7, డిసెంబర్ 2020, సోమవారం

సమస్య - 3567

8-12-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు”

(లేదా…)

“కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్”

47 కామెంట్‌లు:

  1. అందరికీ నమస్సులు

    ఈ జన్మ గత జన్మ వాసనలన్నీ పోవడానికి, మానవ మనుగడకు సంబంధించినవన్నీ అనుభవించాకే మొక్షం కలుగుతుంది.

    కమలనూపురశక్తిపథంబు అని వాడాను.. ఇది రాజయోగరహస్యమార్గమునకు పర్యాయము గా వాడాను. స్వమీ వివేకానందులకు నుతులు.🙏🏻🙏🏻

    ఉ||
    నోములు నోచినన్ కమలనూపురశక్తిపథంబునేగినన్
    భూమిని బుట్టువారలకు వోవు గదా కృతజన్మవాసనల్
    ప్రేమలు ద్వేషముల్ వివిధ వేషములన్ విడ గల్గు మోక్షముల్
    కాముకులైన యోగులకె గాక లభించు పరంబునేరికిన్?

    ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    ప్రేమను జూపి కాంతకును వేడుక తీరగ కాపురమ్మునన్
    నీమము లన్నియున్ మరచి నిక్కుచు నీల్గుచు నైహికమ్ములన్
    కామము మోహమున్ విడిచి గట్టిగ నేడ్చుచు మోక్షమందునన్
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్...

    రిప్లయితొలగించండి
  3. కావలెనని తపము చేసి కైవల్యము
    కోరి తాము కష్టములను కోరి నిలచు
    సాధువులగు సత్పురుషులకు సద్య ముక్తి
    కాముకులగు యోగులకె మోక్షమ్ము దక్కు

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కామము మీర వేశ్యకడ గమ్మున జేరుచు రోజురోజునన్
    ప్రేమను పెంపగా వదిన పెక్కులు కోర్కెలు నీచమైనవౌ
    వేమన రీతిగా విడిచి ప్రేమను పల్కుచు పద్యమందునన్
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్...

    రిప్లయితొలగించండి
  5. అందరికీ నమస్సులు🙏
    తే"

    ఇహ సుఖములకు లొంగక నహరహంబు
    నాత్మయందు నిండిన బరమాత్మ నెరుగ
    నియతి తోడ సాధనసల్పు నిత్య మోక్ష
    *కాముకులగు యోగులకె మొక్షంబు దక్కు*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  6. సకలు రుద్యోగ వ్యాపార చతురు లగుచు
    వంచ నన్నది యేనాడు నెంచ బోక
    సర్వము భగవదర్పణ సల్పు న య్య
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు.

    రిప్లయితొలగించండి

  7. బోనసు సరదా పూరణ:

    కంది గురువులకు అంకితం (మంచి మార్కులు కోరుచూ)

    నీమము తప్పకే భళిగ నేడును నిన్నను పెక్కు వత్సముల్
    గోముగ కైపదమ్ములిడి గొప్పగ దిద్దుచు పూరణమ్ములన్
    ప్రేమను నేర్పి పద్యములు ప్రీతిని ఛందపు తెల్గుభాషనున్
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్...

    రిప్లయితొలగించండి
  8. కామియెమోక్షగామియగుకాదనలేనిదిసత్యమిద్దియౌ
    ధామముఁజేరుయోగులకుదారినిఁజూపునుకామసుందరే
    తామసక్రీడతోడుతనుతాఁగనెస్రుష్టినిశంకరుండునున్
    కాముకులైనయోగులకెకాకపరంబులభించునేరికిన్

    రిప్లయితొలగించండి
  9. పూర్వ జన్మలో జేసిన పూజ ఫలమె
    మానవుని జన్మ మెత్తుటన్ మరువ కుండ
    అంతయును పరమాత్మమయమని నమ్ము
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    రామకృష్ణపరమహంస రమణులాది
    యోగిపుంగవుల్ మానవ యున్నతికిని
    బోధనల నంకితమ్మునై పూను పుణ్య
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు

    ఉత్పలమాల
    భూమిని సర్వమానవ సమున్నతి కోరిన రామకృష్ణులున్
    స్వాములు జ్ఞానమార్గ రమణాఖ్యులు నాదిగ యోగిపుంగవుల్
    సేమమొసంగ బోధనలఁ జిన్మయు గాంచెడు బాటజూప స
    త్కాముకులైన యోగులకె కాక పరంబు లభించునేరికిన్?

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻

    ఇది సరదా పూరణ కాదు. వెక్కిరింపు అంతకన్నాకాదు. నా భావన మాత్రమే.

    ప్రేమను తల్లిదండ్రులటు పేరును బెట్టగ శంకరయ్యనిన్
    దామిటు పెద్దవాడగుచు తాలిమి తోడుత జిత్తముంచుచున్
    ధీమతుడౌచు శారద యధీకృత పద్యవ ధానమందునన్
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్?

    రిప్లయితొలగించండి
  12. పాప హేతువు లని భవ బంధములను
    వీడి శివనామ మొక్కటే వివధములని
    యవిరతమ్మును జపియించు నట్టి ముక్తి
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు

    రిప్లయితొలగించండి
  13. వాదులాడగముదమునవనితతోను
    శంకరుండునుతలచెనుసాధకుండు
    తానుపరకాయమందునతపసుఁజేసె
    కాముకులగుయోగులకెమోక్షంబుదక్కు

    రిప్లయితొలగించండి
  14. పూర్వజన్మ ఫలితముగ పుడమి పయిన
    పుట్టి , పెంచిన భవబంధముల విముక్తి
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు
    కామితము లేక ఫలమేమి కానరాదు

    రిప్లయితొలగించండి
  15. పుణ్య కృత్యాల నొనరించి పుడమి యందు
    పేద వారికి సాయమ్ము ప్రీతి సలిపి
    పరుల కుపకరించి యు దైవ భక్తి గలుగు కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిశ్చలమగు నాదటతోడ నీలగళుని
    నామము నహరహమ్ముగ నచ్చగునటు
    జపమొనర్చెడి దీక్షను సాగు ముక్తి
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు.

    రిప్లయితొలగించండి
  17. కామము క్రోధముల్ విడిచి గమ్యము దివ్య పదమ్మటంచున్
    నేమము తప్పకుండ కడు నిష్ఠగ నిత్యము రామనామమున్
    వేమరులుచ్చరించెడి పవిత్రుడు తావిషమేగ నెంచెడిన్
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

    రిప్లయితొలగించండి
  18. వేదసారములన్నిటి వేరుబరచి
    గీతగాజెప్ప మనుజుల వెతలబాప
    నట్టి మాటల సతతము తలచు ముక్తి
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నీమము తోడ డెందమున నిమ్మును గూడుచు విష్ణునామమున్
    గోముగ సన్నుతించుచు నకుంఠిత దీక్షను వాలయమ్ముగన్
    తాము జపమ్మొనర్చుచు సదాగతి గూడగ నెంచుచుండు నా
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్?

    రిప్లయితొలగించండి
  20. సమస్య :
    కాముకులైన యోగులకె
    కాక పరంబు లభించు నేరికిన్

    ( విశ్వమానవుడు )
    ఉత్పలమాల
    ...................

    నీమము బాయకన్ సమత
    నెల్లరి క్షేమము గోరువారలై ;
    నామము విశ్వనాథునిది
    నర్తనసేయగ గుండెలోపలన్ ;
    మేమును మీరటంచనక ;
    మీరక ధర్మము ; ముక్తికన్యకా
    కాముకులైన యోగులకె
    కాక పరంబు లభించు నేరికిన్ ?

    రిప్లయితొలగించండి
  21. సమస్య :-
    “కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు”

    *తే.గీ**

    ఒప్పు తప్పు లెరిగిగూడ యోర్పు కలిగి
    ధర్మ మార్గము నడయాడు దార్శనికులు
    కోపమునకింత తావీయకుండు శాంతి
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు
    .....................✍️చక్రి

    రిప్లయితొలగించండి


  22. సత్య మిదె సత్యము సరసిజాక్షి మదిని
    భక్తియనెడు కవ్వముతోడు బాగు చిలుకు
    రాము డే దైవ మనుచు శరణమతడను
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. నిన్నటి పూరణ

    అరయగఁ బ్రాప్తమెంతటిదొ యంత లభించునె గాని యాశతో
    మురిసినఁ గష్టమే మిగులు, మోహమదేలనొ? యత్నలబ్ధమే
    వరహితసౌఖ్యకారి యని భావన లేని యొకానొకండహో!
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే.

    నేటి పూరణ

    భూమిక లైనవారు పరిపూరితభక్తికి
    చింతనారతిన్,
    శ్రామికు లైనవారలు నిరంతరపుణ్యకృతమ్ము నందు, ని
    ష్కాముకు లైన వారు కృతకార్యఫలాప్తుల యందు, మోక్షధీ
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్.

    మోక్షధీ = మోక్షబుద్ధి యందు కోరికగలవారు.

    కంజర్ర రామాచార్య‌

    రిప్లయితొలగించండి

  24. అహం కాలోస్మి !

    జరా ఇన్ వెస్ట్ కరో టైమ్ ఈశ్వర్ పర్ :)
    టైం ఈజ్ మనీ మనీ ఈజ్ ఎనర్జీ

    రాముడె నాకు‌ దైవమని వ్రాయుచు పద్యములెల్ల వేళలన్
    శ్యాముడె నాకు వేల్పనుచు సాచివిలోకితమైన దృష్టికై
    నీమము నెమ్మి బత్తియు వినిర్మలమై పరమాత్మ పై సదా
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్?


    జిలేబి


    రిప్లయితొలగించండి
  25. కామముక్రోధమిర్వరనుగాల్చిననేమదలోభమత్సరాల్
    సామముభేదదానములసద్గతిమార్గముగోరు,మోక్షమన్
    గామముగోరుకాయమిదిక్షత్రులిహానవిరక్తికాంతతో
    *“గాముకులైన, యోగులకె కాక పరంబు లభించు నేరికిన్”*

    రిప్లయితొలగించండి
  26. స్వార్థచింతనవిడనాడి స్వచ్ఛమైన
    భక్తిభావమునెదయందుబాదుగొలిపి
    నశ్వరముగాని శాశ్వత విశ్వశాంతి
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు

    రిప్లయితొలగించండి
  27. తామరసాక్షు నచ్యుతుని దైవత లోక సుధాంబుధిన్ పరం
    ధాముని నీరజోదరు గదాధరు నవ్యయు నాది దేవునిన్
    రాముని ధ్యానమందె మది లగ్నము జేయుచు మోక్షమార్గమున్
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు


    1. గాధినందను డయ్యెడకామమతిని
      పొందుగోరగ వచ్చినపొలతివలపు
      దీర్చియయ్యును మోక్షంబువచ్చెగాన
      కాముకులగుయోగులకెమోక్షంబుదక్కు
      మోక్షమునకుకాదడ్డుసూచొక్కుభువిని

      తొలగించండి
  29. * 8-12-2020
    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
    *“కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు”*
    (లేదా…)
    *“కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్”*


    తే.గీ.

    పరుల ధనముల కాశలు పడనివారు
    నిత్య దైవ స్మరణమున నియతిఁగలిగి
    సమయ పాలనఁ జేసెడు సంయమమున
    కాముకులగు యోగులకె మోక్షమబ్బు

    ఉత్పలమాల మాల

    రాముని నామమందుకడు రాగముఁ గల్గిన భక్తి పూరతన్
    నీమముతోడ కాలమును నిత్యము యోగము ,దైవచింతయున్,
    ధీమహ నీయతన్ సలిపి తీవ్రత రంబగు యోగ శక్తిలో
    కాముకులైన యోగులకెగాక పరమ్ము లభించునేరికిన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  30. నేటి భారతమ్మునఁ గాంచఁ బాటవమున
    గీత వాక్యమ్ము లను వగు రీతి నీ పు
    డమిఁ బలుకు వార లైన చట్టముల నుండి
    కాముకు లగు యోగులకె మోక్షంబు దక్కు


    దామపిచండు పూజలనె తథ్యము మోక్షము ధాత్రి నెంచ సౌ
    దామనిఁ జేతఁ బొందని విధమ్ముగ నెన్నఁడు భోగ భామినీ
    కాముకు లైన లౌకికులు కానఁగఁ జాలరు మోక్ష భామినీ
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

    రిప్లయితొలగించండి
  31. నీమమువీడకెన్నడును నిర్మలచిత్తముతోడనా పరం
    ధామునిదివ్యనామమునుధారణగా జపియించు భక్తులన్
    దీమసమొప్పకామితముదీర్చునుదైవము మోక్షసాధనా
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

    రిప్లయితొలగించండి
  32. మైలవరపు వారి పూరణ

    శ్రీమధుసూదనాంఘ్రిసరసీరుహసేవన నిత్యకృత్యమై
    సామసుమంత్రనాదవిలసన్ముఖులై పరమేశ్వరార్చనన్
    నేమమునన్ జరించెడి మునీశ్వరకోటికి ముక్తియన్ రమా...
    కాముకులైనయోగులకె కాక,పరంబు లభించు నేరికిన్?

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  33. కాముకులైనయోగులకెకాక పరంబులభించునేరికిన్
    నీమముతోడనన్ శివునినీటనుబాలను బూజజేయుచో
    గామముశుద్ధమైప్రజకుగారవమబ్బుచునెల్లవేళలన్
    దామసులైనబొందునిలదద్దయుమోక్షముదప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  34. ఉ:

    నీమము లేదు నిష్ఠ యన నింతయు లేదు భ్రమింప జేయుచున్
    నామము లెట్టుచున్ బ్రజల నాడిని దెల్వగ మభ్యపెట్టుచున్
    సామము కూర్తు మంద్రు నిక సాగవు నాటలు వారలింతగా
    కాముకులైన; యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

    సామము=శాంతము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో ప్రయత్నము

      ఉ:

      నీమము నిండు నిష్టయన నెంతయొ నొప్పగ నెల్ల వేళలన్
      సోముని గొల్చుచున్ మిగుల శోభను గూర్చు నఖండ దీక్షతో
      నామము లెంచుచున్ తనరి నమ్మిక వీడని దైవ చింతనా
      కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  35. కాముడు కానిచో ముగితి కల్గుట దుర్లభ మంద్రు పృథ్విపై
    ధామములన్ త్యజించుచును దావములందు తపమ్ము చేయుచున్
    భామలు తారసిల్లగను వాంఛితముల్ నెరవేర్చునట్టి యా
    కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

    రిప్లయితొలగించండి
  36. ౧.
    మౌనివంటి వేషము వేసి మనగలేక
    చిత్తశుద్ధి యె లేనట్టి చింతనలను
    జేయ నిశ్చయించెడి వారి సేమ మరయ
    కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు!!

    ౨.
    ప్రేమను పంచి యిచ్చి పలు రీతుల దానము ధర్మముల్ సదా
    రాముని నామమున్ దలిచి రాగము భోగములందు టేలనన్
    నేమము దప్పకుండగను నిల్పమనస్సు న సంతసమ్మ, ని
    ష్కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్!!

    రిప్లయితొలగించండి
  37. త్యాగరాజస్వామి మొదలైన వాగ్గేయకారులు 🙏🙏🙏

    కామనలన్నియున్ ప్రభుని గాంచుట యందు నియుక్తమైనవై
    ప్రేమనురంగరించి బహువేడుక బాడుచు కీర్తనల్ పరం
    ధాముని జేరగా నెపుడు తల్లడ మొందెడి నాత్మదర్శనా
    కాముకులైన యోగులకెగాక పరంబు
    లభించు నెవ్వరికిన్

    రిప్లయితొలగించండి
  38. నోములవెన్నినోచినను నొవ్వకజేసిన,భర్తపిల్లలన్
    ప్రేమవిషాదమై నిలువ,పేరుధనమ్ములవేమిజేయునో?
    గోముగ నుండుకాతలకు,గోకుల కృష్ణునితీరుగాంచగా
    కాముకులైన యోగులకె కాక పరంబులభిం చునేరికిన్
    ++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి

  39. హేమము గూడబెట్టినను
    హేలగ లోకము జుట్టివచ్చినన్
    సీమలనేలు రాజులు వ
    సించెడి సౌధపు సౌఖ్యమబ్బినన్
    సామము తోడ హృత్సదన సౌరభమందగజేయు సత్కృపా
    కాముకులైన యోగులకె
    కాక పరంబు లభించు నేరికిన్!

    రిప్లయితొలగించండి