15-12-2020 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము”
(లేదా…)
“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:కూలగ మైత్రి హృత్తునను కొండొక పూర్వపు మిత్రుడే వడిన్మేలుగ జేరియాదటను మిక్కిలి వేగమె శత్రులందునన్కాలుని వేషమున్ గొనుచు కమ్మని మాటల మభ్యపెట్టుచున్ మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)కాలము మారిపోవగను కమ్మని చోరుల మైత్రివీడుచున్కేలున బట్టి సంకెలను కిక్కురు మన్కనె వెంబడించుచున్పోలిసునందు జేరగను పొంకము మీరగ వృత్తి మార్పగన్ మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మంచి మిత్రులు' సినిమాను గుర్తుకు తెచ్చారు.
కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో... తేటగీతిపుత్రు నభిమన్యుఁ జంపిన ముఖ్యుఁడైనకర్ణుని రధమ్ము క్రుంగెను గాంచుమయ్యరయమె బాణమ్ము సంధించి రాజరాజుమేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుముఉత్పలమాలఆలము నందు నీ సుతుని నంతము జేసిన వారినొక్కడైతేలెను నేడు యుద్ధమున. ,తేరది భూమిని గ్రుంగి చిక్కె నీపాలిట యర్జునా! కనుము భాస్కర సూనుఁడు రాజరాజుకున్మేలును గోరి వచ్చెనట మిత్రుడు! వానిని జంపఁగాఁ దగున్!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు."నీ పాలిట నర్జునా!" అని ఉండాలి.
_/\_ధన్యోస్మి గురుదేవా_/\_సవరించిన పూరణ:ఉత్పలమాలఆలము నందు నీ సుతుని నంతము జేసిన వారినొక్కడైతేలెను నేడు యుద్ధమున. ,తేరది భూమిని గ్రుంగి చిక్కె నీపాలిట నర్జునా! కనుము భాస్కర సూనుఁడు రాజరాజుకున్మేలును గోరి వచ్చెనట మిత్రుడు! వానిని జంపఁగాఁ దగున్!!
*విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా* ***** ****** ****** ***** *** **** ** పరసతిని పట్టి బంధింప భావ్య మదియు కాదటంచు హితువు చెప్పె కపి వరుండు మేలు కోరిన హితుని ప్రాణాలు గొనుమ టంచు నాజ్ఞనిచ్చుట తగదంటి భ్రాత.
స్నేహ మునువీడి వైరితో చేయి కలుపకక్ష గట్టిన వానినే కారణమునవిడువదగునేల నొకనాటి విమలమతినిమేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము!!
బోనసు సరదా పూరణ:(బహుశః) రాష్ట్రీయ స్వయంసేవక సంఘపు మనోగతము (1947):కూలగ భారతావనియె కుత్సిత మయ్యెడి కుట్రపన్నుచున్తేలికగాను రేఖనిడి తీర్చగ కోరిక పాకి జిన్నకున్వీలుగ నెహ్రుకాదటను వెంటనె వెంటనె మౌంటుబాటెనై మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...
మీ బోనసు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ప్రాణ మిత్రుడు వ్రణముతో బాధ బడగ, వ్యాధి కేమందు లేదనే వైద్యు లంత బాధ పడలేను మిత్రమా! వాంఛదీర్చు మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు."మందు లేదన వైద్యులంత" అనండి.
రక్షణ నొసగ దగు గాచి రాధనముగమేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుముకీడు సేయతలచినచో కింకరుడినినీతి సూత్రమిదె జిలేబి నీటుగాను !జిలేబి
సంధిసేయంగయల్లుడుసమతనెంచికుటిలమతియయ్యెనాగమ్మగూఢబుద్ధిమంచిచెడులనుఁజూడకనానతిచ్చెమేలుఁగోరినహితునిప్రాణాలఁగోనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...సేయంగ నల్లుడు... జూడక యానతిచ్చె..." అనండి.
సరిజేసుకుంటాను
"కనలించితివే బింబానన! మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్? నీతినివీ డితివే నెలతుక!" తిట్టెను హితుడే!జిలేబి
*విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా* ***** ****** ****** ***** *** **** ** బాలిశుడేమి కాదిటకు వచ్చిన వానరు డెవ్వడో యనన్ గాలితనూజుడే కద సుగాత్రిని రాముని జేర్చకున్న నీ యాళి వినాశమౌననుచు నానిలియే వచియించె గాదుటే మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
వీలునుచాలులేకకపటవేషమునెంచుచువావిదప్పుచున్పాలునుమాకునిమ్మనెనుపాండునిసూనుడుబావనంపుచున్ఆలముసేయఁబోమునికయాతనిదౌష్ట్యమురాయబారిగామేలునుగోరివచ్చెనటమిత్రుడువానినిఁజంపగాఁదగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో గణభంగం. "...సేయబో మికను నాతని..." అనండి.
చాలులేకనట
గేలిని జేయగా సభను కిన్కను బూనుచు రక్షకుండుగామేలునుగోరి వచ్చెనట మిత్రుడు, వానిని జంపగాదగున్మేలును జేసినట్టియెడ మేరలు దాటిన దుష్టభావమున్దూలగనాడుచున్ దిరిగి దోషము మోపగ ఛేదిపాలుడై
కేలును జాచుచున్ దిశల కృష్ణుని ఛాయను విస్తరించుచున్చాలిక చోరులన్ బనుల జక్కగబెట్టగప్రోత్సహించుచున్ కాలునిరూపుగా రజని కాటును వేసెడిజీవజాళికిన్మేలునుగోరి వచ్చెనట, మిత్రుడు వానిని జంపగా దగున్ మిత్రుడు = సూర్యుడు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
ఉ:కాలము చెల్లు పెట్టుబడి గంపెడు నాసల గూర్చనంచనన్మూలము తానెయై సకల భూమము నంతయు కొల్లగొట్టగన్కీలెఱు గంగ వాతలను క్లేశము దీర విధింప ద్వేషమున్మేలును గోరి వచ్చెనట! మిత్రుడు వానిని జంపగాదగున్వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
రాజకీయము నందు స్థిరమగు హితులుగాని వైరి గాని మనుట గానమెపుడుసుంత లోనె మనదరికి సూడుకానిమేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము!నిధియు దొరుకునునడవిన నీకు నేడుమంచి జరుగని జెప్పెనే, వంచకుడగుమారు వేషదారి విరోధి మర్మముగను
అర్థశాస్త్రమునాసక్తి నభ్యసించగురువు కౌటిల్యు విశదించె గుప్తనీతిపాము నీడన మసలుటె పాడి, వైరి మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుముఅయ్యొ! నీ రీతి పాఠము ఒప్పుగాదుఎందుకని చెలికానిని చంపవలయుమంచి విశదించి సరితోవ నుంచదలచనేరమెట్లౌనునదియెంతొ గౌరవమ్ము
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. "కౌటిల్యుడు దెలిపె..""అయ్యొ యీరీతి పాఠము లొప్పు గావు.."
సవరించి 🙏అర్థశాస్త్రమునాసక్తి నభ్యసించగురువు కౌటిల్యుడు తెలిపె కుటిల నీతిపాము నీడన మసలుటె పాడి, వైరి మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము🙏 ధన్యవాదాలు
సమస్య :-“మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము”*తే.గీ**శివుని నామము తలవని చిన్న వానిప్రాణములు తీయగ మనసు బాధ జెందెనిజము జెప్పిన ప్రహ్లాదుని తన తండ్రిమేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము ..................✍️చక్రి(సైనికాధికారి భటునితో....)
సమస్య :మేలును గోరి వచ్చెనట మిత్రుడు వానిని జంపగా దగున్ (నలగామరాజు అల్లుడైన అలరాజు మలిదేవ రాజు పక్షాన సంధికోసం వస్తే నాయకురాలు నాగమ్మ నరసింగరాజుతో )ఉత్పలమాల ..................కాలము దాపురించినది గా యలరాజుకు దూత కిప్పుడున్ ;దేలిక నల్లు నగ్రజుడు త్రెంచుకొనం ; డిక సంధి యైనచో నేలిక కాగలండతడు ;నీ కిక దప్పదు కాశికేగుటల్ ;మేలును గోరి వచ్చెనట మిత్రుడు ; వానిని జంపగా దగున్ .
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.సమస్యను ఇస్తున్నపుడు నాకు ఈ ఘట్టమే మనసులో మెదిలింది.
మరచి పోరాద దెన్నడు మంచి గోరి మేలు గోరిన హితుని : ప్రాణాలు గొనుము మిత్రుని వలె నటియించుచు శత్రు వౌచు హానిని తల పెట్టెడు వాని నందు రిలను
చివరి పాదంలో చివర నదను జూచి అని సవరణ చేయడ మైనది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదంలో గణభంగం. "మిత్రుని వలె నటించుచు.." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కర్ణుడు దుర్యోధనునితో..మేలము లాటలా! సుతసమేతముఁ గూల్చగ వచ్చె శౌరి యైదూళుల నిమ్ముటంచనియె ద్రోహసమంచితబుద్ధిపూర్ణుడైవ్యాలఫణాంతభీకరమహద్విషకుంభపయోముఖమ్మునైమేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు! వానినిఁ జంపఁగాఁ దగున్కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. "ఇమ్మటంచు..." టైపాటు.
కాలుని రూపమై ప్రజల కారడి బెట్టగ శాస్త్రసమ్మతంబాలన పాలనార్హము నపార ధనంబు బలంబొసంగు పాపాలను మట్టుబెట్టుననె బాలిశు వంచన శత్రురాజికిన్*“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”*
కాలము నందునన్ దరిని కష్టము లందున స్నేహభావపున్దాలిమి జూపుచున్ మనికి దారుల వెల్గుల వెల్లువై జనన్నేలవచింతురీ పగిది -నిమ్ముగ క్లేశము బాపు మాన్యుడైమేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు - "వానినిఁ జంపఁగాఁ దగున్"?!
కురుపితామహుడాతఁడు కుమతికాదువచనబద్ధతఁ కాతండు వశ్యుడయ్యెయుద్ధనీతిని తలదాల్చి యుద్యమించిమేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మైలవరపు వారి పూరణ కాలము మించిపోయెనని కౌరవవర్గము హ్లాదమందగాగూలిన పార్థునిన్ బలికె గూరిమి కృష్ణుడు చూడుమర్జునా! లీలగ సైంధవున్ ., ముగియలేదు దినంబదె, మంచివారికిన్మేలొనరింపవచ్చెనఁట మిత్రుడు., వానిని జంపగా దగున్!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ.
కర్త నేనను భావమ్ము ఖలునికగునువిస్మరింపుము కర్తృత్వ విధిని నీవుధనువు నందుకొమ్ము విజయ! ధర్మమునకుమేలుగోరిన, హితుని ప్రాణాలు గొనుము!
ధన్యవాదములు గురువర్యా! 🙏🙏🙏
తిన్నయింటికి వాసముల్ లెక్కపెట్టిహాని చేయగ నెంచెడి వాని పనులువాసిగ గమనించుము వాడు వడిగ రిపుల*మేలు గోరినహితుని ప్రాణాల గొనుము.*మేలును కూర్చెదన్నిపుడు మీకని తీయని మాటలా డుచున్ కోలనుచేతబట్టుకొని కోరుచు నాశము వైరి కోర్కె పైమాలనుబట్టివచ్చెగను మానసమందున శత్రుమూ కకున్ *“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
కాలము దాపురించె కురు క్ష్మాస్థలి సంగరమందు కర్ణునిన్ కూలగజేయగా ధరను గొన్మిక కోలను వేయ బాణమున్ జాలము చేయనేలనిక చాలును లాలసతో సుయోధనున్ మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కురుక్ష్మాస్థలి' అన్నపుడు 'రు' గురువై గణభంగం. సవరించండి.
పాలను బోసి పెంచినను పాము విషమ్మును చిమ్మకుండునేబేలను హింస పెట్టి కడు భీకర రీతిని సంహరించె పాపాలఫలమ్మునన్ దొరికె పాలసుడో యధికారి చేతికిన్మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
ఱాతి నింకఁ జేత ధరించి భీతిచెందకించు కేని చిత్తమున భక్షించుఁ గొండచిలువ దాని వేగమ్మ, రక్షించ నెంచమేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుము ఫాలుని యాజ్ఞ తోడుత నవారితపాశధరోగ్ర చిత్తుఁడౌ కాలుని కెంచఁ గాక మఱి కాయము లిద్ధరఁ గూల్చ శక్యమే బాలక! యేరికైనఁ బొరపా టగు నివ్విధిఁ బల్క నెన్నఁడున్ మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
మేలుగోరిన హితుని ప్రాణాలుగొనుముకాళికాదేవి గుడియందుఖడ్గమెత్తి" బట్టి విక్రమార్కుని తలబట్టినరుక"!దేవి ప్రత్యక్ష మైవారి దీప్తి బెంచె!
ఒడిని చేర్చుకొ నుముప్రీతితోడనెపుడుమేలుగోరినహితుని,ప్రాణాలగొనుముకీడుజేసెడుదుర్మార్గు నొడిసిపట్టిబంధుడైనను నెవరైన వదలవలదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.
1.బ్రీతిబడయమదికి3.దుర్మార్గునోడజేయు
మేలునుగోరివచ్చెనటమిత్రుడు,వానినిజంపగాదగున్మేలములాడబూనుటనుమేదినిమానుము,మేలుజేయునాత!బాలసుడాతడేనిజముపర్వులువెట్టుచుబోవబోకుమాకాలమె చంపువానినిక గాచుటయెవ్వరిజేత గాదులే
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
కూలగ మైత్రి హృత్తునను కొండొక పూర్వపు మిత్రుడే వడిన్
మేలుగ జేరియాదటను మిక్కిలి వేగమె శత్రులందునన్
కాలుని వేషమున్ గొనుచు కమ్మని మాటల మభ్యపెట్టుచున్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
కాలము మారిపోవగను కమ్మని చోరుల మైత్రివీడుచున్
కేలున బట్టి సంకెలను కిక్కురు మన్కనె వెంబడించుచున్
పోలిసునందు జేరగను పొంకము మీరగ వృత్తి మార్పగన్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మంచి మిత్రులు' సినిమాను గుర్తుకు తెచ్చారు.
🙏
తొలగించండికురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో...
రిప్లయితొలగించండితేటగీతి
పుత్రు నభిమన్యుఁ జంపిన ముఖ్యుఁడైన
కర్ణుని రధమ్ము క్రుంగెను గాంచుమయ్య
రయమె బాణమ్ము సంధించి రాజరాజు
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
ఉత్పలమాల
ఆలము నందు నీ సుతుని నంతము జేసిన వారినొక్కడై
తేలెను నేడు యుద్ధమున. ,తేరది భూమిని గ్రుంగి చిక్కె నీ
పాలిట యర్జునా! కనుము భాస్కర సూనుఁడు రాజరాజుకున్
మేలును గోరి వచ్చెనట మిత్రుడు! వానిని జంపఁగాఁ దగున్!!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి"నీ పాలిట నర్జునా!" అని ఉండాలి.
_/\_ధన్యోస్మి గురుదేవా_/\_
తొలగించండిసవరించిన పూరణ:
ఉత్పలమాల
ఆలము నందు నీ సుతుని నంతము జేసిన వారినొక్కడై
తేలెను నేడు యుద్ధమున. ,తేరది భూమిని గ్రుంగి చిక్కె నీ
పాలిట నర్జునా! కనుము భాస్కర సూనుఁడు రాజరాజుకున్
మేలును గోరి వచ్చెనట మిత్రుడు! వానిని జంపఁగాఁ దగున్!!
*విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా*
రిప్లయితొలగించండి***** ****** ****** ***** *** **** **
పరసతిని పట్టి బంధింప భావ్య మదియు
కాదటంచు హితువు చెప్పె కపి వరుండు
మేలు కోరిన హితుని ప్రాణాలు గొనుమ
టంచు నాజ్ఞనిచ్చుట తగదంటి భ్రాత.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్నేహ మునువీడి వైరితో చేయి కలుప
రిప్లయితొలగించండికక్ష గట్టిన వానినే కారణమున
విడువదగునేల నొకనాటి విమలమతిని
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబోనసు సరదా పూరణ:
(బహుశః) రాష్ట్రీయ స్వయంసేవక సంఘపు మనోగతము (1947):
కూలగ భారతావనియె కుత్సిత మయ్యెడి కుట్రపన్నుచున్
తేలికగాను రేఖనిడి తీర్చగ కోరిక పాకి జిన్నకున్
వీలుగ నెహ్రుకాదటను వెంటనె వెంటనె మౌంటుబాటెనై
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...
మీ బోనసు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిప్రాణ మిత్రుడు వ్రణముతో బాధ బడగ,
రిప్లయితొలగించండివ్యాధి కేమందు లేదనే వైద్యు లంత
బాధ పడలేను మిత్రమా! వాంఛదీర్చు
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మందు లేదన వైద్యులంత" అనండి.
రిప్లయితొలగించండిరక్షణ నొసగ దగు గాచి రాధనముగ
మేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుము
కీడు సేయతలచినచో కింకరుడిని
నీతి సూత్రమిదె జిలేబి నీటుగాను !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంధిసేయంగయల్లుడుసమతనెంచి
రిప్లయితొలగించండికుటిలమతియయ్యెనాగమ్మగూఢబుద్ధి
మంచిచెడులనుఁజూడకనానతిచ్చె
మేలుఁగోరినహితునిప్రాణాలఁగోనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...సేయంగ నల్లుడు... జూడక యానతిచ్చె..." అనండి.
సరిజేసుకుంటాను
తొలగించండి
రిప్లయితొలగించండి"కనలించితివే బింబా
నన! మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వా
నినిఁ జంపఁగాఁ దగున్? నీ
తినివీ డితివే నెలతుక!" తిట్టెను హితుడే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా*
రిప్లయితొలగించండి***** ****** ****** ***** *** **** **
బాలిశుడేమి కాదిటకు వచ్చిన వానరు డెవ్వడో యనన్
గాలితనూజుడే కద సుగాత్రిని రాముని జేర్చకున్న నీ
యాళి వినాశమౌననుచు నానిలియే వచియించె గాదుటే
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీలునుచాలులేకకపటవేషమునెంచుచువావిదప్పుచున్
రిప్లయితొలగించండిపాలునుమాకునిమ్మనెనుపాండునిసూనుడుబావనంపుచున్
ఆలముసేయఁబోమునికయాతనిదౌష్ట్యమురాయబారిగా
మేలునుగోరివచ్చెనటమిత్రుడువానినిఁజంపగాఁదగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "...సేయబో మికను నాతని..." అనండి.
చాలులేకనట
రిప్లయితొలగించండిగేలిని జేయగా సభను కిన్కను బూనుచు రక్షకుండుగా
రిప్లయితొలగించండిమేలునుగోరి వచ్చెనట మిత్రుడు, వానిని జంపగాదగున్
మేలును జేసినట్టియెడ మేరలు దాటిన దుష్టభావమున్
దూలగనాడుచున్ దిరిగి దోషము మోపగ ఛేదిపాలుడై
కేలును జాచుచున్ దిశల కృష్ణుని ఛాయను విస్తరించుచున్
తొలగించండిచాలిక చోరులన్ బనుల జక్కగబెట్టగ
ప్రోత్సహించుచున్
కాలునిరూపుగా రజని కాటును వేసెడి
జీవజాళికిన్
మేలునుగోరి వచ్చెనట, మిత్రుడు వానిని జంపగా దగున్
మిత్రుడు = సూర్యుడు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిఉ:
రిప్లయితొలగించండికాలము చెల్లు పెట్టుబడి గంపెడు నాసల గూర్చనంచనన్
మూలము తానెయై సకల భూమము నంతయు కొల్లగొట్టగన్
కీలెఱు గంగ వాతలను క్లేశము దీర విధింప ద్వేషమున్
మేలును గోరి వచ్చెనట! మిత్రుడు వానిని జంపగాదగున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిరాజకీయము నందు స్థిరమగు హితులు
రిప్లయితొలగించండిగాని వైరి గాని మనుట గానమెపుడు
సుంత లోనె మనదరికి సూడుకాని
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము!
రిప్లయితొలగించండినిధియు దొరుకునునడవిన నీకు నేడు
మంచి జరుగని జెప్పెనే, వంచకుడగు
మారు వేషదారి విరోధి మర్మముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅర్థశాస్త్రమునాసక్తి నభ్యసించ
రిప్లయితొలగించండిగురువు కౌటిల్యు విశదించె గుప్తనీతి
పాము నీడన మసలుటె పాడి, వైరి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
తొలగించండిఅయ్యొ! నీ రీతి పాఠము ఒప్పుగాదు
ఎందుకని చెలికానిని చంపవలయు
మంచి విశదించి సరితోవ నుంచదలచ
నేరమెట్లౌనునదియెంతొ గౌరవమ్ము
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"కౌటిల్యుడు దెలిపె.."
"అయ్యొ యీరీతి పాఠము లొప్పు గావు.."
సవరించి 🙏
తొలగించండిఅర్థశాస్త్రమునాసక్తి నభ్యసించ
గురువు కౌటిల్యుడు తెలిపె కుటిల నీతి
పాము నీడన మసలుటె పాడి, వైరి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
🙏 ధన్యవాదాలు
సమస్య :-
రిప్లయితొలగించండి“మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము”
*తే.గీ**
శివుని నామము తలవని చిన్న వాని
ప్రాణములు తీయగ మనసు బాధ జెందె
నిజము జెప్పిన ప్రహ్లాదుని తన తండ్రి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
..................✍️చక్రి
(సైనికాధికారి భటునితో....)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిమేలును గోరి వచ్చెనట
మిత్రుడు వానిని జంపగా దగున్
(నలగామరాజు అల్లుడైన అలరాజు మలిదేవ
రాజు పక్షాన సంధికోసం వస్తే నాయకురాలు నాగమ్మ నరసింగరాజుతో )
ఉత్పలమాల
..................
కాలము దాపురించినది
గా యలరాజుకు దూత కిప్పుడున్ ;
దేలిక నల్లు నగ్రజుడు
త్రెంచుకొనం ; డిక సంధి యైనచో
నేలిక కాగలండతడు ;
నీ కిక దప్పదు కాశికేగుటల్ ;
మేలును గోరి వచ్చెనట
మిత్రుడు ; వానిని జంపగా దగున్ .
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్యను ఇస్తున్నపుడు నాకు ఈ ఘట్టమే మనసులో మెదిలింది.
మరచి పోరాద దెన్నడు మంచి గోరి
రిప్లయితొలగించండిమేలు గోరిన హితుని : ప్రాణాలు గొనుము
మిత్రుని వలె నటియించుచు శత్రు వౌచు
హానిని తల పెట్టెడు వాని నందు రిలను
చివరి పాదంలో చివర నదను జూచి అని సవరణ చేయడ మైనది
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "మిత్రుని వలె నటించుచు.." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికర్ణుడు దుర్యోధనునితో..
తొలగించండిమేలము లాటలా! సుతసమేతముఁ గూల్చగ వచ్చె శౌరి యై
దూళుల నిమ్ముటంచనియె ద్రోహసమంచితబుద్ధిపూర్ణుడై
వ్యాలఫణాంతభీకరమహద్విషకుంభపయోముఖమ్మునై
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు! వానినిఁ జంపఁగాఁ దగున్
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"ఇమ్మటంచు..." టైపాటు.
కాలుని రూపమై ప్రజల కారడి బెట్టగ శాస్త్రసమ్మతం
రిప్లయితొలగించండిబాలన పాలనార్హము నపార ధనంబు బలంబొసంగు పా
పాలను మట్టుబెట్టుననె బాలిశు వంచన శత్రురాజికిన్
*“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలము నందునన్ దరిని
రిప్లయితొలగించండికష్టము లందున స్నేహభావపున్
దాలిమి జూపుచున్ మనికి
దారుల వెల్గుల వెల్లువై జన
న్నేలవచింతురీ పగిది -
నిమ్ముగ క్లేశము బాపు మాన్యుడై
మేలును గోరి వచ్చెనఁట
మిత్రుఁడు - "వానినిఁ జంపఁగాఁ దగున్"?!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికురుపితామహుడాతఁడు కుమతికాదు
రిప్లయితొలగించండివచనబద్ధతఁ కాతండు వశ్యుడయ్యె
యుద్ధనీతిని తలదాల్చి యుద్యమించి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికాలము మించిపోయెనని కౌరవవర్గము హ్లాదమందగా
గూలిన పార్థునిన్ బలికె గూరిమి కృష్ణుడు చూడుమర్జునా!
లీలగ సైంధవున్ ., ముగియలేదు దినంబదె, మంచివారికిన్
మేలొనరింపవచ్చెనఁట మిత్రుడు., వానిని జంపగా దగున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ.
తొలగించండికర్త నేనను భావమ్ము ఖలునికగును
రిప్లయితొలగించండివిస్మరింపుము కర్తృత్వ విధిని నీవు
ధనువు నందుకొమ్ము విజయ! ధర్మమునకు
మేలుగోరిన, హితుని ప్రాణాలు గొనుము!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువర్యా! 🙏🙏🙏
తొలగించండితిన్నయింటికి వాసముల్ లెక్కపెట్టి
రిప్లయితొలగించండిహాని చేయగ నెంచెడి వాని పనులు
వాసిగ గమనించుము వాడు వడిగ రిపుల
*మేలు గోరినహితుని ప్రాణాల గొనుము.*
మేలును కూర్చెదన్నిపుడు మీకని తీయని మాటలా డుచున్
కోలనుచేతబట్టుకొని కోరుచు నాశము వైరి కోర్కె పై
మాలనుబట్టివచ్చెగను మానసమందున శత్రుమూ కకున్
*“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
కాలము దాపురించె కురు క్ష్మాస్థలి సంగరమందు కర్ణునిన్
రిప్లయితొలగించండికూలగజేయగా ధరను గొన్మిక కోలను వేయ బాణమున్
జాలము చేయనేలనిక చాలును లాలసతో సుయోధనున్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కురుక్ష్మాస్థలి' అన్నపుడు 'రు' గురువై గణభంగం. సవరించండి.
పాలను బోసి పెంచినను పాము విషమ్మును చిమ్మకుండునే
రిప్లయితొలగించండిబేలను హింస పెట్టి కడు భీకర రీతిని సంహరించె పా
పాలఫలమ్మునన్ దొరికె పాలసుడో యధికారి చేతికిన్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఱాతి నింకఁ జేత ధరించి భీతిచెంద
రిప్లయితొలగించండికించు కేని చిత్తమున భక్షించుఁ గొండ
చిలువ దాని వేగమ్మ, రక్షించ నెంచ
మేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుము
ఫాలుని యాజ్ఞ తోడుత నవారితపాశధరోగ్ర చిత్తుఁడౌ
కాలుని కెంచఁ గాక మఱి కాయము లిద్ధరఁ గూల్చ శక్యమే
బాలక! యేరికైనఁ బొరపా టగు నివ్విధిఁ బల్క నెన్నఁడున్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమేలుగోరిన హితుని ప్రాణాలుగొనుము
రిప్లయితొలగించండికాళికాదేవి గుడియందుఖడ్గమెత్తి
" బట్టి విక్రమార్కుని తలబట్టినరుక"!
దేవి ప్రత్యక్ష మైవారి దీప్తి బెంచె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒడిని చేర్చుకొ నుముప్రీతితోడనెపుడు
రిప్లయితొలగించండిమేలుగోరినహితుని,ప్రాణాలగొనుము
కీడుజేసెడుదుర్మార్గు నొడిసిపట్టి
బంధుడైనను నెవరైన వదలవలదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.
1.బ్రీతిబడయమదికి
తొలగించండి3.దుర్మార్గునోడజేయు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమేలునుగోరివచ్చెనటమిత్రుడు,వానినిజంపగాదగున్
రిప్లయితొలగించండిమేలములాడబూనుటనుమేదినిమానుము,మేలుజేయునాత!బాలసుడాతడేనిజముపర్వులువెట్టుచుబోవబోకుమా
కాలమె చంపువానినిక గాచుటయెవ్వరిజేత గాదులే