4-12-2020 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్”
(లేదా…)
“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:దినమును రాత్రినిన్ తనరి దిక్కులు తోచక గాలివాననున్ఘనముగ నుర్ములున్ పడుచు కన్నులు మూయు తటిత్తులందునన్కనగను మబ్బులాదటను క్రమ్మగ నేడిట హైద్రబాదునన్ దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
సూర్యుడు సౌరకుటుంబం ఆవిర్భవించగా కాంతులను జిమ్మి "పెనుచిమ్మచీకటిని మాపాడు"చ||ఘనతరభాస్వరాగమనకాంతుల సౌరకుటుంబమంతయున్జననము బొందగా వెలిగె సంభవమున్ జమమెల్ల జూడ భావనగలుగంగ మాపెనని పారగజేయుచు కాంతి మాపెగాదినకరుడుద్భవించి నలుదిక్కులనిం, 'పెనుచిమ్మచీకటిన్'రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'దిక్కులనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. ఒకవేళ సాధువనుకున్నా తరువాత సరళాదేశం వచ్చి 'బెను..' అవుతుంది.
అందరికీ నమస్సులు🙏నా పూరణ ప్రయత్నం..(కార్గిల్ యుద్దములో ప్రాణాలొడ్డిన వీర సైనికుని ఉద్దేశించి)*కం||*వెనుదిరగక తానెప్పడుఘనముగ సరిహద్దునందు కార్గిల్ రణమున్మనలను కాపాడి చితిన*“దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్”**కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'చితిని' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పటి సన్నివేశంకం.తనతమ్ముని స్థితి నెరిగియుదినకరుఁ డుదయించి దెసలఁ,దిమిరము నింపెన్మనమున రాముని, నప్పుడుహనుమంతుడు నగముతోడ నగుపడె నభమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నభమున్' బదులు 'దివిపై' అనండి.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)వినకయె నాదు మాటలను ప్రీతిని సూనుడు కోడలమ్మయోపనుపగ హైద్రబాదునను పండుగ పూటను మొండిజేయుచున్ కనులకు కప్పగా నలుపు గ్లాసులు సర్జరి కాటరాక్టునన్ దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: ఘనముగ నాకసమందున మినమినలాడుచు వెలుగును మీఱు యుడుపులన్ కనుమరుగు నొనర్చుచు తా దినకరుడుదయించి దెసల తిమిరము నింపెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మీఱు నుడుపులన్' అనండి.
సని నిడెను భువనమందున్దినకరుడుదయించి , దెసల తిమిరము నింపెన్యిను డస్తమించి యమవశదినమున సాయంత్రమందు తిప్పలనడుమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సూచించిన సవరణను వాట్సపులో చూడండి.
మనుగడగడగడవణకెనుపెనుముప్పుగగాలివానఫెళ్లునవిరిసెన్కనగామబ్బుగ్రమ్మెనుదినకరుడుదయంచిదెసలతిమిరమునింపెన్
కనగామబ్బులుగ్రమ్మెను
చంపకమాల:++++++++++++++ఘనమగు దేశద్రిమ్మరిగ,గారడిజేయుచు మానవాళికైశనిగను దాపురించెనిట,శారదరాత్రులు గూడ లేవనెన్దినమునరాత్రియైన, నొక దిక్కును దోచక వైరసుండగాదినకరుడుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటుల్
సమస్య దినకరు డుద్భవించి నలు దిక్కుల నింపెను చిమ్మచీకటిన్ (శ్రీకృష్ణనిర్యాణవార్తను ధర్మరాజుకు విన్నవిస్తున్న అర్జునుడు )ఘనముగ నగ్రజా ! మనకు ఖ్యాతిని రాజ్యము నందజేసెనే !యనయము దుష్టశిక్షణకు నంతయు శక్తిని ధారవోసెనే !మనసుల నిండియున్న మన మాధవమూర్తియె యస్తమించగా దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్ .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మనసు' సాధువు కాదంటారు. "మనముల నిండి..." అనండి.
కందంమునివరుఁడొసగిన వరమునమనువుకు మునుపె తరణికి కొమరుని గనియు భీతిని నదిని వదల మగువకుదినకరుఁ డుదయించి దెసలఁ తిమిరము నింపెన్చంపకమాలమునిగొని కుంతి సేవలను, పుత్రునొసంగగ నిష్టదైవముల్,దనరుచు మంత్రమౌ వరము రంజిల నీయ పరీక్ష సేయఁగన్మనమునఁ దల్చి మంత్రము కుమారిగ భీతిల కర్ణమందునన్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మనమందిట్టుల దలచెన్దినకరు డుదయించి దెసల దిమిరము జంపెన్ కునుకుచు నిట్టుల బల్కెన్దినకరు డుదయించి దెసల దిమిరము నింపెన్ పనిగొని రాక్షసాధముల భారము బాపగ ద్వాపరంబునన్ఘన చెఱసాలయందునను కంసునిజంపెడు నష్టసూనుడైకునుకగ ద్వారపాలకులు గోపకులంబున వాసుదేవుడన్దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
అర్ధరాత్రి కృష్ణజననం! 🙏🙏
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
ఇనుడట క్రుంగినంత భువి నిర్లవి చేరగ లోకులెల్లరుల్ పనులను మానిరప్పుడు, ద్విపాత్తులు కోరగ దివ్య కాంతులన్ దినకరు డుద్భవించి నలు దిక్కులనింపె, చిమ్మ చీకటిన్ దునిమి, కృషీవలుల్ పుడమి దున్నగ సాగిరి కూటకమ్ముతో.
క్రొవ్విడి వెంకట రాజారావు: సనియె పొదగొనెను నభమున దినకరుడుదయించి; దెసల తిమిరము నింపెన్ మినమినలాడెడి చంద్రుడు తన మినుకది నమవసమున తగ్గిన వేళన్.
మునిసిపలెన్నిక లందునతన గెలుపిక తథ్యమంచు దంభము లాడెన్తన కలలు తారుమారయెదినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్.
అందరికీ నమస్సులు🙏ఘనముగ తూర్పునన్ తరణి కాంతులు జిమ్ముచు భాసురంబుగన్మనమున జింతలన్ జెరిపి మైత్రిని జూపుచు మేలుకొల్పగానినకుని మ్రింగ దుష్టమది నీసుగ రాహువుపక్రమించగన్*“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”**వాణిశ్రీ నైనాల, విజయవాడ*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఇనకుని' ?
ఘనముగ నోట్లను పొందిన జన హృద యము గెల్చి నట్టి సజ్జను డతడే మనిగెను గెలిచిన నాడే దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
బోనసు సరదా పూరణ: తినగను దోసెలున్ వడలు తియ్యని లడ్డుల, నర్ధరాత్రినిన్ మనమును తన్వునున్ మరువ మందపు దుప్పటి లాగి కప్పుచున్ ఘనమగు హైద్రబాదునహ కన్నులు మూయగ;...క్యాలిఫోర్నియన్ దినకరుఁ డుద్భవించి;...నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...
క్రొవ్విడి వెంకట రాజారావు: ఘనముగ నాకసమ్మున ప్రకాశముతో దిశలెల్ల నెక్కొనెన్ దినకరుడుద్భవించి; నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్ మినమినలాడు రేమగడు మించును జాఱ్చు నమాసమందునన్ తనకళ రూపుమాయువడి తానుగ రిక్కలగూడి పోవుచున్.
మనదేశమున రివాజుగదినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్ఘనమౌ గ్రహణము పట్టగ ,దినమో ఱేయో దెలియని తీరుగ నుండన్
(ఎన్నికల మరుసటి రోజున కాంగ్రెసు పరిస్థితి)మనదే రాజ్యము తలపగతనయుడు రాహులు జనులకు తలుచును మేలేఘనముగ తెల్పెను సోనియదినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
అనఘా! పోగొట్టెనయాదినకరుఁ డుదయించి, దెసలఁ దిమిరము, నింపెన్కనుల మిరిమిట్లు గొల్పుచువినువీధిని వెలుతురున్ పవిత్రత తోడైభార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ యిచ్చెను :)ఈ వాక్యములో ఏడుస్తున్నదెవరు ?జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.భార్య - ఏడుస్తూ కూర్చున్న భర్తకు...భార్య ఏడుస్తూ - కూర్చున్న భర్తకు...అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నదానికి ఈ ప్రశ్న చక్కని ఉదాహరణ.
కందా చంప్స్ :)అనఘా ప్రకాశమున్ క్రన్నన దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను, చిమ్మచీఁకటిన్ ద్రోలి నూతనత్వమును నింపి లెస్సగ సుదతీ!జిలేబి
ఘనుడనఘుండుదైత్యకులకైరవబంధువుబుట్టెతారజీవనకశిపాత్మజుండుద్రిదివౌకసకోటికిహ్లాదిహ్లాదుడా*“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*మనముననానరద్విషునాధిపునంతముతథ్యమౌటచే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.చివరి పాదంలో గణభంగం. సవరించండి.
అనయము బంధుమిత్రులను నక్కునజేర్చ భయమ్ముఁ గూర్చె, నింటిని చెరసాలఁ జేసె, వికటించగ స్వాస్థ్యము వెజ్జు చూడ, డా దినసరికూలి కూలె నిల, తీవ్రరయప్రసరత్కరోనదుర్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్.దుర్దినకరుడు = దుర్దినమును చేయువాడు.కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అనితర సాధ్యుడున్ ఘనుడు యాదవ సూనుడు సర్వదక్షుడైపనిగొనె సైంధవున్ దునుమ పాండవ మధ్యమునాత్మ శాంతికైఘనమగు చక్రమున్ విసర గ్రక్కున సూర్యుని మూయ నంతలోదినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
అనవరతంబు నీ జగతి నంతట రోగము లీతి బాధలున్కనులను గాంచుచున్ కుమిలి కష్టములే సహవాసముండగన్దినమొక గండమై గడుపు దీనుని జీవనమున్ గనంగ నీదినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
అనుదినమునుపంచువెలుగుదినకరుడుదయించి,దెసలతిమిరము నింపెన్ మునిమాపునతా మునుగుచుజనులికవిశ్రాంతి పొందు సమయమటంచున్.
అనవరతము వ్యవధానముపనియన్ననుమేలు రేబవలు నొకటౌనామనుజులు దినమును మరచిరె దినకరుఁ డుదయించి దెసలఁ తిమిరము నింపెన్ !!(వర్క్ ఫ్రం హోం భాదితుల జీవనవిధానం)
మునుకొని పో ద్రోలె జగతి దిన కరు డుదయించి దెసల దిమిరము : నింపెన్ ఘనముగ మబ్బులు గ్రమ్మగ పెను చీకటు లావరించె పేర్మిగ నుర్విన్
ఘనమగు కాంతియె విరిసెను దినకరుడుదయించి దెసలఁ, దిమిరము నిండెన్ మినురతన మస్తమింపగ జనులు పడకటిల్లు జేరి శయనింతురికన్
ఘనమాంగ్లమ్ముని యెంచుచు తెనుగు జదవనట్టివాడు తిమిరమె యన్నన్ మినుకని తలచుచు పలికెను దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
ఘనుడగు పద్మనాభుదయ కల్గెను పుత్రుడటంచు ప్రేమతోమునుకొని పెంచ వాని కడుమోదముతోడుత, తల్లిదండ్రులన్వినయము వీడి దూరుచును వేదన పెట్టగ, తండ్రి పల్కె దుర్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్
అనయము గాంతిని నింపునుదినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్ దినకరుడేగిపడమరకుదినకరుడేమూలమార్య!దివికిన్భువికిన్
ఉ: ఘనమగు భారతావనిని గంపెడు నాశలు పల్లవించగన్ కనికర మింత లేక కడు కర్కశ రీతిని తూట పేల్చగన్పణముగ బెట్టె ప్రాణములు పాపము గాంధి తలంచ నివ్విధిన్దినకరుడుద్భవించి నలు దిక్కుల నింపెను చిమ్మ చీకటిన్వై.చంద్రశేఖర్
కనివినియెరుగనిరీతిగననినభిమన్యునిశరములయభ్రముచదలన్గనిపరిపంథులుదలచిరిదినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
ఘనమగు సూర్యతేజమును గాసిలిబెట్టగలోకమంతకున్దినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్దినకరుడస్తమించగను దేజములేకనునింపెనాయెడన్దినకరుడేగదా భువికిదీప్తిని,జీవనమిచ్చురత్నమౌ
ఇనకుల భూషణు నా రాముని వని కంపు మన మోహమున దశరథ రాజున కత్తరి నక్కసమునదినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్ దిన దిన ముప్పతిల్లఁ బగ తీవ్ర తరమ్ముగ సూర్య చంద్రులన్ ఘనముగ నొవ్వఁ జేయుటయె కార్యముగా నెదఁ దల్చు రాహువే కనలి కరమ్ము నాకమున గ్రక్కున రాహువు గ్రస్త నిష్ప్రభాదినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను జిమ్మచీఁకటిన్
కనుమరుగయ్యెను సూర్యుడుకనగను నింగిన గ్రహణము కనువిందయ్యెన్వెనుకబడె వెలుగు తూర్పునదినకరు డుదయించి దెసల తిమిరము నింపెన్
ధనువునుజేతబూనితనదాయలనుక్కడగించుచున్ సుయోధనునిమనంబునందునవెతన్ గలిగించుసుభద్ర సూనునిన్కనుగొనిధార్తరాష్ట్రుడునుకర్ణుడునాదిగయోధులొక్కటైపెనగొని తమ్మిమొగ్గరము పేర్చివధించిరి వానినంతటన్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్
కను మదె పూర్వశైలమున కాంచన వర్ణ సుశోభలన్ భళాదినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను; చిమ్మచీఁకటిన్,వెనుమరలంగ జేసె దన వేల వెలుంగుల వాడి తూపులన్;జనుల మనంబులన్ వెలిగి జాడ్యములన్ దొలగించు బూనికన్
ఘనుడనఘుండుదైత్యకులకైరవబంధువుబుట్టెతారజీవనకశిపాత్మజుండుద్రిదివౌకసకోటికిహ్లాదిహ్లాదుడా*“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*దనుజ కుమారు లోజులకు దైవము శ్రీహరి యంచు జాటుచున్
కనకకశిపుండువరములగొనిదైవమునేనటంచుగొల్వగజాటించిననువిభేదించెసుతుడుదినకరుఁడుదయించిదెసలఁదిమిరము నింపెన్
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్యదొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడియె (లేదా)దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడేనా పూరణతే.గీ.గుట్టుచప్పుడు లేకుండ గుంభనముగలంకె బిందెలఁ ద్రవ్వగా రాత్రిపూటరవ్వ చడిలేక వచ్చిరి రాజ భటులుదొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడెనుచంపక మాలవరుసకు బావ యౌటన వివాహముఁ జేసుకొనంగ జాలితో,తరుణికి నమ్మనాన్నలు గతంబగుటన్ యిరువుండ్రు సోదరీవరులనుగూడ బాధ్యతఁ వివాహముఁ జేసుకొనంగ భారమైదొరికెను లంకె బిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే ఆదిభట్ల సత్యనారాయణ
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
దినమును రాత్రినిన్ తనరి దిక్కులు తోచక గాలివాననున్
ఘనముగ నుర్ములున్ పడుచు కన్నులు మూయు తటిత్తులందునన్
కనగను మబ్బులాదటను క్రమ్మగ నేడిట హైద్రబాదునన్
దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసూర్యుడు సౌరకుటుంబం ఆవిర్భవించగా కాంతులను జిమ్మి "పెనుచిమ్మచీకటిని మాపాడు"
రిప్లయితొలగించండిచ||
ఘనతరభాస్వరాగమనకాంతుల సౌరకుటుంబమంతయున్
జననము బొందగా వెలిగె సంభవమున్ జమమెల్ల జూడ భా
వనగలుగంగ మాపెనని పారగజేయుచు కాంతి మాపెగా
దినకరుడుద్భవించి నలుదిక్కులనిం, 'పెనుచిమ్మచీకటిన్'
రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దిక్కులనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. ఒకవేళ సాధువనుకున్నా తరువాత సరళాదేశం వచ్చి 'బెను..' అవుతుంది.
అందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండినా పూరణ ప్రయత్నం..
(కార్గిల్ యుద్దములో ప్రాణాలొడ్డిన వీర సైనికుని ఉద్దేశించి)
*కం||*
వెనుదిరగక తానెప్పడు
ఘనముగ సరిహద్దునందు కార్గిల్ రణమున్
మనలను కాపాడి చితిన
*“దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్”*
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చితిని' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలక్ష్మణుడు మూర్ఛ పోయినప్పటి సన్నివేశం
రిప్లయితొలగించండికం.
తనతమ్ముని స్థితి నెరిగియు
దినకరుఁ డుదయించి దెసలఁ,దిమిరము నింపెన్
మనమున రాముని, నప్పుడు
హనుమంతుడు నగముతోడ నగుపడె నభమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నభమున్' బదులు 'దివిపై' అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వినకయె నాదు మాటలను ప్రీతిని సూనుడు కోడలమ్మయో
పనుపగ హైద్రబాదునను పండుగ పూటను మొండిజేయుచున్
కనులకు కప్పగా నలుపు గ్లాసులు సర్జరి కాటరాక్టునన్
దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఘనముగ నాకసమందున
మినమినలాడుచు వెలుగును మీఱు యుడుపులన్
కనుమరుగు నొనర్చుచు తా
దినకరుడుదయించి దెసల తిమిరము నింపెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మీఱు నుడుపులన్' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసని నిడెను భువనమందున్
రిప్లయితొలగించండిదినకరుడుదయించి , దెసల తిమిరము నింపెన్
యిను డస్తమించి యమవశ
దినమున సాయంత్రమందు తిప్పలనడుమన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసూచించిన సవరణను వాట్సపులో చూడండి.
మనుగడగడగడవణకెను
రిప్లయితొలగించండిపెనుముప్పుగగాలివానఫెళ్లునవిరిసెన్
కనగామబ్బుగ్రమ్మెను
దినకరుడుదయంచిదెసలతిమిరమునింపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనగామబ్బులుగ్రమ్మెను
రిప్లయితొలగించండిచంపకమాల:
రిప్లయితొలగించండి++++++++++++++
ఘనమగు దేశద్రిమ్మరిగ,గారడిజేయుచు మానవాళికై
శనిగను దాపురించెనిట,శారదరాత్రులు గూడ లేవనెన్
దినమునరాత్రియైన, నొక దిక్కును దోచక వైరసుండగా
దినకరుడుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య
రిప్లయితొలగించండిదినకరు డుద్భవించి నలు
దిక్కుల నింపెను చిమ్మచీకటిన్
(శ్రీకృష్ణనిర్యాణవార్తను ధర్మరాజుకు విన్నవిస్తున్న అర్జునుడు )
ఘనముగ నగ్రజా ! మనకు
ఖ్యాతిని రాజ్యము నందజేసెనే !
యనయము దుష్టశిక్షణకు
నంతయు శక్తిని ధారవోసెనే !
మనసుల నిండియున్న మన
మాధవమూర్తియె యస్తమించగా
దినకరు డుద్భవించి నలుదిక్కుల
నింపెను చిమ్మచీకటిన్ .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనసు' సాధువు కాదంటారు. "మనముల నిండి..." అనండి.
కందం
రిప్లయితొలగించండిమునివరుఁడొసగిన వరమున
మనువుకు మునుపె తరణికి కొమరుని గనియు భీ
తిని నదిని వదల మగువకు
దినకరుఁ డుదయించి దెసలఁ తిమిరము నింపెన్
చంపకమాల
మునిగొని కుంతి సేవలను, పుత్రునొసంగగ నిష్టదైవముల్,
దనరుచు మంత్రమౌ వరము రంజిల నీయ పరీక్ష సేయఁగన్
మనమునఁ దల్చి మంత్రము కుమారిగ భీతిల కర్ణమందునన్
దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమనమందిట్టుల దలచెన్
రిప్లయితొలగించండిదినకరు డుదయించి దెసల దిమిరము జంపెన్
కునుకుచు నిట్టుల బల్కెన్
దినకరు డుదయించి దెసల దిమిరము నింపెన్
పనిగొని రాక్షసాధముల భారము బాపగ ద్వాపరంబునన్
ఘన చెఱసాలయందునను కంసుని
జంపెడు నష్టసూనుడై
కునుకగ ద్వారపాలకులు గోపకులంబున వాసుదేవుడన్
దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
అర్ధరాత్రి కృష్ణజననం! 🙏🙏
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిఇనుడట క్రుంగినంత భువి నిర్లవి చేరగ లోకులెల్లరుల్
రిప్లయితొలగించండిపనులను మానిరప్పుడు, ద్విపాత్తులు కోరగ దివ్య కాంతులన్
దినకరు డుద్భవించి నలు దిక్కులనింపె, చిమ్మ చీకటిన్
దునిమి, కృషీవలుల్ పుడమి దున్నగ సాగిరి కూటకమ్ముతో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసనియె పొదగొనెను నభమున
దినకరుడుదయించి; దెసల తిమిరము నింపెన్
మినమినలాడెడి చంద్రుడు
తన మినుకది నమవసమున తగ్గిన వేళన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమునిసిపలెన్నిక లందున
రిప్లయితొలగించండితన గెలుపిక తథ్యమంచు దంభము లాడెన్
తన కలలు తారుమారయె
దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండిఘనముగ తూర్పునన్ తరణి కాంతులు జిమ్ముచు భాసురంబుగన్
మనమున జింతలన్ జెరిపి మైత్రిని జూపుచు మేలుకొల్పగా
నినకుని మ్రింగ దుష్టమది నీసుగ రాహువుపక్రమించగన్
*“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*
*వాణిశ్రీ నైనాల, విజయవాడ*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఇనకుని' ?
ఘనముగ నోట్లను పొందిన
రిప్లయితొలగించండిజన హృద యము గెల్చి నట్టి సజ్జను డతడే
మనిగెను గెలిచిన నాడే
దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిబోనసు సరదా పూరణ:
తినగను దోసెలున్ వడలు తియ్యని లడ్డుల, నర్ధరాత్రినిన్
మనమును తన్వునున్ మరువ మందపు దుప్పటి లాగి కప్పుచున్
ఘనమగు హైద్రబాదునహ కన్నులు మూయగ;...క్యాలిఫోర్నియన్
దినకరుఁ డుద్భవించి;...నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఘనముగ నాకసమ్మున ప్రకాశముతో దిశలెల్ల నెక్కొనెన్
దినకరుడుద్భవించి; నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
మినమినలాడు రేమగడు మించును జాఱ్చు నమాసమందునన్
తనకళ రూపుమాయువడి తానుగ రిక్కలగూడి పోవుచున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమనదేశమున రివాజుగ
రిప్లయితొలగించండిదినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
ఘనమౌ గ్రహణము పట్టగ ,
దినమో ఱేయో దెలియని తీరుగ నుండన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(ఎన్నికల మరుసటి రోజున కాంగ్రెసు పరిస్థితి)
రిప్లయితొలగించండిమనదే రాజ్యము తలపగ
తనయుడు రాహులు జనులకు తలుచును మేలే
ఘనముగ తెల్పెను సోనియ
దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅనఘా! పోగొట్టెనయా
దినకరుఁ డుదయించి, దెసలఁ దిమిరము, నింపెన్
కనుల మిరిమిట్లు గొల్పుచు
వినువీధిని వెలుతురున్ పవిత్రత తోడై
భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ యిచ్చెను :)
ఈ వాక్యములో ఏడుస్తున్నదెవరు ?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభార్య - ఏడుస్తూ కూర్చున్న భర్తకు...
భార్య ఏడుస్తూ - కూర్చున్న భర్తకు...
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నదానికి ఈ ప్రశ్న చక్కని ఉదాహరణ.
రిప్లయితొలగించండికందా చంప్స్ :)
అనఘా ప్రకాశమున్ క్ర
న్నన దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నిం
పెను, చిమ్మచీఁకటిన్ ద్రో
లి నూతనత్వమును నింపి లెస్సగ సుదతీ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘనుడనఘుండుదైత్యకులకైరవబంధువుబుట్టెతారజీ
రిప్లయితొలగించండివనకశిపాత్మజుండుద్రిదివౌకసకోటికిహ్లాదిహ్లాదుడా
*“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*
మనముననానరద్విషునాధిపునంతముతథ్యమౌటచే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదంలో గణభంగం. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅనయము బంధుమిత్రులను నక్కునజేర్చ భయమ్ముఁ గూర్చె, నిం
రిప్లయితొలగించండిటిని చెరసాలఁ జేసె, వికటించగ స్వాస్థ్యము వెజ్జు చూడ, డా
దినసరికూలి కూలె నిల, తీవ్రరయప్రసరత్కరోనదు
ర్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్.
దుర్దినకరుడు = దుర్దినమును చేయువాడు.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅనితర సాధ్యుడున్ ఘనుడు యాదవ సూనుడు సర్వదక్షుడై
రిప్లయితొలగించండిపనిగొనె సైంధవున్ దునుమ పాండవ మధ్యమునాత్మ శాంతికై
ఘనమగు చక్రమున్ విసర గ్రక్కున సూర్యుని మూయ నంతలో
దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనవరతంబు నీ జగతి నంతట రోగము లీతి బాధలున్
రిప్లయితొలగించండికనులను గాంచుచున్ కుమిలి కష్టములే సహవాసముండగన్
దినమొక గండమై గడుపు దీనుని జీవనమున్ గనంగ నీ
దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅనుదినమునుపంచువెలుగు
దినకరుడుదయించి,దెసలతిమిరము నింపెన్
మునిమాపునతా మునుగుచు
జనులికవిశ్రాంతి పొందు సమయమటంచున్
.
అనవరతము వ్యవధానము
రిప్లయితొలగించండిపనియన్ననుమేలు రేబవలు నొకటౌనా
మనుజులు దినమును మరచిరె
దినకరుఁ డుదయించి దెసలఁ తిమిరము నింపెన్ !!
(వర్క్ ఫ్రం హోం భాదితుల జీవనవిధానం)
మునుకొని పో ద్రోలె జగతి
రిప్లయితొలగించండిదిన కరు డుదయించి దెసల దిమిరము : నింపెన్
ఘనముగ మబ్బులు గ్రమ్మగ
పెను చీకటు లావరించె పేర్మిగ నుర్విన్
ఘనమగు కాంతియె విరిసెను
రిప్లయితొలగించండిదినకరుడుదయించి దెసలఁ, దిమిరము నిండెన్
మినురతన మస్తమింపగ
జనులు పడకటిల్లు జేరి శయనింతురికన్
ఘనమాంగ్లమ్ముని యెంచుచు
రిప్లయితొలగించండితెనుగు జదవనట్టివాడు తిమిరమె యన్నన్
మినుకని తలచుచు పలికెను
దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
ఘనుడగు పద్మనాభుదయ కల్గెను పుత్రుడటంచు ప్రేమతో
రిప్లయితొలగించండిమునుకొని పెంచ వాని కడుమోదముతోడుత, తల్లిదండ్రులన్
వినయము వీడి దూరుచును వేదన పెట్టగ, తండ్రి పల్కె దు
ర్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్
అనయము గాంతిని నింపును
రిప్లయితొలగించండిదినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్
దినకరుడేగిపడమరకు
దినకరుడేమూలమార్య!దివికిన్భువికిన్
ఉ:
రిప్లయితొలగించండిఘనమగు భారతావనిని గంపెడు నాశలు పల్లవించగన్
కనికర మింత లేక కడు కర్కశ రీతిని తూట పేల్చగన్
పణముగ బెట్టె ప్రాణములు పాపము గాంధి తలంచ నివ్విధిన్
దినకరుడుద్భవించి నలు దిక్కుల నింపెను చిమ్మ చీకటిన్
వై.చంద్రశేఖర్
కనివినియెరుగనిరీతిగ
రిప్లయితొలగించండిననినభిమన్యునిశరములయభ్రముచదలన్
గనిపరిపంథులుదలచిరి
దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘనమగు సూర్యతేజమును గాసిలిబెట్టగలోకమంతకున్
రిప్లయితొలగించండిదినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్
దినకరుడస్తమించగను దేజములేకనునింపెనాయెడన్
దినకరుడేగదా భువికిదీప్తిని,జీవనమిచ్చురత్నమౌ
ఇనకుల భూషణు నా రా
రిప్లయితొలగించండిముని వని కంపు మన మోహమున దశరథ రా
జున కత్తరి నక్కసమున
దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
దిన దిన ముప్పతిల్లఁ బగ తీవ్ర తరమ్ముగ సూర్య చంద్రులన్
ఘనముగ నొవ్వఁ జేయుటయె కార్యముగా నెదఁ దల్చు రాహువే
కనలి కరమ్ము నాకమున గ్రక్కున రాహువు గ్రస్త నిష్ప్రభా
దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను జిమ్మచీఁకటిన్
కనుమరుగయ్యెను సూర్యుడు
రిప్లయితొలగించండికనగను నింగిన గ్రహణము కనువిందయ్యెన్
వెనుకబడె వెలుగు తూర్పున
దినకరు డుదయించి దెసల తిమిరము నింపెన్
ధనువునుజేతబూనితనదాయలనుక్కడగించుచున్ సుయో
రిప్లయితొలగించండిధనునిమనంబునందునవెతన్ గలిగించుసుభద్ర సూనునిన్
కనుగొనిధార్తరాష్ట్రుడునుకర్ణుడునాదిగయోధులొక్కటై
పెనగొని తమ్మిమొగ్గరము పేర్చివధించిరి వానినంతటన్
దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్
కను మదె పూర్వశైలమున కాంచన వర్ణ సుశోభలన్ భళా
రిప్లయితొలగించండిదినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను; చిమ్మచీఁకటిన్
,వెనుమరలంగ జేసె దన వేల వెలుంగుల వాడి తూపులన్;
జనుల మనంబులన్ వెలిగి జాడ్యములన్ దొలగించు బూనికన్
ఘనుడనఘుండుదైత్యకులకైరవబంధువుబుట్టెతారజీ
రిప్లయితొలగించండివనకశిపాత్మజుండుద్రిదివౌకసకోటికిహ్లాదిహ్లాదుడా
*“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*
దనుజ కుమారు లోజులకు దైవము శ్రీహరి యంచు జాటుచున్
కనకకశిపుండువరముల
రిప్లయితొలగించండిగొనిదైవమునేనటంచుగొల్వగజాటిం
చిననువిభేదించెసుతుడు
దినకరుఁడుదయించిదెసలఁదిమిరము నింపెన్
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండిదొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడియె
(లేదా)
దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే
నా పూరణ
తే.గీ.
గుట్టుచప్పుడు లేకుండ గుంభనముగ
లంకె బిందెలఁ ద్రవ్వగా రాత్రిపూట
రవ్వ చడిలేక వచ్చిరి రాజ భటులు
దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడెను
చంపక మాల
వరుసకు బావ యౌటన వివాహముఁ జేసుకొనంగ జాలితో,
తరుణికి నమ్మనాన్నలు గతంబగుటన్ యిరువుండ్రు సోదరీ
వరులనుగూడ బాధ్యతఁ వివాహముఁ జేసుకొనంగ భారమై
దొరికెను లంకె బిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే
ఆదిభట్ల సత్యనారాయణ