాలిటన్
      కాలుని దూతలౌదు రనగన్ దగు కాంతలనెల్ల ,ధాత్రిపై
      పాలకులెందరో పరులభామల గోరి నశించ గానమే!

      తొలగించండి
  12. ఆలియు తల్లియున్ గన గయాళులు వారి యభిక్రమమ్ముతో
    మాళిగ మారె పంచకపు మాదిరటంచును పల్కె నంటుతో
    జాలిగ నొక్క పూరుషుడు సన్నిహితుండని యెంచి యిట్టులన్
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    She teams:

    ఈలల వేయుచున్చెలగి యింతుల పైబడు దున్నపోతులన్
    బేలల పెళ్ళిజేసికొని వెట్టిగ కట్నము లాగువారినిన్
    దూలను దీర్చగాచెలగి ధూర్తుల పట్టుకు శిక్షలేయగా
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై.

    రిప్లయితొలగించండి
  14. ఏలా? యిటులనదగునా
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్
    మేలౌ వ్రతములు జేయుచు
    మేలుగ గొలువంగ నెంచ మేదిన గనరే!

    రిప్లయితొలగించండి
  15. మేలము లాడుచు భర్తల
    తాలిమి విడనాడి మెలగి తాటకుల వలెన్
    జాలిని సుంతయు జూపని
    కాలుని దూతలె కనంగ కాంతలు భువిలోన్

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాలయమంతయు మధువును
    గ్రోలుచు మత్తున దిరుగుచు రోతగు నడతన్
    ఆలిని నిరసించెడి వడి
    కాలుని దూతలు గనంగ గాంతలు భువిలో.

    రిప్లయితొలగించండి
  17. కాలుని దూతలను విడిచి
    చాలిక కాపుర మిటంచు సతులన్ వెళ్ళెన్
    జాలిగ కనుగొన పతులగు
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వాలయమంత మద్యమును పానము జేయుచు చెడ్డ వర్తనన్
    గోలగ దిర్గుచున్ వెడగు కూతలు కూయుచు దీర్ఘమత్తులో
    నాలిని హింసబెట్టుచు ననాదృతమున్ తిరివెట్టినప్పుడున్
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై.

    రిప్లయితొలగించండి
  19. ప్రస్తుత TV సీరియల్స్ అనుకరణగా ఈ నా ప్రయత్నము:

    ఉ:

    బేలనరాదు నెప్పటికి భీతిలి నంతన సుందరాంగులన్
    కీడొనరింప జూతురట కీచకుడంచని నంగనాచిగన్
    కాలము నెంచి నిల్తురట కాటికి నంపగ పంతమాడగన్
    కాలును దూత లౌదురనగన్ దగు గాంతల నెల్ల ధాత్రిపై

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  20. గాలి సుతుని జీవనమును
    బోలునటుల గడుపుచుండు పురుషుల లోనన్
    మేలు గలిగించు బువ్విలు
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్

    రిప్లయితొలగించండి
  21. ఈరోజు పూరింపవలసిన సమస్య

    *“కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్”*
    (లేదా…)
    *“కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై”*

    నా పూరణ

    కందము

    యిలలో పలువురు భార్యల
    పలుకుల నెవరైన నాడ పరవశ మతులై,
    యలుకలఁ జిటపట లాడుచు
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలో

    ఉత్పలమాల

    కూలగ కాపురమ్ములిలఁ గుట్రలు బన్నుచు మోసగించుచున్
    జైలులఁబెట్టుచున్ బతుకు సర్వము నాశముఁ
    జేయఁబూనుచున్
    నాలుక వెక్కిరించు ప్రతినాయికలం గన సీరియళ్ళలో
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  22. సమస్య :

    కాలుని దూత లౌదురన
    గన్ దగు గాంతల నెల్ల ధాత్రిపై

    ( కీచకుని మృతశరీరాన్ని చూసి అతని తమ్ములైన ఉపకీచకుల భావన )

    మేలగు వీరునిన్ ; మనల
    మించెడి ప్రేమను గాంచు నగ్రజున్ ;
    వాలగు చూపులన్ గనుచు ;
    మాలిని వెన్కనె ద్రిప్పుకొంచు ; నీ
    లీలగ జంపజేసినది ;
    లెండిక దీనిని గాల్చివైవగా ;
    గాలుని దూతలౌదు రన
    గన్ దగు గాంతల నెల్ల ధాత్రిపై .

    (మాలిని - అజ్ఞాతవాససమయంలో ద్రౌపది పేరు )

    రిప్లయితొలగించండి


  23. అయ్యయ్యో అయ్యరు గారి జేబులో డబ్బులు పోయెనే :)


    మాలు" ల లో దస్కము నవ
    లీలగ వెచ్చించి కార్డు లెల్లెడ స్వయిపింగ్
    లో లెస్సగా ఝుళిపి భళి
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. పూలను గోల లట్లు గొని బూన్చిన వానికి దూతలై తగన్
      జోలలఁ బాడు తల్లులయి చొప్పడు చర్చల నొప్పు మంత్రులై
      శీలముఁ దోచఁ జిచ్చుమియు జెచ్చర కాళికలై భయావహ
      త్కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  25. కాలము మారిపోయె మమకారము డిగ్గెను నేడు ధాత్రిపై
    చేలములంచు సొమ్ములని చేడియ లీశుని బాధపెట్టుచున్
    వేలకువేలు రూప్యముల వెచ్చము చేయుచు నెంచి చూడగా
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    రిప్లయితొలగించండి
  26. మైలవరపు వారి పూరణ

    బాలుని వెన్క గట్టి కరవాలము బట్టిన ఝాన్సిలక్ష్మి మా
    స్త్రీలకు రాణి., రుద్రమయు స్త్రీమణి., నాగమ కాంత కాదె., క...
    ల్లోలమొనర్చి వైరులను ద్రుంచగ కాళికలైరి, పోరునన్
    కాలుని దూతలౌదురునగన్ దగు గాంతల నెల్ల ధాత్రిపై!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  27. రెండవపాదంలో యతి తప్పింది .
    " మాలిని చూపులన్ బరపి ;
    మాయగ వెన్కనె ద్రిప్పుకొంచు " అని చదువ
    గలరు .

    రిప్లయితొలగించండి
  28. పాలన చేతనున్నదని పాశవికంబుగ రాజధానికై
    మేలగు భూములిచ్చినను మిక్కిలి నీచపు దూషణంబులన్
    పేలుచునున్న నాయకుల పీచమణంచగ వచ్చియుండగా
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    రిప్లయితొలగించండి
  29. మూలముసృష్టికి కాంతలు
    గోలలువెట్టగనువారు కుపితులరగుచున్
    మేలములాడిటుపాడియె
    కాలునిదూతలెకనంగ గాంతలుభువీలోన్

    రిప్లయితొలగించండి

  30. పూలను బెట్టకే జడల ముద్దులు గొల్పుచు మత్స్యగంధులై
    నాలుగు ప్రక్కలన్ గనుచు నల్లని కన్నుల వంగకన్యలే
    కూలిచి వేయుచున్ జనుల కొద్దిగ నవ్వుచు పూలవిల్లుతో
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై...

    రిప్లయితొలగించండి
  31. మేలము లాడుట తగదయ ఆలికి భర్తయె కన యుసురగునని యనరే పేలు చవమాన పరచిన
    కాలుని దూతలె కనంగ కాంతలు భువిలోన్

    రిప్లయితొలగించండి
  32. ఒక చిరుద్యోగి ఆత్మ ఘోష:
    వేలమువెర్రిగ నగలకు
    వేలకొలది రూప్యములను వెచ్చింతురహో
    చాలదు నెలసరి జీతము
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్

    రిప్లయితొలగించండి
  33. కాలము మారిపోయె సహకారము నియ్య గృహమ్ము భర్త కా
    ర్యాలయమందుచేరి కడునద్భుటరీతిని చెంగలించుచున్
    పాలను బిడ్డకిచ్చి మురిపాలను పంచుచు భర్త కెప్పుడున్
    శీలముదోచ బోయినను చెచ్చెర కాళికలై చరించుచున్
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    రిప్లయితొలగించండి
  34. వేలము వెర్రిగా నగలు వేమరు చీరలకై ధనమ్మునున్
    జాలిని చూపకించుకయు చాలవిధంబుల ఖర్చు జేయకే
    కూలును కొంపలంచు పతి గోలనువెట్టుచు పల్కె నివ్విధిన్
    కాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    రిప్లయితొలగించండి
  35. మాలా సద్భూషిత సువి
    శాలాక్షులు దేవతా నిచయ సన్నిభలే
    చాలిఁకఁ బరిహాసమ్ములు
    కాలుని దూతలె?కనంగఁ గాంతలు భువిలోన్


    కాల కుఠార తాడన విఖండిత విస్తృత మూల ధిఙ్మహా
    సాల తరూత్త మాభముగఁ జావఁగఁ గాంచమె దుష్ట ఘోర దై
    త్యాలిని మున్నుభూమిపయి నన్య సతీమణు లైన వారినిం
    గాలుని దూతలౌదు రనఁగన్ దగుఁ గాంతల నెల్ల ధాత్రిపై

    రిప్లయితొలగించండి
  36. బేలని తలచుట తగదిక
    కాలము మారినదిజూడక మెలగ ముప్పే
    హేలగ కాలును దువ్విరి
    కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదం సవరించి🙏

      కాలము మారెనదిజూడక మెలగ ముప్పౌ

      తొలగించండి
    2. ఈ లోకమందు నరకము
      నాలియె సొంపుగ నివాసమందే జూపన్
      గోలగ మారెను మనుగడ
      కాలుని దూతలె కనంగఁ గాంతలు భువిలోన్

      తొలగించండి
  37. చాలనిజీతముంగలిగి సంధ్యనునిత్యము ద్రాగువారికిన్
    కాలునిదూతలౌదు రనంగన్దగుగాంతననెల్లధాత్రిపై
    పాలనునీరునుంగలియ పాలనువోలెను నుండునట్లుగా
    నాలునుభర్తయున్ నిరతమాహరి,కీరమువోలెనుంటనౌ

    రిప్లయితొలగించండి
  38. జాలిని వీడుచు కొందరు
    కోలను గొట్టగ సతులను కూరిమి లేకన్
    పోలీసులుగా వచ్చిన
    కాలుని దూతలెకనంగకాంతలు భువిలో

    రిప్లయితొలగించండి