13, డిసెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3573

14-12-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్”

(లేదా…)

“హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్”

67 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  ఖండింపంగను రామభక్తులనహో ఖడ్గమ్ములన్ బట్టుచున్
  దండింపంగను భాజపా జనులనున్ దండంబులన్ బెట్టుచున్
  చండీపూజను వంగ దేశముననున్ జంబమ్ముతో దీదికై
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్...

  రిప్లయితొలగించండి
 2. 13.12.2020
  అందరికీ నమస్సులు🙏

  నా పూరణ ప్రయత్నం..

  *కం||*

  దండిగ సొమ్ములు దోచుచు
  మెండుగ మోసములు జేసి మేలును వీడన్
  పండగ నా యాసలనుచు
  *“హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్”*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*

  రిప్లయితొలగించండి
 3. పండుగకుపరులధనమును
  మెండుగవాడెడికుజనులనేర్పునునిలుపన్
  చండికచాలదుఔరా
  హుండీలోధనమువేయుటోప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఖండింపంగను హిందు ధర్మమునుతా కమ్యూనిజం గొల్చుచున్
  బండారమ్ముల దోచుచున్ విరివిగా బంగారుకై గుళ్ళనున్
  గండంబందున ప్రాణరక్షణకునున్ కంగారునున్ జెందుచున్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్...

  రిప్లయితొలగించండి
 5. దండిగ సంపాదించిన
  మెండుగ దానమ్ముజేయ మెచ్చిన పనులే
  కొండొకచోపల్కిరిటుల
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్!!

  రిప్లయితొలగించండి

 6. బోనసు సరదా పూరణ:

  తుండంబందున గ్రుక్కి లడ్డులననున్ తోరంపుదౌ బొజ్జకున్
  కుండల్ తోముచు ఛందమున్ చదువకే కూసింతనున్ నేరుగా
  గండంబయ్యెడి కైపదమ్ముగనుచున్ కందీశుదౌ మెప్పుకున్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ 'బోనసు' పూరణ బాగున్నది. అభినందనలు.
   కంది శంకరుని హుండీలో వేసిన ధనం సాహితీ సద్వినియోగమే అవుతుంది. _/\_

   తొలగించండి
 7. మెండుగ కరుణను గల్గియు
  నిండగు హృదయంబు తోడ నిరు పేదకు దా
  నండగ నిలువక మ్రొక్కుచు
  హుండీ లో ధనము వేయు టొప్పె ట్టు లగున్

  రిప్లయితొలగించండి
 8. భాండాకారముబ్రహ్మలోకమనితాభావించుశోభాక్రుతిన్
  పుండ్రంబున్ఘనఫాలభాగమునప్రఫుల్లంబుగాఁదీర్చియున్
  షండుల్కోందరుదైవలీలయనితాశంభున్వడిన్దోచిరే
  హుండీలోధనమ్మువేయుపనియెటలోప్పౌనుతప్పేయగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. సంయుతాసంయుత ప్రాసను వేసారు. దోషం కాకున్నా ఇటువంటి విశేష ప్రాసలను ప్రయోగించకుంటే మంచిది.

   తొలగించండి
  2. తప్పుదిద్దుకుంటానుక్షమించగలరు

   తొలగించండి
 9. నిండగు మనంబుతోడుత
  చండిని గొలవంగలేక జవమున గోర్కెల్
  మెండుగ దీరగ దండిగ
  హుండీలో ధనమువేయు టొప్పెట్టులగున్?

  కండల్గల్గిన కార్పొరేటు దొరలే కాసుల్ గడింపంగ నౌ
  మెండౌరీతిని మంత్రివర్యులకు దామెన్నో ప్రసాదాలనున్
  దండింపంగను వీలులేని విధమున్
  దాతృత్వమున్ బేరిటన్
  హుండీలోన ధనమ్మువేయు పని యొట్లొప్పౌను తప్పేయగున్!

  ప్రసాదాలు = బహుమానాలు, కాన్కలు (పార్టీ ఫండ్స్ )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిండియె దొరకనివానిని
   తుండిలుడౌ నాయకుండు తోరపుకఱవున్
   ఫండును గోరగ పార్టికి
   హుండీలో ధనమువేయు టొప్పెట్టులగున్ ?

   తొలగించండి
  2. దుండగులే నాయకులై
   దండగ పార్టీకిఫండు దనుజులవోలెన్
   నిండిన కన్నీటి దుడిచి
   హుండీలో ధనమువేయు టొప్పెట్టు లగున్?

   తొలగించండి
  3. మండీలందున దుండగీడు లకటా
   మద్యంపు మత్తున్ బడిన్
   దండెత్తంగ వసూళ్ళకై వెరపునన్
   దైన్యంపు వ్యాపారులే
   దిండుల్ క్రిందను చేయిబెట్టి త్వరనున్ తీండ్రించు కోపమ్ముతో
   హుండీలోన ధనమ్మువేయు పని యొప్పెట్లౌను తప్పేయగున్

   తొలగించండి
  4. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  5. ధన్యవాదములాచార్యా! నమస్సులు! 🙏🙏🙏

   తొలగించండి
 10. కందం
  నిండెన్ నాలో దైవము
  పండింపఁగ నొక్క కాన్క పదులన్ మీకున్
  రండి! యను దొంగ బాబా
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్?

  శార్దూలవిక్రీడితము
  గుండెన్ నిండెను సాయి నాకని తనన్ గుర్తించ స్వార్థమ్ముతో
  జెండాలెత్తెడు మూక వెంటగొనుచున్ జిత్రాతి చిత్రమ్ముగన్
  దండల్ దాలిచి 'యొక్క కాన్క పదులన్' దక్కించు మీకంచనన్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను? తప్పేయగున్!

   

  రిప్లయితొలగించండి
 11. ఖండింపకు నా నుడి బ్ర
  హ్మాండమ్మేలు ఘనుడు పరమాత్ముండతడీ
  చండాలపు ధనమడుగునె?
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 12. ఖండింపన్ వలదంటిరా! గుడులనీ కాలంబులో కట్టిరే
  చండాలంబగు యుక్తితో ధనమునే సాధింపగా నెంచి, బ్ర
  హ్మాండమ్మేలెడు వాడికేల నిధిరా? యాలోచనన్ జేసినన్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్

  రిప్లయితొలగించండి
 13. ఎండిన కడుపుకు వేయక
  పండుగ నాడున తిరిపము పళ్యము నందున్
  వండిన యన్నము నమలుచు
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పండుగ నాడును/నాటన్' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 14. పండుగనాడు బుగితికై
  బండి పయిన దేవునుంచి
  వాకిటనిలువన్
  తండులమునీయకుండగ
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి


 15. గుండెల నిండుగ భక్తిని
  మెండుగ నిలుపుకొని వేయ మేలగునయ్యా
  దండిగ దాష్టీకమ్ముల
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. భాండాగారము పొంగి పొర్లునటు సంపాదించి, యూరంతయున్
  గూండారాజ్య మొనర్చి తొత్తులఁ దగాకోర్లన్ ప్రపోషించి, తా
  న్ముండాకోరయి త్రాగుబోతయిన పాపోష్ఠుండు మన్నింపుకై
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తొత్తుల' తర్వాత అరసున్న అవసరం లేదు.

   తొలగించండి
 17. సమస్య :-
  “హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్”

  *కందం**

  మండే యెండన సైతము
  పండించగ రైతు సతము పాట్లు పడు కదా!
  తిండినిడెడు భగవంతుడు.
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్
  ....................✍️ చక్రి

  రిప్లయితొలగించండి
 18. సమస్య

  హుండీలో ధనము వేయుటొప్పెట్టులగున్

  నా పూరణ

  కందము

  దండిగ భక్తులు ముడుపులు
  నిండుగ తమ కోర్కె మీర నిరతము వేయన్
  దండుగ ఖర్చులు జేసిన
  హుండీలో ధనము వేయుటొప్పెట్టులగున్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 19. గుండెల్బిండెడుబాధకంతమనిసద్గోష్ఠిన్వదానత్వమే
  మెండౌధర్మమటంచుశ్రీలనిడిబేర్మిన్జాటిసంతృప్తితో
  *“హుండీలోన ధనమ్ము వేయు; పని యెట్లొప్పౌను తప్పే యగున్”*
  గుండెల్జీల్చెడునాయకాధములుసిగ్గున్వీడిభక్షించినన్

  రిప్లయితొలగించండి
 20. ఎండోమెంటు డిపార్టమెంటనుచు నేదేదో కటా! చట్టమున్
  భాండాగారము నింపు లక్ష్యమున దౌర్భాగ్యార్చకాళిన్ దగన్
  దండించన్, ఘననాయకోత్తములు విత్తమ్మున్ వృథా చేయగన్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 21. దండుకొని పాపి, తిరుమల
  కొండల బ్రహ్మాండ నాయకుండని నమ్మీ
  ముండనమున్ గావించుక
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్?

  రిప్లయితొలగించండి
 22. దండగ ఖర్చులు బదులుగ
  హుండీలోధనమువేయుటొప్పె,ట్టులగున్
  బండరినాధునిగరుణలు
  మెండుగమనమీదయుండి మేలగుకతనన్

  రిప్లయితొలగించండి
 23. అండనిడక పూజారికి
  పండుగ చేసుకొన జూడ పాలకు లచటన్,
  దండుగ యూనీ భక్తులు
  హుండీలో ధనము వేయుటొప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 24. నిండగు మాటౌనా యిది
  హుండీలో ధనమువేయు టొప్పెట్టులగున్?
  మండిత మూర్తికి సేవలు
  దండిగ జరుగంగనెపుడు దక్షిణ సబబే!

  రిప్లయితొలగించండి
 25. మైలవరపు వారి పూరణ

  గుండెల్దీసినబంటితండు కడుమూర్ఖుండైన హీనాతిహీ...
  నుండౌ వీడొక మేకవన్నెపులి యెంతోమంది స్త్రీ మూర్తులన్
  నిండాముంచినవాడు పెద్దల గనన్ నిందించువాడివ్విధిన్
  హుండీలోన ధనంబు వేయుపని యెట్లొప్పౌను తప్పేయగున్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 26. హుండీయాదాయానికి
  గండిపడుటననుదినమునుకనుగొని భక్తుల్
  వెండియుఁదలబోసిరిటుల
  హుండీలో ధనము వేయు టొప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 27. హుండీయందునభక్తకోటి తమ భక్త్యుత్పత్తులన్ జూపి బ్ర
  హ్మాండంబౌ విలువైన కానుకలు బ్రహ్లాదంబుగా వేయగన్
  హుండీ దొంగలు మూషికాలవలెనా హుండీకి కన్నంబిడన్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్

  రిప్లయితొలగించండి
 28. రిప్లయిలు
  1. హుండీలోనధనమ్ము వేయుపనియెట్లొౌప్పౌనుతప్పేయగున్
   హుండీలోనధనమ్మువేయుటను దప్పౌనౌయటన్ బాడియే
   యాండాళ్వారులుపూజజేతురుగదాయాదేవతామూర్తులన్
   భాండాగారములన్నియున్ధనముతోవర్ధిల్లగానెప్పుడున్

   తొలగించండి
 29. మెండుగ తప్పులు చేయుచు
  దండిగ నార్జనము చేసి యక్రమ రీతిన్
  పిండుచు దేవుని గుడిలో
  హుండీలో ధనమువేయుటొప్పెట్టులగున్.

  రిప్లయితొలగించండి
 30. ఉండుము సహనమ్మున మి
  త్రుం డరుదెంచ వలె వచ్చు దూర్ణ మిచటకున్
  భండనభూమి విగత బా
  హుం డీ లో ధనము వేయు టొప్పెట్టు లగున్


  భాండాగారము దోఁచి మోసమున సంపాదించి విత్తమ్ము బ్ర
  హ్మాండాభమ్ములు వేశ్మ రాజములు దేవాగారముల్ గాంచుచున్
  దండం బింపుగఁ బెట్టి పేటికల నీ దర్పుండు దుష్టుండు ద్రో
  హుం డీ లోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్

  [ద్రోహుండు =ఈ లోన = ద్రోహుం డీ లోన]

  రిప్లయితొలగించండి
 31. చిలుకూరు బాలాజీ గుడి పద్దతిగా ఈ నా ప్రయత్నము:

  శా:

  దండం బెట్టగ చాలనందురు గదా తాదాత్మ్యమున్ భక్తితోన్
  కొండల్రాయని వేడ భూరి కలగా గూర్చంగ వీసాలనున్
  గండమ్మేమియు లేక నున్నతియె సింగారించగా భక్తులన్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 32. పండున్ జీవిత మెప్పుడీ పుడమిపై భవ్యంబుగా తప్పకన్
  చండిన్ నిత్యము గొల్చుచున్ మది కడున్ సద్భక్తితో నిష్ఠతో
  నండన్ జూపిన కాంచి మానసములో నత్యంత కీనాశులన్
  హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్

  రిప్లయితొలగించండి
 33. భండాసుర,భస్మాసుర,
  ఛండాలులపు,జార,చోర,చాదస్తంబుల్,
  మెండై నుండెడు వారల
  హుండీలో ధనమ్ము వేయుటొప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి


 34. పండన్ బాపములెన్నియో విరివిగా భాగ్యాల నార్జించియున్

  కొండల్ సేరి యనేకములౌ వరములన్ గోరంగ దైవంబునున్

  దండంబుల్ యొనరించి స్వార్థములతో తల్లాభ మాశించియున్

  “హుండీలోన ధనమ్ము వేయు పని యెట్లొప్పౌను తప్పే యగున్”


  రిప్లయితొలగించండి